9
ఇశ్రాయేలు ప్రజలందరి పేర్లు తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. వారు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడ్డారు.
యెరూషలేములో ఉన్న ప్రజలు
తమ సొంత పట్టణాల్లో తమ స్వాస్థ్యంలో మొదట నివసించిన వారెవరంటే, కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు.
 
యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం మనష్షే వారిలో యెరూషలేము పట్టణంలో నివసించినవారు:
యూదా కుమారుడైన పెరెసు వారసుడు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడైన అమీహూదు పుట్టిన ఊతై.
షేలానీయుల*హెబ్రీలో షిలోనీయులు సంఖ్యా 26:20 చూడండి నుండి:
మొదట కుమారుడైన అశాయా, అతని కుమారులు.
జెరహు వారిలో నుండి:
యెవుయేలు.
యూదా నుండి మొత్తం 690 మంది.
 
బెన్యామీనీయుల నుండి:
హస్సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన సల్లు;
యెరోహాము కుమారుడైన ఇబ్నియా;
మిక్రి కుమారుడైన ఉజ్జీకి పుట్టిన ఏలా;
ఇబ్నెయా కుమారుడైన రెయూయేలుకు పుట్టిన షెఫట్యా కుమారుడైన మెషుల్లాము.
తమ వంశావళి ప్రకారం బెన్యామీను నుండి ప్రజలు మొత్తం 956 మంది. వీరందరు తమ తమ కుటుంబాలకు పెద్దలు.
 
10 యాజకుల నుండి:
యెదాయా; యెహోయారీబు; యాకీను;
11 అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడు మెషుల్లాము పుట్టిన హిల్కీయా కుమారుడైన అజర్యా; ఇతడు దేవుని మందిరంలో ప్రముఖ అధిపతి;
12 మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన యెరోహాము కుమారుడు అదాయా;
ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతుకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన యహజెరాకు పుట్టిన అదీయేలు కుమారుడైన మశై;
13 తమ కుటుంబాలకు పెద్దలుగా ఉన్న యాజకుల సంఖ్య 1,760. వారు దేవుని మందిరంలో సేవలు అందించే బాధ్యత కలిగిన సమర్థులు.
 
14 లేవీయుల నుండి:
మెరారీయుడైన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా;
15 బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడైన జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా;
16 యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా;
ఎల్కానాకు పుట్టిన ఆసా కుమారుడైన బెరెక్యా; ఇతడు నెటోపాతీయుల గ్రామాల్లో నివసించాడు.
 
17 ద్వారపాలకులు:
షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వారి తోటి లేవీయులు. వీరిలో షల్లూము పెద్ద. 18 వారు తూర్పున ఉన్న రాజు ద్వారం దగ్గర ఇప్పటివరకు సేవ చేస్తున్నారు. వీరందరు లేవీయుల సమూహానికి చెందిన ద్వారపాలకులు.
19 కోరహు కుమారుడైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము, తన కోరహీయుల వంశంలోని తన తోటి ద్వారపాలకులు, తమ పూర్వికులు యెహోవా శిబిరానికి కావలివారిగా ఉన్నట్లుగా, వారు ఆలయద్వారాన్ని కాపలా కాసేవారు.
20 పూర్వకాలంలో ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ద్వారపాలకుల మీద అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నారు.
21 మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమావేశ గుడారపు ద్వారానికి ద్వారపాలకుడు.
22 ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడినవారు 212 మంది. వారు తమ గ్రామాల్లో తమ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు.
 
