4
కెన్‍కలెకద్‍ విత్తన సల్లెకాదుంఙ్ వాలడ్ ఉదహరనా
మత్తయ్ 13:1-9; లూక్ 8:4-8
అముదు సముద్రం మెరం కారపేంఙ్ లాక్సర్. గులేన్‍ మన్కకెరె అంనత్తి మిరయుత్ అముదు సముద్రంత అనెక రూకుత్‍సొకుత్‍ ఉద్‍సాద్‍ మన్కకెరే సట్టం సముద్రంత దర్డిత్‍ హన్‍సార్. అముదు ఎన్నిగొ ఉదహరనాడ్ పేల్గెఙ్ గొట్టిక్ కారపెంఙ్ ఎదెద్. ఇసా బొదిడ్తెంద్. ఇసా ఇనంఙ్ బొదఇడుత్.
వినుర్‍ ఒక్కొద్ విత్తన సాల్లెఙ్ కురితెద్. అముదు సాల్లెంఙ్ కొన్నిఙ్ విత్తనల్ పావుతు రల్సవ్. పిట్టల్ వారుతు అదవ్లున్ తిస్సావ్. కొన్నిఙ్ విత్తనల్ దుబ్బ ఏక్కువ తొస్సెట్ బట్టి జాగత్ రటవ్. అత్తి పెరెత్‍ దుబ్బ తొస్సెట జల్ది జల్ది మొల్లిస్సవ్. దుపరి ఏత్న ఉబ్బంఙ్ అద సివ్కసావ్ వేల్ తొస్సెటవ్ అద అర్సవ్. కొన్నిఙ్ విత్తన సాల్ల తుట్టిత్‍ రల్సవ్. సాల్లె మకూతు అదవెంట పెరుగుత్ దటిప్సవ్ అని అద తనయ్‍ పలితం సియ్‍ఙ్ సాలేతెవ్. కొన్ని విత్తనల్ సోయ్ జాగత్ రల్సవ్ అద సోయ్‍ మొలయ్యితెవ్. అని పెరగ్సవ్ అని పలితం సియ్‍తెవ్. అద లోప కొన్నిఙ్ ముప్పయి దంతల్ కొన్నిఙ్ సాట్‍ దంతల్ అని కొన్నిఙ్ నుర్ దంతల్ పలితం సియ్‍తెవ్. యేసును ఇసాన్ద ఔరుంఙ్ వినేకాదుగు కెవ్వూ అన్సా అముదు వినేఙ్‍ ఇసా ఇంతెంద్.
యేసుంద్ బొద ఇడ్డెంఙ్ తనుంఙ్ ఉదహరనా వడక్తెంద్
మత్తయ్ 13:10-17; లూక్ 8:9-10
10 అముదు ఒక్కొంది అనేఙ. పన్నెండు మంది సిష్యుల్‍ అని యేసున్‍ వెంట ఏర్ అస్సార్ ఇవ్రు అమతీన్ అద్ ఉదహరన్‍ గొట్టి బదోల్‍ వేల్తొల్సాంద్. 11 ఔరున్ వెలుత్‍ ఓల్తెంద్ గని. దెయ్యమ్నె రాజ్యం నేత్ డప్త గొట్టి ఇమ్మూంఙ్ కులుత్ సియ్యుతు అన్సాద్‍. గని ఏర్ వాకా అన్సార్‍. ఔరుంఙ్‍ అద సట్టం ఉదహరనాడ్ అన్సాద్‍. 12 ఔరుంఙ్ ఓలేఙా అవురూఙ్‍ కాడ్కేరెంఙ్‍తోద్ అని వినేగఙా అవురూఙ్‍ కారిలేఙ్‍తోద్. ఔర్ వినుతు దెయ్యంవై తిరిగ్సార్ అనిఔరె మాప్కల్. *యేయ్యయ 6:9-10.
