137
బబులోను నదుల దగ్గర మనం కూర్చొని
సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లుకు*నిరవంజి చెట్టు బూరుగవంటి ఒక అడవి చెట్టు. మన సితారాలు తగిలించాము.
బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.
సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు.
సియోను గూర్చి పాటలు పాడుమని వారు మనకు చెప్పారు.
కానీ విదేశంలో మనం యెహోవాకు
కీర్తనలు పాడలేము!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే
నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండి పోవును గాక!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే
నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకు పోవును గాక!
నేను ఎన్నటికీ నిన్ను మరువనని
వాగ్దానం చేస్తున్నాను.
 
యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!
యెహోవా, యెరూషలేము పడిన రోజున
ఎదోమీయులు ఏమిచేసారో జ్ఞాపకం చేసుకోనుము.
దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!
నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించ బడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
నీ చంటి బడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.
 

*137:2: నిరవంజి చెట్టు బూరుగవంటి ఒక అడవి చెట్టు.