18
యేసుఙ్ అరెస్టు కిజినార్
1 యేసు పార్దనం వీస్తి వెన్కా, వన్ని సిసూర్‌వెట సోతాండ్రె, కెద్రొన్‌ఇని జోరెడాట్సి సొహాన్. అబ్బె ఉండ్రి టోట మహాద్. వాండ్రుని వన్నిసిసూర్ అయా టోటాదు సొహార్.
2 నండొ సుట్కు యేసుని వన్నిసిసూర్ అబ్బె కూడ్ఃజి మహార్. అందెఙె యేసు అయా టోటాదు మంజినాన్‌లె ఇజి యూద నెస్నాన్. వీండ్రె యేసుఙ్‌యుదురి అదికారిఙ కీదు ఒపజెప్నికాన్. 3 అందెఙె యూద అబె వాతాన్. పెరి పుజెరిఙు పరిసయ్‌రు పోక్తి సెగొండార్ దేవుణు గుడిఃది జమాఙ్‌ణు, మరి రోమ సయ్‌నమ్‌ది సెగొండారిఙ్‌బా వన్ని వెట కూక్త తత్తాన్. వారు సిసు బొద్దు, లాందెరిఙు, కూణమ్‌కు అస్త మహార్. 4 యేసు వన్ని ముస్కు వానికెఙ్‌విజు నెసినె, వాండ్రు సోతాండ్రె వరిఙ్, “మీరు ఎయెరిఙ్ రెబానిదెర్?”, ఇజి వెన్‌బాతాన్. 5 దన్నిఙ్ వారు, “నజరేతుది యేసుఙ్”, ఇహార్. అందెఙె వాండ్రు, “వాండ్రు నానె”, ఇజి వెహ్తాన్. అయావలె యేసుఙ్ ఒపజెప్తి యూద వరి వెట నిహ మహాన్. 6 ‘వాండ్రు నానె’, ఇజి యేసు వరిఙ్ వెహ్తివలె, వారు వెన్కా గుసె ఆజి బూమిదు అర్తార్. 7 మరి వాండ్రు వరిఙ్ వెన్‌బాతాన్, “మీరు ఎయెరిఙ్ రెబానిదెర్?”, ఇజి. “నజరేతుది యేసుఙ్”, ఇహార్ వారు. 8 అందెఙె యేసు, “నాను మిఙి వెహ్తగదె, వాండ్రు నానె ఇజి. మీరు నఙి రెబానిదెర్ ఇహిఙ, నా సిసూర్ ఆత్తి విరిఙ్ పోక్తు”, ఇజి వెహ్తాన్. 9 వారు సిసూరిఙ్ పోక్తిఙ్, ‘నీను నఙి సితి వరి లొఇ ఒరెన్ వన్నిఙ్‌బా నాను పాడుకిఏ’ ఇజి వాండ్రు ముఙాలె వెహ్తి మాటెఙ్ పూర్తి ఆతె.
10 సిమోన్ పేతురు డగ్రు ఉండ్రి కూడం మహాద్. నస్తివలె వాండ్రు అయాక లాగితండ్రె, విజు పుజెరిఙ ముస్కు పెరిపుజెరి పణిమన్నిసిఙ్ ఉణెర్‌గిబి కత్తాన్. అయా పణిమన్నిసి పేరు మల్కు 11 యేసు పేతురుఙ్, “నీ కూడం దన్నిఒరదు ఇడ్ఃఅ. నాను ఓరిస్తెఙ్‌నా బుబ్బ ఏర్‌పాటుకితి స్రమెఙ్ నాను ఓరిస్తెఙ్‌ఆఎద్‌ఇజి నీను ఒడ్ఃబిజినిదా?”, ఇజి వెహ్తాన్.
యేసుఙ్‌అన్న ముఙాల ఒసినార్
12-13 నస్తివలె రోమ సయ్‌నమ్‌దికార్, వరి అతికారి, జమానుర్ యేసుఙ్ అస్తారె తొహ్క్‌తార్. వారు వన్నిఙ్ తొహ్క్‌తారె, ముఙాల, అన్న ఇని వన్నిడగ్రు ఒతార్. వాండ్రు అయా ఏంటు విజు పుజెరిఙ ముస్కు పెరి పుజెరి ఆతి కయపెఙ్ మామ్‌సి. 14 యా కయపనె, ‘లొకుర్‌విజెరె వందిఙ్ ఒరెన్ సానికాదె నెగెద్’ ఇజి యూదురి అతికారిఙ్ బుద్ది వెహ్త మహాన్.