ఉపమనంనె ఒక్కొద్ ఉద్దేస్
మత్తయ్ 13:18-23; లూక్ 8:11-15
13 యేసుంద్ ఔరడ్ ఇనంఙ్ ఇంతెంద్. ఇముంఙ్ ఉపమానంనె కరిలెతినా? మల్ల మిక్తఉపమనలున్ ఎనంఙ్ అర్త కల్సతి? 14 విత్తన విత్తెకాంద్ లాఙ్‍ అన్సాంద్ దెయ్యమ్నె గొట్టిన్‍ ఇడ్డెకాంద్. 15 పావుత్ వాయి తా విత్తన విత్‍సాద్‍. మన్కకెర్‍ ఇవ్రు ఇస్సార్ ఔర్ దెయ్యమ్నె గొట్టిన్ వింతదూన్ సైతన్ వత్త ఔరె లోపా వాయితా గోట్టిన్ ఎత్తుత్ కొస్దద్. 16 మల్ల అనాయ్ కొన్సెం మంది అనాయ్ బట్టి జాగత్ వాయ్యిత విత్తన మన్కకేరే ఇవ్రులంఙ్. ఔర్ దెయ్యమ్నె గొట్టీన్ వింత వెంటని కుసినడ్‍ వింత్ సుంసార్‍. 17 గని ఔర్ లోపా వేల్తోస్సేటడె. ఔర్ కొని గొల్‍ టిల్సార్‍ గొట్టినాడ్ తరస్ తక్లీబ్. ఎద్దె ఔర్ రల్సార్. 18 మల్ల కొన్సెం మంది సాల్ల తుట్టిత్‍ వాయ్యిత విత్తనలంఙ్. ఔర్ దెయ్యమ్నె గోట్టిన్ వినసర్. 19 గని కాడుత్ చింత పైసేల లోబ్‍ అని రంఙ్ రంఙ్త అస ఔర్ లోపా వత్న దెయ్యమ్నె గొట్టిన్ దటిప్సద్ అని ఔర్ తానయ్ పలితం సీయేంఙ్ సాలేర్. 20 ఇంక్ కొన్సెం మంది సోయ్ జాగత్ వాయ్యిత విత్తన లంఙ్‍ ఇవ్రు ఎన్నెర్ ఔర్ దెయ్యమ్నె గోట్టిన్ వింత్ అదూన్ సుమ్‍సార్ అని ముపైయి దంతల్ సాట్‍ దంతల్ నూర్ దంతల్ పలితం సీయ్సర్.
యేసు విత్తన బదోల్ ఉపమనం
లూక్ 8:16-18
21 అముదు మల్ల ఔరున్ ఇసన్ద. ఎందేనా దీవెన్ తరుపూత్ తెర్ బుడున్ దీవే ఇడెక లంన పొయ్‍ ఇడ్సా ర్ తా. 22 ఏర్క సుమ్మెఙ్‍ సాలేర్ అనంఙ్. తానాయి డపూత్‍ గోట్టితోతెద్. పుందెంఙ్‍ సాలేర్‍ అనంఙ్‍ తానాయి మున్సతా గోట్టి తోతెంద్ కురిద. 23 ఔరుంఙ్ వీనేకాదుగు కేవ్వు అన్సా. అముదు విన్నెఙ్.
24 నీర్ ఎ మాపాడ్ కుల్లాతీర్ అద్ మాపాడ్ ఇమ్మూంఙ్‍ నాయి కుల్లేకాద్‍ వరద్‍. అద నాయి ఇమ్మూంఙ్‍ రొంబడ్సా. 25 తానుంఙ్ ఇంతె ఏరుంఙ్‍ అన్సా అవురుంఙ్‍ ఎక్కువ రొబడ్ససెస్సా. గనితోస్సెట నత్తన అనెకా తోస్సెటనాయి పుస్సేకాద్‍ఏరద్.
పెర్‍గెకా వితనంమ్నె ఉదహరన
26 యేసుంద్‍ మల్ల ఇడ్‍సాద్‍. దెయ్యమ్నె రాజ్యం ఇనంఙ్ అన్సద్. ఒక్కొ మన్కక్ కేనుత్‍ వయ్‍ తా వితన సాలుత్. 27 అముదు సింత్తె పత్తె మంగుత్ సులెంఙ్ అమ్నుంఙ్ ఎర్కతోసెట వితన మోలయుత్ పెర్గసా. అద ఎనంఙ్ పెర్గసావొ అమ్నుంఙ్ ఎర్కతొద్. 28 బూమి తన్నే మన్నాడ్ తని పీక్ సీసాద్‍. మొదల్ మొలక కురియుత్ మల్ల పొట్రంఙ్‍ ఉడ్డమ్ ఎత్నాకిసెంఙ్ వర్సాద్‍. 29 పంటపండెకా కలమ్ వత్తిన్ అప్పుడ్‍ ఆ మన్కక్ కిసెకదుంఙ్ కొడ్వా కొసుత్‍ కిస్‍సాద్.
