7
ఇశ్శాఖారు
1 ఇశ్శాఖారు కుమారులు:
తోలా, పువా, యాషూబు, షిమ్రోను మొత్తం నలుగురు.
2 తోలా కుమారులు:
ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, ఇబ్శాము, సమూయేలు. వీరు తమ కుటుంబాలకు పెద్దలు. దావీదు పాలనలో తోలా సంతానం యుద్ధవీరులుగా లెక్కించబడ్డారు. వీరి సంఖ్య 22,600.
3 ఉజ్జీ కుమారుడు:
ఇజ్రహయా.
ఇజ్రహయా కుమారులు:
మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా. ఈ అయిదుగురు పెద్దలు. 4 వారికి చాలామంది భార్యలు, పిల్లలు ఉండడం వల్ల వారి వంశావళి ప్రకారం వారిలో యుద్ధవీరుల సంఖ్య 36,000.
5 ఇశ్శాఖారు వంశాలన్నిటికి చెందిన వీరి బంధువుల నుండి వారి వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 87,000.
బెన్యామీను
6 బెన్యామీనుకు కుమారులు ముగ్గురు:
బేల, బెకెరు, యెదీయవేలు.
7 బేల కుమారులు:
ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరీ మొత్తం అయిదుగురు. వీరు కుటుంబ పెద్దలు. తమ వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 22,034.
8 బెకెరు కుమారులు:
జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీరందరు బెకెరు కుమారులు. 9 తమ వంశావళి ప్రకారం వీరు కుటుంబ పెద్దలు; యుద్ధవీరుల సంఖ్య 20,200.
10 యెదీయవేలు కుమారుడు:
బిల్హాను.
బిల్హాను కుమారులు:
యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు. 11 యెదీయవేలు కుమారులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు. వీరిలో యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న యుద్ధవీరుల సంఖ్య 17,200.
12 ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు*లేదా ఈరు దాను కుమారులు: హుషీము ఆది 46:23 చూడండి; హెబ్రీలో, దాను కుమారులు అని లేదు అహేరు వారసులు.
నఫ్తాలి
13 నఫ్తాలీయులైన బిల్హా వారసులు:
యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము.
మనష్షే
14 మనష్షే వారసులు:
అరాము దేశస్థురాలైన ఉంపుడుగత్తె ద్వారా అశ్రీయేలు అతనికి వారసుడు అయ్యాడు.ఆమె గిలాదు తండ్రియైన మాకీరుకు జన్మనిచ్చింది. 15 మాకీరు షుప్పీము, హుప్పీముల సోదరిని పెళ్ళి చేసుకున్నాడు. వారి సోదరి పేరు మయకా. మరో వారసుని పేరు సెలోఫెహాదు. అతనికి కుమార్తెలు మాత్రమే పుట్టారు. 16 మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అనే పేరు పెట్టింది. అతని తమ్ముని పేరు షెరెషు. అతని కుమారులు ఊలాము, రాకెము.
17 ఊలాము కుమారుడు:
బెదాను.
వీరు మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన గిలాదు కుమారులు.
18 మాకీరు సోదరి హమ్మోలెకెతుకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు.
19 షెమీదా కుమారులు:
అహెయాను, షెకెము, లికీ, అనీయాము.
ఎఫ్రాయిం
20 ఎఫ్రాయిం వారసులు:
ఎఫ్రాయిం కుమారుడు షూతలహు, అతని కుమారుడు బెరెదు,
అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఎల్యాదా,
అతని కుమారుడు తాహతు, 21 అతని కుమారుడు జాబాదు,
అతని కుమారుడు షూతలహు.
(అతని కుమారులైన ఏజెరు ఎల్యాదులు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకోడానికి వెళ్లినప్పుడు, గాతీయులు వారిని చంపారు. 22 వారి తండ్రియైన ఎఫ్రాయిం చాలా రోజులు దుఃఖపడ్డాడు, అతని బంధువులు వచ్చి అతన్ని ఓదార్చారు. 23 ఆ తర్వాత అతడు తన భార్యను కలుసుకోగా ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. తన కుటుంబంలో జరిగిన కీడును బట్టి ఎఫ్రాయిం అతనికి బెరీయా†బెరీయా హెబ్రీ పదంలా ఉంది కీడు దురదృష్టం అని అర్థం ఇస్తుంది అనే పేరు పెట్టాడు. 24 అతని కుమార్తెయైన షెయెరా దిగువ బేత్-హోరోను, ఎగువ బేత్-హోరోను, ఉజ్జెన్-షెయెరా అనే పట్టణాలను కట్టించింది.)
25 ఎఫ్రాయిం కుమారుడు రెపహు, అతని కుమారుడు రెషెపు,
అతని కుమారుడు తెలహు, అతని కుమారుడు తహను,
26 అతని కుమారుడు లద్దాను, అతని కుమారుడు అమీహూదు,
అతని కుమారుడు ఎలీషామా, 27 అతని కుమారుడు నూను,
అతని కుమారుడు యెహోషువ.
28 వారి ప్రదేశాలు నివాసస్థలాలు ఏవంటే, బేతేలు దాని చుట్టుప్రక్కల గ్రామాలు, తూర్పున ఉన్న నహరాను, పడమర ఉన్న గెజెరు దాని గ్రామాలు, షెకెము దాని గ్రామాలు, అయ్యా దాని గ్రామాల వరకు ఉన్న ప్రాంతాలు. 29 మనష్షే సరిహద్దులలో ఉన్న బేత్-షాను, తానాకు, మెగిద్దో, దోరు, వాటి గ్రామాలతో పాటు వారివే. ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు వారసులు ఈ పట్టణాల్లో నివసించారు.
ఆషేరు
30 ఆషేరు కుమారులు:
ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు.
31 బెరీయా కుమారులు:
హెబెరు, బిర్జాయీతు తండ్రియైన మల్కీయేలు.
32 హెబెరు యప్లేటు, షోమేరు, హోతాము, వారి సోదరియైన షూయాలకు తండ్రి.
33 యప్లేటు కుమారులు:
పాసకు, బింహాలు, అష్వాతు.
వీరు యప్లేటు కుమారులు.
34 షోమేరు కుమారులు:
అహీ, రోగా,‡లేదా వారి సహోదరుడు షోమేరు: రోగా యెహుబ్బా, అరాము.
35 అతని సోదరుడైన హేలెము కుమారులు:
జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.
36 జోపహు కుమారులు:
సూయ, హర్నెఫెరు, షూయాలు, బేరీ, ఇమ్రా, 37 బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను,§యెతెరు యొక్క మరొక రూపం కావచ్చు బెయేర.
38 ఎతెరు కుమారులు:
యెఫున్నె, పిస్పా, అరా.
39 ఉల్లా కుమారులు:
ఆరహు హన్నియేలు రిజెయా
40 ఆషేరు వారసులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు, ప్రసిద్ధి చెందిన పరాక్రమశాలులు, గొప్ప నాయకులు. వారి వంశావళిలో నమోదు చేయబడినట్లుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య 26,000.