విలాప వాక్యములు
1
యెరూషలేము తన వినాశనానికి దుఃఖించుట
యెరూషలేము ఒకనాడు జనసందోహంతో కిటకిటలాడిన నగరం.
కాని ఘోరంగా నిర్జనమయ్యంది!
ఒకప్పుడు ప్రపంచ మహానగరాల్లో యెరూషలేము ఒక మహానగరం.
కాని అది విధవరాలుగా అయింది.
ఒకనాడామె నగరాలలో యువరాణిలా ఉన్నది.
కాని ఆమె ఒక బానిసలా చేయబడింది.
ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది.
ఆమె కన్నీరు ఆమె చెక్కిళ్లపై ఉన్నాయి.
ఆమెను ఓదార్చటానికి ఎవ్వరూ లేరు.
ఆమెతో సఖ్యంగా ఉన్న ఏ ఒక్క దేశమూ
ఆమెను ఓదార్ఛలేదు.
ఆమె స్నేహితులంతా ఆమెపట్ల విముఖులయ్యారు.
ఆమె స్నేహితులు ఆమెకు శత్రువులయ్యారు.
అనేక బాధలను అనుభవించి యూదా బందీ అయ్యింది.
మిక్కిలి శ్రమకు గురియై యూదా బందీ అయ్యింది.
యూదా పరదేశీయుల మధ్య నివసిస్తూ ఉంది.
ఆమెకు విశ్రాంతిలేదు.
ఆమెను వెంటాడిన ప్రజలు ఆమెను పట్టుకున్నారు.
ఆ ప్రజలు ఆమెను ఇరుకు లోయల్లో పట్టుకున్నారు.
సియోనుకు పోయే మార్గాలన్నీ దుఃఖమయ మయ్యాయి.
అందుకు కారణం సీయోనుకు నియామక కూటాలకు ఎవ్వరూ రాకపోవటమే.
సీయోను ద్వారాలు పాడుబడినాయి.
సీయోను యాజకులు మూల్గుచున్నారు.
సీయోను యువతులు పట్టుబడ్డారు.
ఇదంతా సీయోనుకు భరింపరాని విషాదం.
యెరూషలేము శత్రువులు గెలిచారు.
ఆమె శత్రువులు విజయవంతులయ్యారు.
యెహోవా ఆమెను శిక్షించిన కారణంగా ఇదంతా జరిగింది.
యెరూషలేము చేసిన అనేక పాపాలకు ఆయన ఆమెను శిక్షించినాడు.
ఆమె పిల్లలు వెళ్ళిపోయారు.
వారి శత్రువులకు బందీలై వారు వెళ్ళిపోయారు.
సీయోను కుమార్తె*మృత … వుంది మృత సముద్రపు ఉప్పు నీరు క్రొత్తదిగా అవుతుంది. అందం
మాయమయ్యింది.
ఆమె రాకుమారులు లేళ్లవలె అయ్యారు.
గడ్డి మేయటానికి పచ్చిక బయలు కానరాని లేళ్లవలె వారున్నారు.
శక్తి లేకపోయినా వారెలాగో పారిపోయారు.
తమను వెంటాడుతున్న వారి నుండి వారు పారిపోయారు.
యెరూషలేము గతాన్ని తలుస్తూవుంది
యెరూషలేము బాధపడిన దినాలను, నివాసం లేక
తిరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది.
ఆమె తన గత వైభవాన్ని జ్ఞాపకం చేసికొంటూవుంది.
పాత రోజుల తన అనుభవాలను ఆమె తలపోసుకొంటుంది.
శత్రువు తన ప్రజలను చెరబట్టిన దినాలను ఆమె జ్ఞాపకం చేసికొంటూ ఉంది.
ఆమెకు క లిగిన నిస్సహాయ పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసికొంటుంది.
ఆమె శత్రువులు ఆమెను చూచి నవ్వారు.
ఆమె నాశనం చేయబడినందున వారు నవ్వారు.
యెరూషలేము ఘోరంగా పాపం చేసింది.
యెరూషలేము పాపాల కారణంగా
ఆమెను చూసిన వారంతా తలలూపే పరిస్థితి వచ్చింది.
ఆమెను గౌరవించిన వారంతా ఇప్పుడామెను అసహ్యించుకుంటున్నారు.
ఆమెను వారు నగ్నంగా చూశారు,
గనుక వారామెను అసహ్యించు కుంటున్నారు.
యెరూషలేము మూల్గుతూ ఉంది.
ఆమె వెనుదిరిగి పోతూవుంది.
యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి.
తనకు జరిగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు.
ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది.
ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు.
“ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు!
తనెంత గొప్పవాడినని నాశత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.
 
10 శత్రువు తన చేతిని చాచాడు.
అతడామె విలువైన వస్తువులన్నీ తీసికొన్నాడు.
వాస్తవంగా, పరదేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవేశించటం ఆమెచూసింది.
ఓ యెహోవా, ఆ ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు! అని నీవు ఆజ్ఞాపించావు.
11 యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు.
ఆమె ప్రజలంతా ఆహారం కొరకు వెదుకుతున్నారు.
ఆహారం కొరకు వారికున్న విలువైన వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు.
ఇది వారు తమ ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు.
యెరూషలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు చూడు; నావైపు చూడు!
ప్రజలు నన్నెలా అసహ్యించుకొంటున్నారో చూడు.
12 త్రోవన పోయే ప్రజలారా, మీరు నన్ను లక్ష పెట్టినట్లు లేదు.
కాని నావైపు దృష్టి ప్రసరించి చూడండి.
నా బాధవంటి బాధ మరొక్కటేదైనా ఉందా?
నాకు సంభవించిన బాధలాంటిది మరేదైనా ఉందా?
యెహోవా నన్ను శిక్షంచిన బాధకు మించిన బాధ మరేదైనా ఉందా?
ఆయనకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున ఆయన నన్ను శిక్షించాడు.
13 యెహోవా పైనుండి అగ్ని కురిపించాడు
ఆ అగ్ని నా ఎముకలకంటింది.
ఆయన నా కాళ్లకు వలపన్నాడు.
ఆయన నన్ను అన్ని వైపులకు తిప్పాడు.
ఆయమన నన్ను ఒక బీడు భూమిలా మార్చాడు.
నేను రోజంతా అస్వస్థతగా ఉన్నాను.
 