పేతురు యేసుఙ్ నెస్‌ఏ ఇజివెహ్సినాన్
15 సిమోన్ పేతురు ని మరి ఒరెన్‌సిసూ యేసు వెన్కా సొహార్. అయా సిసూ, విజు పుజెరిఙ ముస్కు పెరిపుజెరిఙ్ నెల్వ ఆతికాన్. అందెఙె వాండ్రు యేసువెట పెరిపుజెరి ఇండ్రొణి డేవాదు సొహాన్. 16 పేతురు గవుని వెల్లి నిహమహాన్. పెరిపుజెరిఙ్ నెల్వ ఆతి అయా సిసూ మర్‌జి వాతండ్రె, గవ్‌నిడగ్రు నిల్సి మంజిని అయ్‌లిదిఙ్ వెహ్తండ్రె, పేతురుఙ్ లొఇ కూక్త ఒతాన్.
17 అయావలె అయా అయ్‌లి పేతురువెట, “నీనుబా వన్ని సిసూర్‌లొఇ ఒరిగదె?”, ఇజి వెన్‌బాతాన్. దన్నిఙ్‌వాండ్రు, “నాను ఆఏ?”, ఇహాన్. 18 అయావలె గొప్ప పిని మహాద్. అందెఙె అతికారిఙుని పణిమన్నిసిర్‌సిసు ఎర్‌సి దన్ని సుటులం నిల్సికాయ్‌జి మహార్. పేతురుబా వరివెట నిహండ్రె, సిసు కాయ్‌జి మహాన్.
పెరి పుజెరి యేసుఙ్‌వెన్‌బాజినాన్
19 అయావలె, విజు పుజెరిఙ ముస్కు మన్ని పెరిపుజెరి యేసుఙ్ వన్నిసిసూర్ వందిఙ్ వాండ్రు నెస్‌పిస్తి బోద వందిఙ్ వెన్‌బాజి మహాన్. 20 అందెఙె యేసు, “నాను లోకుర్ విజెరె ఎద్రునె వెహ్తమన. యూదురు విజెరె కూడ్జి వాజి మంజిని, యూదురి మీటిఙ్ ఇల్కాఙ్‌ని దేవుణుగుడిఃదు ఎస్తివలెబా నేర్‌పిసి మహ. నాను ఇనికబా డొఙసాటు వెహ్‌ఏత. 21 మరి ఎందానిఙ్ నఙి వెన్‌బాజిని? నా మాట విహివరిఙ్‌వెన్‌బాఅ. నాను వెహ్తికెఙ్‌వర్గితికెఙ్‌వారు నెస్నార్”, ఇజి వెహ్తాన్.
22 యేసు యాకెఙ్ వెహ్తిఙ్, అబ్బె నిహిమహి అతికారిఙ లొఇ ఒరెన్ యేసుఙ్ ఉండ్రి లెపడెఃయితాండ్రె, “యాలెకెండ విజు పుజెరిఙ ముస్కు మన్ని పెరిపుజెరిఙ్ మర్‌జి వెహ్సిని?”, ఇజి వెహ్తాన్. 23 అయావలె యేసు, “నాను తపు ఇన్నిక వెహ్తిఙ, అయాక నఙి వెహ్‌అ. గాని నాను నిజం వెహ్తిఙ, ఎందనిఙ్ నఙి డెఃయిజిని?”, ఇజి వెహ్తాన్. 24 అందెఙె అన్న వన్నిఙ్ తొహ్తి డఃసనె విజు పుజెరిఙ ముస్కు పెరిపుజెరి కయపడగ్రు పోక్తాన్.
యేసుఙ్ నెస్‌ఏ ఇజి పేతురు మరివెహ్సినాన్
25 పేతురు సిసు కాయిజి నిహ మహాన్. అయావలె మహికార్‌వన్నిఙ్, “నీనుబా వన్ని సిసూర్‌లొఇ ఒరిగదె?”, ఇజి వెన్‌బాతార్. గాని పేతురు, “నాను ఆఏ”, ఇజి కెఏతాన్. 26 నస్తివలె పేతురు గిబ్బి తెవ్‌కతి పణిమన్నిసి బంతుకులు ఒరెన్ అబ్బె మహాన్. వాండ్రు విజు పుజెరిఙ ముస్కు మన్ని పెరి పెరి పుజెరి పణిమన్నిసిర్‌లొఇ ఒరెన్. వాండ్రు, “నిఙి వన్నివెట టోటాదు నాను సుడ్ఃతగదె?”, ఇహాన్. 27 మరిబా, “నాను నెస్‌ఏ”, ఇజి వెహ్తాన్. వెటనె కొరు కెరెతాద్.
