7
ఇశ్శాఖారు సంతతివారు
1 ఇశ్శాఖారుకు నలుగురు కుమారులు. తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అని వారి పేర్లు.
2 తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, యిబ్శాము, షెమూయేలు అనేవారు. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారు, వారి సంతతివారు వీర సైనికులు. దావీదు రాజుగా ఉన్న కాలంలో వీరి సంఖ్య ఇరవై రెండువేల ఆరువందలు.
3 ఉజ్జా కుమారుడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా అనేవారు. వీరైదుగురు కుటుంబ పెద్దలు. 4 వారి వంశ చరిత్ర పరిశీలిస్తే వారిలో ముప్పది ఆరువేల మంది యుద్ధ సన్నద్ధులైన సైనికులున్నట్లు తెలుస్తుంది. వారికి బహు భార్యలు వున్నందువల్ల వారికి సంతానం ఎక్కువై కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.
5 ఇశ్శాఖారు వంశంలో ఎనభై ఏడువేల మంది బలిష్టులైన సైనికులున్నట్లు వారి వంశ చరిత్ర తెలియజేస్తుంది.
బెన్యామీను సంతతివారు
6 బెన్యామీనుకు ముగ్గురు కుమారులు. బెల, బేకరు, యెదీయవేలు అని వారి పేర్లు.
7 బెలకు ఐదుగురు కుమారులు. ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు మరియు ఈరీ అని వారి పేర్లు. వారి కుటుంబాలకు వారు పెద్దలు. వారిలో ఇరవై రెండువేల రెండువందల మంది సైనికులున్నట్లు వారివంశ చరిత్ర తెలుపుతుంది.
8 బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయేజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోత, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవారు. ఇది బేకరు సంతానం. 9 వీరి వంశ చరిత్ర వారి పెద్దలను విశదపరుస్తుంది. వారిలో ఇరవైవేల రెండు వందల మంది సైనికులున్నట్లు వారి చరిత్ర తెలియజేస్తుంది.
10 యెదీయవేలు కుమారుడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయానా, జేతాను, తర్షీషు, అహీషహరు అనువారు. 11 యెదీయవేలు కుమారులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారిలో పదిహేడువేల రెండువందల మంది యుద్ధవీరులున్నారు.
12 షుప్పీయులు, హుప్పీయులు అనేవారు ఈరు సంతతివారు. అహేరు కుమారుని పేరు హుషీము.
నఫ్తాలి సంతతివారు
13 నఫ్తాలి కుమారులు యహసయేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవారు.
వీరందరూ బిల్హా*బిల్హా నఫ్తాలి కుమారులకు బిల్హా నాయనమ్మ అవుతుంది. ఆది. 30:6-8 చూడండి. సంతతిగా ఎంచబడిరి.
మనష్షే సంతతివారు
14 మనష్షే సంతతివారు ఎవరనగా: మనష్షే కుమారుని పేరు అశ్రీయేలు. మనష్షే దాసియగు అరాము (సిరియా) దేశపు స్త్రీకి అశ్రీయేలు జన్మించాడు. ఆమెకు మాకీరు అనే మరొక కుమారుడు కలిగాడు. మాకీరు కుమారుడు గిలాదు. 15 హుప్పీయుల, షుప్పీయుల నుండి ఒక స్త్రీని మాకీరు వివాహం చేసుకొన్నాడు. ఆమె పేరు మయకా. మాకీరు సోదరి పేరు కూడ మయకా. ఈ సోదరి మయకాకుసెలో పెహాదు అని మరో పేరు వుంది. సెలోపెహాదుకు అందరూ కుమార్తెలే. 16 మాకీరు భార్య మయకా ఒక కుమారుని కన్నది. మయకా ఈ కుమారునికి పెరెషు అని పేరు పెట్టింది. పెరెషు సోదరుని పేరు షెరెషు. షెరెషు కుమారుల పేర్లు ఊలాము, రాకెము.
17 ఊలాము కుమారుని పేరు బెదాను.
గిలాదు సంతతి వారెవరనగా: గిలాదు తండ్రి పేరు మాకీరు. మాకీరు తండ్రి పేరు మనష్షే. 18 మాకీరు సోదరియగు హమ్మోలెకెతునకు ఇషోదు, అబీయెజెరు, మహలా అనేవారు జన్మించారు.
19 షెమీదా కుమారుల పేర్లు అహోయాను, షెకెము, లికీ, అనీయాము.
