56
సంగీత నాయకునికి రాగం. “దూరపు సింధూర మ్రానులోని పావురము” ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం.
దేవా, ప్రజలు నా మీద దాడి చెస్తార గనుక నాకు దయ చూపించుము.
రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.
నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు.
నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు.
నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ము కొంటాను.
నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు.
వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు.
వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు.
నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు.
దేవా, వారిని తప్పించుకోనియ్యకుము,
వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము.
నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు.
నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు
నిజంగా నీవు కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.
 
కనుక సహాయం కోసం నేను నీకు మెర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు.
ఇది నాకు తెలుసు. ఏమంటే, దేవుడు నాతో ఉన్నాడు.
 
10 దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను.
మనుష్యులు నన్ను బాధించలేరు.
 
12 దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను.
నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను.
13 ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు.
నేను ఓడిపోకుండా నీవు కాపాడావు.
కనుక బతికి ఉన్న మనుష్యులు మాత్రమే
చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.