మోర్యి మర్రి వితనమ్నె ఉదహరనా
మత్తయ్ 13:31-32,34-35; లూక్ 13:18-19
30 యేసుంద్ మల్ల ఇనంఙ్ ఇసాన్ద. దెయ్యమ్నె రాజ్యం ఎనంఙ్ అన్సాద్ ఇసా ఇడ్డెకాద్? అదున్‍ ఏ ఉదహరనడ్ ఇడ్డెకాంద్? 31 అద్ ఇనంఙ్ అన్సాద్ ఒక్కొ మన్కక్ బూమిత్ వయ్‍ తా వితన లంఙ్ అన్సాద్. అద్ బూమి పొయి అనెకా సింకానా విత్తనలుంఙ్‍ ఎనా సిన్నం అన్సాద్. 32 అద్ బూమిత్‍ రలుత్ మొలయుత్‍ పెరుగ్తిన్ కేన్‍ తా సెట్లు దండి ఎరసాద్‍. కొమ్ము పెర్గుత్ దండిక్ ఎత్న అద్నె నిడత్ పిట్ట వత్న అద్నె కొమ్ములేంఙ్‍ తుప్ప ఇందర్సా.
33 యేసుంద్ ఇట ఉదహరనలున్ ఎన్నిగొ ఉదరనాలడ్. బొదన్ అర్తం కన్నంత్తెఙ్ ఔరుంఙ్ ఇడ్‍సాద్. 34 ఉదహరనడ్‍ సివాయ్ అవురుంఙ్‍ బొద ఇడ్సాంద్‍. గని సిసులున్ వెంట ఒక్కొంది అనేఙా అవురుంఙ్‍ పోడిలుతు ఇడ్సద్.
యేసుంద్ గలి దుందున్ ఇల్పెకంద్
మత్తయ్ 8:23-27; లూక్ 8:22-25
35 అది దినం సియితె వేలఙ్ యేసుంద్ తన్నె సిసులున్ ఇస్సాద్. గంగఙ్ అల దర్డిఙ్ సేనర్! ఇసా ఇంతెంద్. 36 సిసు. అత్తి అనెకా మందిన్ సాయుత్ యేసుంద్‍ అనెకా రూకుత్ ఉదుత్‍ సెద్దెర్. మల్ల కొన్ని రూకునాయ్‍ ఔరున్‍ వెంట సెదె. 37 అపుడి ఒక్కొదండి దుదడ్ వర్సద్. అనయి అల్లవ రూకున్ తక్‍సా రూకుత్. ఈర్ నిడ్స వర్సద్. 38 ఆ వెలంఙ్ రూకుత్ వెన్కా పకంఙ్ యేసుంద్ తలపా ఇడుత్. మంఙ్సానంసాద్. ఔర్ యేసునున్‍ సులుపుత్ ఇస్సార్‍ గురువు నేండ్ ముంలగ్సతుమ్ అద్నే చింత ఇనుంఙ్ తోతెద?
39 యేసుంద్ సులుత్నగాలిన్. దట్టిపుత్ ఆ గంగత అలవలున్ ఇడ్సాద్. సిమ్కెర్‍ అపుడ్ గాలి సిమ్కు ఎర్సద్ అని సిమ్మసామ్మె ఏర్సద్. 40 మల్ల అముదు ఔరున్ విస్వాస తనుంఙ్ నీర్ అర్సతిర్. ఇమ్ముంఙ్ బరొస తోతెద! 41 ఔరుంఙ్ గుల్‍ అర్రి వత్తిన్. తమ్మెత్‍ తమ్మి. ఇనంఙ్ ఇన్నెంఙ్ ఎద్దెర్ ఇమ్‌ద ఏద్ ఎన్నెదొ! గాలి అని గంగనాయ్ ఇమ్నె గొట్టికున్ విసా.

*4:12 యేయ్యయ 6:9-10.