35
మార్గదర్శకమైన రేకాబీయుల మంచి కుటుంబం
1 యెహోయాకీము యూదా రాజ్యాన్ని పరిపాలించే కాలంలో యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. యెహోవా సందేశం ఇలా ఉంది: 2 “యిర్మీయా, రేకాబీయుల*రేకాబీయులు వీరు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వారు. తరువాత వాక్యములు చూడండి. ఈ వంశం వారు యెహోవా పట్ల చాలా భక్తి విశ్వాసాలు గలవారు. యెహోనాదాబు కథ కొరకు రాజుల రెండవ గ్రంథం 10:15-18 చూడండి. వద్దకు వెళ్లుము. యెహోవా దేవాలయపు ప్రక్కగదులలో ఒక దాని లోనికి వారిని ఆహ్వానించుము. వారు తాగటానికి ద్రాక్షారసాన్ని అందించుము.”
3 కావున నేను (యిర్మీయా) యజన్యాను†యజన్యా ఇతడు ఆనాటి రేకాబీయులకు పెద్ద. తీసికొని రావటానికి వెళ్లాను. యజన్యా యిర్మీయా‡యిర్మీయా ఈ యిర్మీయా ప్రవక్తయైన యిర్మీయా కాడు. ఆ పేరు గల మరోవ్యక్తి. అనువాని కూమారుడు. యిర్మీయా హబజ్జిన్యా కుమారుడు. యజన్యా సోదరులను; కుమారులను కూడ ఆహ్యానించాను, రేకాబీయుల కుటుంబం వారినందరినీ పిలువనంపాను. 4 ఆ రేకాబీయుల నందరినీ మందిరంలోనికి తీసికొని వచ్చాను. అందరం హానాను కుమారుల గది అనబడే దానిలోనికి వెళ్లాము. హానాను అనువాడు యిగ్దల్యా కుమారుడు. హానాను ఒక దైవజనుడు. ఈ గది యూదా రాజు ముఖ్యఅధికారులు బసచేసే గది పక్కనే ఉంది, ఇది మయశేయా గదిపైనవుంది. మయశేయా అనేవాడు షల్లూము కుమారుడు. మయశేయా దేవాలయంలో ద్వార పాలకుడు. 5 పిమ్మట నేను (యిర్మీయా) ద్రాక్షారసం పోసిన కొన్ని పాత్రలు, మరికొన్ని గిన్నెలు రేకాబీయుల ముందు ఉంచాను. “కొంచెం ద్రాక్షారసం తీసుకోండి” అని నేను వారికి చెప్పాను.
6 కాని రేకాబీయులు ఇలా సమాధాన మిచ్చారు: “మేమెన్నడూ ద్రాక్షారసం తాగము. మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞ యిచ్చిన కారణంగా మేము దానిని తాగము. ఆయన ఆజ్ఞ ఏమనగా: ‘మీరు మీ సంతతివారు ఎన్నడూ ద్రాక్షారసం త్రాగవద్దు. 7 పైగా మీరు ఎన్నడు ఇండ్లు కట్టవద్దు, విత్తనములు నాటవద్దు. దాక్షా తోటలు పెంచవద్దు. వీటిలో దేనినీ మీరు ఎన్నడూ చేయరాదు. మీరు కేవలం గుడారాలలోనే నివసించాలి. మీరిలా చేస్తే, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తిరుగుతూ మీరీ దేశంలో చిరకాలం జీవించగలుగుతారు.’ 8 కావున రేకాబీయులమైన మేము మా పితరుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞకు బద్ధలమైయున్నాము. మేమెన్నడూ ద్రాక్షారసం తాగము. మా భార్యాలు, కుమారులు, కుమార్తెలు కూడా ద్రాక్షారసం తాగరు. 9 నివసించటానికి మేము ఇండ్లను నిర్మించము. ద్రాక్షాతోటలు గాని, పొలాలు గాని మేము కలిగివుండము. మేమెన్నడూ పంటలు పండించము. 10 మేము గుడారాల్లో నివసిస్తూ. మా పూర్వీకుడైన యెహోనాదాబు యొక్క ఆజ్ఞలన్నీ పాలిస్తున్నాము. 11 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని ముట్టడించినప్పుడు, మేము యెరూషలేములో ప్రవేశించాము. అప్పుడు మాలో మేము, ‘రండి, మనమంతా యెరూషలేము నగరానికి వెళద్దాం. అలా వెళ్లి బబులోను సైన్యం నుండి, అరాము దేశ (కల్దీయుల) సైన్యం నుండి మనల్ని మనం రక్షించుకుందాము’ అని అనుకున్నము. ఆ విధంగా మేము యెరూశలేములో ఉండి పోయాము”
