25
సంగీతకారులు
1 దావీదు, తన సైన్యాధిపతులతో కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను అనేవారి కుమారులలో కొందరిని సితారాలు, వీణలు, తాళాలు వాయిస్తూ ప్రవచించే పరిచర్య కోసం నియమించారు. ఈ సేవకు నియమించబడినవారి జాబితా ఇది:
2 ఆసాపు కుమారుల నుండి:
జక్కూరు, యోసేపు, నెతన్యా, అషరేలా. వీరు రాజు పర్యవేక్షణలో ప్రవచిస్తూ, ఆసాపు పర్యవేక్షణలో ఉన్న ఆసాపు కుమారులు.
3 యెదూతూను కుమారుల నుండి:
గెదల్యా, జెరీ, యెషయా, షిమ్యా, హషబ్యా, మత్తిత్యా, మొత్తం ఆరుగురు, వీరు స్తుతి పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి వీణ వాయిస్తూ ప్రవచించే తమ తండ్రియైన యెదూతూను పర్యవేక్షణలో ఉన్నవారు.
4 హేమాను కుమారుల నుండి:
బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు; హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమమ్తీ-యెజెరు; యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు. 5 (వీరంతా రాజుకు దీర్ఘదర్శిగా ఉన్న హేమాను కుమారులు. తన వాగ్దానాల ప్రకారం హేమానును గొప్ప చేయడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు.)
6 వీరందరు తమ తండ్రుల పర్యవేక్షణలో ఉండి, యెహోవా మందిరంలో తాళాలు, వీణలు, సితారాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుని మందిరం దగ్గర సేవ చేసేవారు.
ఆసాపు, యెదూతూను, హేమానులు రాజు పర్యవేక్షణలో ఉండేవారు. 7 యెహోవాకు పాటలు పాడడంలో నైపుణ్యం ఉన్న వీరి బంధువులందరితో కలిపి వీరి సంఖ్య 288. 8 చిన్నా, పెద్దా, గురువు శిష్యుడు అనే భేదం లేకుండా చీట్లు వేసి విధులు నిర్ణయించుకున్నారు.
9 మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరిట వచ్చింది,
రెండవది గెదల్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు*కొ.ప్ర.లలో ఇతని కుమారులు బంధువులు అని లేదు పన్నెండుమంది.
10 మూడవది జక్కూరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
11 నాలుగవది యిజ్రీ†జెరీ మరొక పేరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
12 అయిదవది నెతన్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
13 ఆరవది బక్కీయాహు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
14 ఏడవది యెషర్యేలా‡అషర్యేలా మరొక పేరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
15 ఎనిమిదవది యెషయా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
16 తొమ్మిదవది మత్తన్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
17 పదవది షిమీ పేరట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
18 పదకొండవది అజరేలు§ఉజ్జీయేలు అజరేలు యొక్క మరొక పేరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
19 పన్నెండవది హషబ్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
20 పదమూడవది షూబాయేలు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
21 పద్నాలుగవది మత్తిత్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
22 పదిహేనవది యెరేమోతు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
23 పదహారవది హనన్యా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
24 పదిహేడవది యొష్బెకాషా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
25 పద్దెనిమిదవది హనానీ పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
26 పందొమ్మిదవది మల్లోతి పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
27 ఇరవయ్యవది ఎలీయాతా పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
28 ఇరవై ఒకటవది హోతీరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
29 ఇరవై రెండవది గిద్దల్తీ పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
30 ఇరవై మూడవది మహజీయోతు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
31 ఇరవై నాలుగవది రోమమ్తీ-యెజెరు పేరిట వచ్చింది,
ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.