యేసుఙ్‌పిలాతు ముఙాల ఒసినార్
28 వెన్కా యూదురు యేసుఙ్ కయప బాణిఙ్‌రోమా గవర్నరు మన్ని పెరి ఇండ్రొ ఒతార్. అయావలె పెందాల్‌ఆతాద్. యూదురు ఆఇ వన్ని ఇండ్రొ డుగ్‌జి మయ్‌ల ఆనాప్‌ఇజి ఒడిఃబిజి వారు గవర్నరు మన్ని ఇండ్రొ డుఃగ్‌ఏతార్. ఎందానిఙ్‌ఇహిఙ, వారు పస్క బోజనం ఉండెఙ్‌సుబమ్ర్‌క మండ్రెఙ్‌వలె. అయాక ఉండ్రి ఆసారం. 29 అందెఙె గవర్నరు ఆతి పిలాతు, వెల్లి వరిడగ్రు వాతండ్రె, విని ముస్కు ఇనిఇని నేరమ్‌కు మొప్సినిదెర్?”, ఇజి వెన్‌బాతాన్. 30 అయావలె వారు, “వీండ్రు తపు కిఇకాన్ ఇహిఙ, నీ బాన్‌తెఎతాప్‌మరి”, ఇజి మర్‌జి వెహ్తార్. 31 పిలాతు వరిఙ్, “మీరె వన్నిఙ్‌ఒసి, మీ యూదురి రూలుదు మన్ని వజ తీర్పు సీదు”, ఇహాన్. దనిఙ్‌వారు, “ఎయెరిఙ్‌బా సప్తెఙ్‌మఙి అక్కుసిల్లెద్”, ఇహార్. 32 యేసుఎలాగ మర్తి సావు సానాన్‌ఇజి వాండ్రు వెహ్తి మాటెఙ్ పూర్తి ఆదెఙ్ యాక జర్గితాద్. 33 పిలాతు వన్ని ఇండ్రొ మర్‌జి సొహాండ్రె, యేసుఙ్ కూక్పిస్తాండ్రె వన్నిఙ్, “నీను యుదురిఙ్‌రాజునా?”, ఇజి వెన్‌బాతాన్. 34 అందెఙె యేసు, “నీలొఇహాన్ వాతి మాటనా, మహికార్‌నా వందిఙ్‌నిఙి వెహ్తరా?”, ఇజి వెన్‌బాతాన్. 35 అయావలె పిలాతు, “నాను యూద వాండ్రనా? నీ సొంత లోకుర్‌ని నీ సొంత పెరిపుజెరిఙు నిఙి నాబాన్ ఒపజెప్తార్. నీను ఇన్నిక కితి?”, ఇజి వెహ్తాన్. 36 అందెఙె యేసు, “నా అతికారం యా లోకమ్‌ది రాజురిఙ్ మన్ని అతికారం లెకెండ మన్నిక ఆఏద్. నన్నిఅతికారం నఙి మహిఙ, యూదురు నఙి అరెస్టు కిఏండ నా సిసూర్ అడ్డు కిత్తార్ మరి. గాని నాను యా లోకమ్‌ది రాజు ఆఏ”, ఇజి వెహ్తాన్. 37 “అహిఙ, నీను ఒరెన్‌రాజునా?”, ఇజి పిలాతు వెహ్తాన్. అందెఙె యేసు, “నాను రాజు ఇజి నీను వెహ్సిని. నిజమాతి మాటెఙ్‌వెహ్ని వందిఙె నాను పుట్తానె యా లోకమ్‌దు వాత. నీజమాతికెఙ్ కోరిజినికాన్ నాను వెహ్సిని మాటెఙ్ వినాన్”, ఇజి వెహ్తాన్. 38 అయావలె పిలాతు, “నిజమాతి మాటెఙ్‌ఇన్నికెఙ్?”, ఇజి వెన్‌బాతాన్. వెన్‌బాతాండ్రె వాండ్రు వెల్లి యూదురు బాన్‌సొహాండ్రె, “వినిఙ్‌తిర్‌పు సీదెఙ్‌విని లొఇ ఇన్ని నేరంబా తోర్‌ఏద్. 39 గాని మీ అలవాటులెకెండ్, ఏంటుఏంటు పస్క పండొయ్ కాలమ్‌దు, “కయ్‌దు మన్ని ఒరెన్‌వన్నిఙ్‌మఙి డిఃసి పోక్‌అ”, ఇజి మీరు లొస్నిదెర్. అందెఙె యుదురిఙ్‌రాజుఙ్ నాను డిఃసి సీదెఙ్ మీరు కోరిజినిదెరా?”, ఇజి వెన్‌బాతాన్. 40 అయావలె వారు, “పోని! వినిఙ్‌పోని. బరబెఙ్‌డిఃసి సిదా మఙి”, ఇజి డేల్సి మర్‌జి వెహ్తాన్. యా బరబ్బ ఒరెన్ కఙారి.