1 దినవృత్తాంతాలు
గ్రంథకర్త
1 దినవృత్తాంతములు గ్రంథంలో గ్రంథకర్తను పేర్కొనలేదు. యూదుల సంప్రాదాయ గాథ ప్రకారం ఎజ్ర శాస్త్రి ఈ గ్రంథం రాసాడు. ఇది ఇశ్రాయేల్ వంశాల జాబితాలో ఆరంభమవుతున్నది. ఐక్య ఇశ్రాయేల్ రాజ్యంపై దావీదు పరిపాలన వివరాలతో గ్రంథం కొనసాగి పాతనిబంధనలో ప్రసిద్దుడైన దావీదు గూర్చిన వివరాలను అందిస్తున్నది. ప్రాచీన ఇశ్రాయేల్ రాజకీయ మత చరిత్ర వివరాలు ఇందులో వున్నాయి.
రచనా కాలం, ప్రదేశం
సూమారు క్రీ. పూ. 450 - 425
ఇశ్రాయేలియులు బబులోను చెరనుండి తిరిగి వచ్చిన తరువాత గ్రంథం రచన జరిగిందన్నది స్పష్టం. 3:19-24 లో ఉన్న జాబితా దావీదు వంశం వృక్షం వరకు, జెరుబ్బాబెలు తరువాత ఆరు తరాలకు విస్తరించింది.
స్వీకర్త
ప్రాచీన యూదు ప్రజ. తరువాత ఉన్న బైబిల్ పాఠకులు.
ప్రయోజనం
బబులోను ప్రవాసం అనంతరం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని ఇశ్రాయేలీయిలకు నేర్పించడానికి ఈ గ్రంథరచన జరిగింది. దక్షిణ రాజ్య చరిత్రఫై పుస్తకం దృష్టి కేంద్రీకరించింది. అంటే యూదా బెన్యామిను, లేవీగోత్రాలు. ఈ గోత్రాలు తక్కిన గోత్రాల కన్నా దేవునిపట్ల మరింత విధేయంగా ఉన్నాయి. దేవుడు దావీదుతో తాను చేసిన నిబంధనకు కట్టుబడి దావీదు రాజ వంశాన్ని లేక పరిపాలనను అంతం లేని దాన్నిగా చేసాడు. ఇది మానవ మాత్రులైన రాజులకు సాధ్యం కాదు. దావీదు, సొలొమోనుల ద్వారా దేవుడు తన ఆలయాన్ని స్థాపించాడు. ప్రజలు అక్కడ ఆరాధనలు చేసేవారు. సొలొమోను దేవాలయాన్ని బబులోనులో వారు నాశనం చేసారు.
ముఖ్యాంశం
ఇశ్రాయేలు ఆధ్యాత్మిక చరిత్ర.
విభాగాలు
1. వంశావళలు — 1:1-9:44
2. సౌలు మరణం — 10:1-14
3. దావీదు అభిషేకం, రాజరికం — 11:1-29:30
1
ఆది పితరులు వంశస్థులు
1:5-7; ఆది 10:2-5
1:8-16; ఆది 10:6-20
1:17-23; ఆది 10:21-31; 11:10-27
1:29-31; ఆది 25:12-16
1:32-33; ఆది 25:1-4
1:35-37; ఆది 36:10-14
1:38-42; ఆది 36:20-28
ఆదాము కొడుకు షేతు. షేతు కొడుకు ఎనోషు. ఎనోషు కొడుకు కేయినాను. కేయినాను కొడుకు మహలలేలు. మహలలేలు కొడుకు యెరెదు. యెరెదు కొడుకు హనోకు. హనోకు కొడుకు మెతూషెల. మెతూషెల కొడుకు లెమెకు. లెమెకు కొడుకు నోవహు. నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.
యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు. గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనే వాళ్ళు. యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
హాము కొడుకులు ఎవరంటే, కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనే వాళ్ళు. కూషు కొడుకులు వీళ్ళు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. ఇక రాయమా కొడుకులు షెబా, దదాను అనే వాళ్ళు. 10 కూషుకు నిమ్రోదు పుట్టాడు. ఈ నిమ్రోదు భూమి మీద మొదటి విజేత.
11 ఇక మిస్రాయిము లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, 12 పత్రుసీయులు అనే జాతులకు తండ్రి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులూ కఫ్తోరీయులూ కూడా మిస్రాయిము సంతతివారే.
13 కనానుకు మొదటగా సీదోను పుట్టాడు. తరువాత హేతు పుట్టాడు. 14 ఇతడు యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, 15 హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు 16 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అనే జాతులకు మూలపురుషుడు కూడా.