12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది: 13 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యిర్మీయా, ఈ వర్తమానం యూదా వారికి, యెరూషలేము ప్రజలకు తెలియ జేయుము. ఓ ప్రజలారా, మీరొక గుణపాఠం నేర్చుకొని, నా సందేశాన్ని పాటించాలి.” ఇదే యెహోవా వాక్కు. 14 “రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షారసం తాగవద్దని తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ శిరసావహించబడింది. ఈ రోజు వరకూ యెహోనాదాబు సంతతి వారు తమ పితరుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చారు. వారు ద్రాక్షారసం తాగరు. కాని నేను యెహోవాను. యూదా ప్రజలైన మీకు అనేక పర్యాయాలు సందేశాలు పంపియున్నాను. కాని మీరు నాకు విధేయులుకాలేదు. 15 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీ వద్దకు నా సేవకులగు ప్రవక్తలను పంపాను. వారిని అనేక పర్యాయాలు మీ వద్దకు పంపినాను. ఆ ప్రవక్తలు మీతో, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీలో ప్రతి ఒక్కడు చెడు కార్యాలు చేయటం మానివేయాలి. మంచి చెయ్యండి, ఇతర దేవతలను వెంబడించవద్దు, పూజించవద్దు, మీరు నాకు విధేయులై, మీ పూర్వీకులకు, మీకు నేను ఇచ్చిన భూమియందు మీరు నివసించవచ్చు’ అని అన్నాను. కాని మీరు నా మాటను వినుటకు తిరస్కరించారు. 16 యెహోనాదాబు సంతతివారు వారి పూర్వీకుడు ఇచ్చిన ఆజ్ఞను తప్పక పాటించారు. కాని యూదా ప్రజలు మాత్రం నాకు విధేయులు కాలేదు.”
17 కావున ఇశ్రాయేలీయులు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదాకు, యెరూషలేముకు చాలా కష్టాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. త్వరలో ఆ విపత్తులన్నీ సంభవించేలా చేస్తాను. నేను ఆ ప్రజలతో మాట్లాడాను. కాని వారు వినటానికి నిరాకరించారు. నేను వారిని పిలిచాను. కాని వారు సమాధానం మియ్యలేదు.”
18 రేకాబీయులతో యిర్మీయా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘మీరంతా మీ పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞ పాటించినారు. యెహోనాదాబు బోధనలను మీరు అనుసరించారు. ఆయన చెప్పినదంతా మీరు ఆచరించారు. 19 కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతిలో ఒకడు సదా నాసేవలో నిమగ్నమై ఉంటాడు.’ ”
*35:2: రేకాబీయులు వీరు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వారు. తరువాత వాక్యములు చూడండి. ఈ వంశం వారు యెహోవా పట్ల చాలా భక్తి విశ్వాసాలు గలవారు. యెహోనాదాబు కథ కొరకు రాజుల రెండవ గ్రంథం 10:15-18 చూడండి.
†35:3: యజన్యా ఇతడు ఆనాటి రేకాబీయులకు పెద్ద.
‡35:3: యిర్మీయా ఈ యిర్మీయా ప్రవక్తయైన యిర్మీయా కాడు. ఆ పేరు గల మరోవ్యక్తి.