వారు నమ్మకమైన వారని దావీదు, దీర్ఘదర్శియైన సమూయేలు వారిని ఆ స్థానాల్లో నియమించారు. 23 వారు వారి వారసులు సమావేశపు గుడారం అని పిలువబడే యెహోవా మందిరపు ద్వారాలకు కాపలా కాసే బాధ్యత కలిగి ఉన్నారు. 24 ద్వారపాలకులు నలువైపులా ఉన్నారు అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్నారు. 25 వారి గ్రామాల్లో ఉండే వారి తోటి లేవీయులు క్రమంగా వస్తూ ఏడు రోజులపాటు తమ విధులను పంచుకునేవారు. 26 అయితే లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు నమ్మకమైనవారు కాబట్టి దేవుని మందిరపు గదులకు, ఖజానాకు సంబంధించిన బాధ్యత వారికి ఇవ్వబడింది. 27 వారు దేవుని ఆలయానికి కావలివారు కాబట్టి దాని దగ్గరే రాత్రంతా ఉండేవారు; ప్రతి ఉదయం దాని తలుపులు తెరిచే బాధ్యత వారిదే.
28 వారిలో కొందరికి ఆలయ సేవలో ఉపయోగించే వస్తువుల బాధ్యత ఇవ్వబడింది; వాటిని లోపలికి తెచ్చినప్పుడు బయటకు తీసుకెళ్లినప్పుడు వారు వాటిని లెక్కించేవారు. 29 ఇతరులకు ఉపకరణాలు, పరిశుద్ధాలయంలో ఉన్న ఇతర వస్తువులన్నిటి బాధ్యత ఇవ్వబడింది. వాటితో పాటు సన్నని పిండి, ద్రాక్షరసం, ఒలీవనూనె, ధూపద్రవ్యాలు, సుగంధద్రవ్యాలు వారి ఆధీనంలోనే ఉంటాయి. 30 అయితే యాజకులలో కొంతమంది సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని చేసేవారు. 31 కోరహు వంశీయుడైన షల్లూము మొదటి కుమారుడైన మత్తిత్యా అనే లేవీయుడు నమ్మకమైనవాడు కాబట్టి అతనికి అర్పణల రొట్టెలు తయారుచేసే బాధ్యత ఇవ్వబడింది. 32 వారి తోటి లేవీయులైన కహాతీయులలో కొందరికి ప్రతి సబ్బాతు దినం కోసం బల్లపై ఉంచే రొట్టెలు సిద్ధం చేసే బాధ్యత ఇవ్వబడింది.
33 లేవీయుల కుటుంబ పెద్దలలో సంగీతకారులు దేవాలయపు గదుల్లో ఉండేవారు. వారు రాత్రింబగళ్ళు పని చేయాలి కాబట్టి వారికి వేరే ఏ పని అప్పగించబడలేదు.
34 వీరందరు లేవీయుల కుటుంబ పెద్దలు, తమ వంశం ప్రకారం నాయకులు. వారు యెరూషలేములో నివసించారు.
సౌలు వంశావళి
35 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు.
అతని భార్యపేరు మయకా. 36 అతని మొదటి కుమారుడు అబ్దోను, తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 37 గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు పుట్టారు. 38 మిక్లోతు షిమ్యాముకు తండ్రి. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.
39 నేరు కీషుకు తండ్రి, కీషు సౌలుకు తండ్రి, యోనాతాను, మల్కీ-షూవ, అబీనాదాబు, ఎష్-బయలుఇష్-బోషెతు అని కూడా పిలిచేవారు అనేవారు సౌలు కుమారులు.
40 యోనాతాను కుమారుడు:
మెరీబ్-బయలు,మెఫీబోషెతు అని కూడా పిలిచేవారు ఇతడు మీకాకు తండ్రి.
41 మీకా కుమారులు:
పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు.
42 ఆహాజు యదాకు§కొ.ప్ర.లలో యరా తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి. జిమ్రీ మోజా అనేవారు యదా కుమారులు. 43 మోజా బిన్యాకు తండ్రి; బిన్యా కుమారుడు రెఫాయా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.
44 ఆజేలు కుమారులు ఆరుగురు. వారి పేర్లు ఇవి:
అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరు ఆజేలు కుమారులు.

*9:5 హెబ్రీలో షిలోనీయులు సంఖ్యా 26:20 చూడండి

9:39 ఇష్-బోషెతు అని కూడా పిలిచేవారు

9:40 మెఫీబోషెతు అని కూడా పిలిచేవారు

§9:42 కొ.ప్ర.లలో యరా