ఎఫ్రాయిము సంతతివారు
20 ఎఫ్రాయిము సంతతివారి పేర్లు ఏవనగా: ఎఫ్రాయిము కుమారుని పేరు షూతలహు. షూతలహు కుమారుడు బెరెదు. బెరెదు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఎలాదా. 21 ఎలాదా కుమారుడు తాహతు. తాహతు కుమారుడు జాబాదు. జాబాదు కుమారుడు షూతలహు.
గాతు నగర నివాసులు కొందరు ఏజెరెను, ఎల్యాదును చంపివేసారు. ఏజెరు, ఎల్యాదులిద్దరూ గాతు ప్రజల ఆవులను, గొర్రెలను దొంగిలించటానికి వెళ్లిన కారణంగా వారిని ప్రజలు చంపివేసారు. 22 ఎజెరు, ఎల్యాదు లిరువురూ ఎఫ్రాయిము కుమారులే. ఏజెరు, ఎల్యాదు చనిపోయినందుకు ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. ఎఫ్రాయిము బంధువులంతా వచ్చి అతనిని ఓదార్చారు. 23 పిమ్మట ఎఫ్రాయిము తన భార్యతో కలియగా ఆమె గర్భవతి అయ్యింది. ఆమె ఒక కుమారుని కన్నది. ఎఫ్రాయిము అతనికి బెరీయా†బెరీయా ఇది హెబ్రీ మాటలాంటిది దీని అర్థం ‘చెడు’ లేదా ‘కష్టము.’ అని పేరు పెట్టాడు. ఎందువల్లననగా అతని కుటుంబానికి అప్పుడు కొంత కీడు జరిగింది. 24 ఎఫ్రాయిము కుమార్తె పేరు షెయెరా. షెయెరా దిగువ బేత్‌హోరోను, ఎగువ బేత్‌హోరోను, దిగువ ఉజ్జెన్‌షెయెరా, ఎగువ ఉజ్జెన్‌షెయెరా అనే పట్టణాలను కట్టించింది.
25 ఎఫ్రాయిము కుమారుని పేరు రెపహు. రెపహు కుమారుని పేరు రెషెపు. రెషెపు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. 26 తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. 27 ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ.
28 ఎఫ్రాయిము సంతతి వారు నివసించిన నగరాలు, ప్రదేశాలు ఏవనగా: బేతేలు, దాని పరిసర గ్రామాలు; తూర్పున నహరాను, పడమట గెజెరు, దాని సమీప గ్రామాలు; షెకెము, దాని పరిసర గ్రామాలు మరియు అయ్యా వరకుగల గ్రామాలు. 29 మనష్షే రాజ్య సరిహద్దుల్లో బేత్షెయాను, తానాకు, మెగిద్దో, దోరు పట్టణాలు మరియు వాటి పరిసర గ్రామాలు వున్నాయి. ఈ పట్టణాలలో యోసేపు సంతతి వారు నివసించారు. యోసేపు తండ్రి పేరు ఇశ్రాయేలు.
ఆషేరు సంతతివారు
30 ఆషేరు కుమారులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బేరీయా అనువారు. వారి సోదరి పేరు శెరహు.
31 బెరీయా కుమారులు హెబెరు మరియు మల్కీయేలు. మల్కీయేలు కుమారుడు బిర్జాయీతు.
32 హెబెరు కుమారులు యప్లేటు, షోమేరు, హోతాము అనువారు. షూయా వారి సహోదరి.
33 యప్లేటు కుమారులు పాసకు, బింహాలు, అష్వాతు అనేవారు. వీరంతా యప్లేటు సంతానం.
34 షోమేరు కుమారులు అహీ, రోగా, యెహుబ్బా, అరాము.
35 షోమేరు సోదరుని పేరు హేలెము. హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.
36 జోపహు కుమారులు సూయ, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా, 37 బేసెరు, హాదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బెయేర.
38 ఎతెరు కుమారులు యెపున్నె, పిస్పా, అరా.
39 ఉల్లాము కుమారులు ఆరహు, హన్నియేలు, రిజెయా.
40 వీరంతా ఆషేరు సంతతివారు. వారివారి కుటుంబాలకు వారు పెద్దలు. వారు పేరుగాంచిన వ్యక్తులు, యుద్ధవీరులు, మహా నాయకులు. వారి వంశచరిత్ర ప్రకారం వారిలో యుద్ధానికి పనికివచ్చే ఇరవై ఆరువేల మంది సైనికులున్నారు.
*7:13: బిల్హా నఫ్తాలి కుమారులకు బిల్హా నాయనమ్మ అవుతుంది. ఆది. 30:6-8 చూడండి.
†7:23: బెరీయా ఇది హెబ్రీ మాటలాంటిది దీని అర్థం ‘చెడు’ లేదా ‘కష్టము.’