11
ఇశ్రాయేలు యెహోవాను మరచి పోవుట
“ఇశ్రాయేలు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను.
మరియు ఈజిప్టు నుండి నా కుమారుని బయటకు పిలిచాను.
కాని ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే
అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు.
బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు.
విగ్రహాలకు వారు ధూపం వేశారు.
 
“అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే!
ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తు కొన్నాను!
నేను వారిని స్వస్థపరిచాను.
కాని అది వారికి తెలియదు.
తాళ్లతో నేను వారిని నడిపించాను.
కాని అవి ప్రేమ బంధాలు.
నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగవున్నాను.
నేను వంగి వారికి భోజనం పెట్టాను.
 
“ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు. వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది.
“నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.”
ఇశ్రాయేలుని నాశనం చేయడం యెహోవాకు ఇష్టం లేదు
“ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకులేదు.
ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె.
నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు!
నిన్ను జెబొయీములాగ చెయ్యాలనీ లేదు!
నేను నా మనసు మార్చు కుంటున్నాను,
నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
నేను నా కోపాగ్నిని అణచుకొంటాను.
నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను.
నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి.
నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను.
10 నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే,
నా బిడ్డలు వచ్చి నన్ను అనుసరిస్తారు.
భయంతో కంపిస్తూ నా బిడ్డలు
పశ్చిమ దిశ నుంచి వస్తారు.
11 వాళ్లు ఈజిప్టు నుంచి
పక్షుల్లా వణుకుతూ వస్తారు.
వాళ్లు అష్షూరు దేశంనుంచి పావురాలవలె కదులుతూ వస్తారు
నేను వాళ్లని తిరిగి ఇంట చేరుస్తాను” అని యెహోవా చెప్పాడు.
12 “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టు ముట్టాడు.
ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు!
కాని, యూదా యింకా ఎల్‌-తోనే* నడుస్తున్నాడు.
యూదా అపవిత్రలకు నమ్మ కస్తుడుగా ఉన్నాడు.”
 
* 11:12 ఎల్‌-తోనే ఎల్‌-ఇది పేర్లలో ఒకటిగావచ్చు. లేక ఇది కనానీయుల అతి ముఖ్యమైన దేవుడు కావచ్చు. యూదా దేవునికి నమ్మకస్థుడో లేక బూటకపు దేవతలను పూజిస్తాడో దీనివల్ల సరిగ్గా తెలియడం లేదు.