17 షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు అనే వాళ్ళు. 18 అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు. 19 ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళలో పెలెగు అనేవాడి రోజుల్లో ప్రాంతాలుగా భూమి విభజన జరిగింది. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని సోదరుడి పేరు యొక్తాను.
20 యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 21 హదోరము, ఊజాలు, దిక్లాను, 22 ఏబాలు, అబీమాయేలు, షేబా, 23 ఓఫీరు, హవీలా, యోబాలు పుట్టారు.
24 షేముకు అర్పక్షదు, అర్పక్షదుకు షేలహు, షేలహుకు ఏబెరు, 25 ఏబెరుకు పెలెగు, పెలెగుకు రయూ, 26 రయూకు సెరూగు, సెరూగుకు నాహోరు, నాహోరుకు తెరహు, 27 తెరహుకు అబ్రాహాము అనే పేరు పెట్టిన అబ్రామూ పుట్టారు.
28 అబ్రాహాము కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలులు. 29 వీళ్ళ సంతానం వివరాలు ఇవి. ఇష్మాయేలు పెద్దకొడుకు నెబాయోతు. ఇతని తరువాత పుట్టిన వాళ్ళు, కేదారు, అద్బయేలు, మిబ్శామూ, 30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, 31 యెతూరు, నాపీషు, కెదెమా. వీళ్ళు ఇష్మాయేలు కొడుకులు.
32 అబ్రాహాము ఉంపుడుకత్తె అయిన కెతూరాకు పుట్టిన కొడుకులు వీళ్ళు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకూ, షూవహు. వీళ్ళలో యొక్షానుకు షేబా, దదానూ అనే కొడుకులు పుట్టారు. 33 మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం.
34 అబ్రాహాముకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కొడుకులు ఏశావు, యాకోబు.
35 ఏశావు కొడుకులు ఎవరంటే ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు అనే వాళ్ళు. 36 వీళ్ళలో ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా అమాలేకు అనేవాళ్ళు. 37 రెయూవేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా.
38 శేయీరు కొడుకులు, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. 39 లోతాను కొడుకులు, హోరీ, హోమాములు. లోతాను సోదరి పేరు తిమ్నా. 40 శోబాలు కొడుకులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కొడుకులు అయ్యా, అనా.
41 అనా కొడుకు పేరు దిషోను. దిషోను కొడుకులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. 42 ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు ఊజు, అరాను.
ఎదోము రాజులు
1:43-54; ఆది 36:31-43
43 ఇశ్రాయేలీయులను ఏ రాజూ పరిపాలించక ముందే ఏదోం దేశంలో ఈ రాజులు పరిపాలించారు. బెయోరు కొడుకు బెల. అతని పట్టణం పేరు దిన్హాబా. 44 బెల చనిపోయిన తరువాత అతని స్థానంలో యోబాబు అనేవాడు రాజు అయ్యాడు. ఇతడు బొస్రా అనే ఊరికి చెందిన జెరహు కొడుకు. 45 యోబాబు చనిపోయిన తరువాత అతని స్థానంలో తేమాను ప్రాంతం వాడయిన హుషాము రాజు అయ్యాడు.
46 హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన వాడూ, బెదెదు కొడుకూ అయిన హదదు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతడి పట్టణం పేరు అవీతు. 47 హదదు చనిపోయిన తరువాత మశ్రేకా అనే ఊరికి చెందిన శమ్లా అతని స్థానంలో రాజు అయ్యాడు. 48 శమ్లా చనిపోయిన తరువాత నది తీరంలో ఉన్న రహెబోతు అనే ఊరికి చెందిన షావూలు అతని స్థానంలో రాజు అయ్యాడు.
49 షావూలు చనిపోయిన తరువాత అతని స్థానంలో బయల్‌ హానాను రాజు అయ్యాడు. ఇతని తండ్రి అక్బోరు. 50 బయల్‌ హానాను చనిపోయిన తరువాత హదదు అనేవాడు అతని స్థానంలో రాజు అయ్యాడు. ఇతని పట్టణం పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. ఈమె మేజాహాబుకు పుట్టింది.
51 హదదు చనిపోయిన తరువాత ఎదోములో నాయకులెవరంటే తిమ్నా, అల్వా, యతేతు, 52 అహలీబామా, ఏలా, పీనోను, 53 కనజు, తేమాను, మిబ్సారు, 54 మగ్దీయేలు, ఈలాము అనేవాళ్ళు. వీళ్ళంతా ఎదోము దేశానికి నాయకులుగా ఉన్నారు.