14 “కాడివలె నా పాపాలు కట్టబడ్డాయి.
యెహోవా చేతుల్లో నా పాపాలు మూటగట్టబడ్డాయి.
యెహోవా కడి నా మెడ మీద ఉంది.
యెహోవా నన్ను బలహీన పర్చాడు.
నేను ఎదిరించలేని ప్రజలకు
యెహోవా నన్ను అప్పజెప్పాడు.
15 “బలమైన నా సైనికులందరినీ యెహోవా తిరస్కరించాడు.
ఆ సైనికులంతా నగరంలోనివారే పిమ్మట యెహోవా ఒక జనసమూహాన్ని నా మీదికి తెచ్చాడు.
నా యువ సైనికులను చంపటానికే ఆయన ఆ జనాన్ని తీసుకొని వచ్చాడు.
ద్రాక్షా గానుగలలో వున్న కాయలపై (ప్రజలు) యెహోవా అడుగువేసి త్రొక్కాడు.
ఆ ద్రాక్షా గానుగ కన్యక అయిన యెరూషలేము కుమారి.
 
16 “ఈ విషయాలన్నిటిపట్ల నేను వ్యధ చెందుతున్నాను.
నా కళ్ళు; కన్నీళ్లతో తడిసిపోయాయి.
నన్ను ఓదార్చు వారెవ్వరూ నావద్ద లేరు.
నన్ను ఓదార్చి స్వస్థపర్చు వారెవ్వరూ లేరు.
నా పిల్లలు బంజ రు భూమిలా ఉన్నారు.
శత్రువు గెలవటంతో వారలా తాయారయ్యారు.”
 
17 సీయోనుసీయోను యెరూషలేము నగరం కట్టబడిన పర్వతానికి ఆగ్నేయ మూల. యెరూషలేములో నివసిస్తున్న దేవుని ప్రజలు అని కూడ అర్థం. తన చేతులు చాపింది.
ఆమెను ఆదరించేవారెవ్వరూ లేరు.
యాకోబుయాకోబు ఇది ఇశ్రాయేలుకు మరో పేరు. శత్రువులకు యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు.
యాకోబు శత్రువులకు అతనిని చుట్టుముట్టుమని
యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. యెరూషలేము అపవిత్రమయ్యింది.
ఆ శత్రువుల మధ్య ఆమె అపవిత్రురాలైంది.
 
18 “నేను యెహోవాను అనుసరించటానికి తిరస్కరించాను.
అందువల్ల ఆయన చేసిన పని న్యాయమైనదే అని ఆమె అంటూంవుంది.
కావున ప్రజలారా, వినండి!
నా బాధను గమనించండి!
నా యువతీ యువకులు బందీలైపోయారు.
19 నా ప్రేమికులను నేను పిలిచాను.
కాని వారు నన్ను మోసగించారు.
నా యాజకులు, నా పెద్దలు నగరంలో చనిపోయారు.
ఆహారం కొరకు వారు అన్వేషించారు.
వారు తమ ప్రాణాలను నిలుపుకోదల్చారు.
 
20 “యెహోవా, నా వైపు చూడు. నేను బాధలో ఉన్నాను!
నాలో కలవరం చెలరేగింది! నా గుండె తల్లిక్రిందులైనట్లు నాకు భావన కలుగుతూ వుంది!
నా కలవరపాటుకు కారణం
నేను మొండిగా తిరిగుపబాటు చేయటమే!
నా పిల్లలు నడివీదుల్లో కత్తికి గురి అయ్యారు.
ఇంటిలోపల మృత్యువు పొంచివుంది.
 
21 “నా గోడు విను, నేను దుఃఖభారంతో నిట్టూర్చుతున్నాను.
ఓదార్చటానికి నాకు ఎవ్వరూ లేరు.
నా శత్రువులంతా నా కష్టాల గురించి విన్నారు.
విని సంతోషపడ్డారు.
నీవు నాకు ఈ శిక్ష విధించినందుకు వారు సంతోషించారు.
నీవు ప్రకటించిన ఆ రోజును ఇప్పుడు రప్పించుము.
ఆ రోజున నా శత్రువులు ఇప్పుడు
నేనున్న స్థితికి వచ్చేలా చేయుము.
 
22 “నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమవ్వనిమ్ము.
నా పాపాలకు నీవు నన్ను శిక్షించినట్లు,
అప్పుడు వారి దుష్టత్వానికి వారిని శిక్షించుము.
పొంగిన ధుఃఖంతో ఎడతెరిపి లేకుండా నేను మూల్గుతున్నాను. అందువల్ల నీవు ఇది చెయ్యి.
నా హృదయం కృంగి కృశించినందున నీవు ఈ పని చెయ్యి.”
 

*1:6: మృత … వుంది మృత సముద్రపు ఉప్పు నీరు క్రొత్తదిగా అవుతుంది.

1:17: సీయోను యెరూషలేము నగరం కట్టబడిన పర్వతానికి ఆగ్నేయ మూల. యెరూషలేములో నివసిస్తున్న దేవుని ప్రజలు అని కూడ అర్థం.

1:17: యాకోబు ఇది ఇశ్రాయేలుకు మరో పేరు.