27
సైన్య విభాగాలు 
  1 ఇది ఇశ్రాయేలీయుల కుటుంబ నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వివిధ విషయాల్లో రాజుకు సేవలందించే అధికారుల జాబితా. వీరిలో ప్రతి విభాగం సంవత్సరంలో ఒక నెల చొప్పున సేవ చేస్తారు. ఒక్కొక్క విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 2 మొదటి నెలలో మొదటి విభాగం మీద జబ్దీయేలు కుమారుడైన యషోబీము అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   3 అతడు పెరెసు వారసుడు, మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉన్నాడు.   
 4 రెండవ నెల విభాగం మీద అహోహీయుడైన దోదైది అధిపతిగా ఉన్నాడు; అతని విభాగానికి నాయకుడు మిక్లోతు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 5 మూడవ నెలకు యాజకుడైన యెహోయాదా కుమారుడైన బెనాయా మూడవ సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   6 ఈ బెనాయా పరాక్రమశాలి, ముప్పైమంది వీరులలో ఒకనిగా, ఆ ముప్పైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని కుమారుడైన అమ్మీజాబాదు అతని విభాగంలో అధిపతిగా ఉన్నాడు.   
 7 నాలుగవ నెలకు యోవాబు సోదరుడైన అశాహేలు నాలుగో విభాగం మీద అధిపతిగా ఉన్నాడు; అతని తర్వాత, అతని కుమారుడైన జెబద్యా అధిపతి అయ్యాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 8 అయిదవ నెలకు ఇశ్రాహేతీయుడైన షంహూతు అయిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 9 ఆరవ నెలకు తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడైన ఈరా, ఆరవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 10 ఏడవ నెలకు ఎఫ్రాయిమీయుడు పెలోనీయుడైన హేలెస్సు ఏడవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 11 ఎనిమిదవ నెలకు జెరహీయుల బంధువైన హుషాతీయుడైన సిబ్బెకై ఎనిమిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 12 తొమ్మిదవ నెలకు బెన్యామీనీయుడు అనాతోతీయుడైన అబీయెజెరు తొమ్మిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 13 పదవ నెలకు జెరహీయుడు, నెటోపాతీయుడైన మహరై పదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 14 పదకొండవ నెలకు ఎఫ్రాయిమీయుడు పిరాతోనీయుడునైన బెనాయా పదకొండవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
 15 పన్నెండవ నెలకు నెటోపాతీయుడునైన ఒత్నీయేలు వంశస్థుడైన హెల్దయి పన్నెండవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.   
గోత్రాల నాయకులు 
  16 ఇశ్రాయేలీయుల గోత్రాల నాయకులు:  
రూబేనీయులమీద: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు;  
షిమ్యోనీయుల మీద: మయకా కుమారుడైన షెఫట్యా;   
 17 లేవీయుల మీద: కెమూయేలు కుమారుడైన హషబ్యా;  
అహరోనీయుల మీద: సాదోకు;   
 18 యూదా వారి మీద: దావీదు సోదరుడైన ఎలీహు;  
ఇశ్శాఖారీయుల మీద: మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ;   
 19 జెబూలూనీయుల మీద: ఓబద్యా కుమారుడైన ఇష్మయా;  
నఫ్తాలీయుల మీద: అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు;   
 20 ఎఫ్రాయిమీయుల మీద: అజజ్యాహు కుమారుడైన హోషేయ;  
మనష్షే అర్థగోత్రం మీద: పెదాయా కుమారుడైన యోవేలు;   
 21 గిలాదులోని మనష్షే అర్థగోత్రం మీద: జెకర్యా కుమారుడైన ఇద్దో;  
బెన్యామీనీయుల మీద: అబ్నేరు కుమారుడైన యయశీయేలు;   
 22 దానీయుల మీద: యెరోహాము కుమారుడైన అజరేలు.   
వీరు ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులు.  
 23 ఇశ్రాయేలును ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా వాగ్దానం చేశారు, కాబట్టి ఇరవై సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయస్సున్న వారిని దావీదు లెక్కించలేదు.   24 సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు వ్రాయడానికి ఆరంభించాడు కాని దానిని ముగించలేదు. జనాభా లెక్కలు వ్రాయడం వలన ఇశ్రాయేలు మీదికి దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి ఆ జనసంఖ్య రాజైన దావీదు చరిత్ర గ్రంథంలో నమోదు కాలేదు.   
రాజు పర్యవేక్షకులు 
  25 రాజ్య గిడ్డంగులకు అదీయేలు కుమారుడైన అజ్మావెతు అధికారి.  
పల్లెప్రాంతాలలో, పట్టణాల్లో గ్రామాల్లో కోటలలో ఉన్న గిడ్డంగులకు ఉజ్జియా కుమారుడైన యోనాతాను అధికారి.   
 26 పొలాల్లో పని చేసేవారిమీద, భూమి దున్నే వారి మీద కెలూబు కుమారుడైన ఎజ్రీ అధికారి.   
 27 ద్రాక్షతోటల మీద రామతీయుడైన షిమీ అధికారి.  
ద్రాక్షతోటల నుండి ఉత్పత్తి అయ్యే ద్రాక్షరసాన్ని నిల్వజేసే తొట్టెల మీద షిప్మీయుడైన జబ్ది అధికారి.   
 28 పశ్చిమ దిగువ ప్రాంతంలో*హెబ్రీలో షెఫేలా ఉన్న ఒలీవచెట్లు, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్-హనాను అధికారి.  
ఒలీవనూనె గిడ్డంగులకు యోవాషు అధికారి.   
 29 షారోనులో మేసే పశువులమీద షారోనీయుడైన షిట్రయి అధికారి.  
లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతు అధికారి.   
 30 ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు అధికారి.  
గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు అధికారి.   
 31 మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి.   
వీరందరు రాజైన దావీదు ఆస్తి మీద నియమించబడిన అధికారులు.  
 32 దావీదు పినతండ్రియైన యోనాతాను సలహాదారుడు, వివేకం ఉన్నవాడు, లేఖికుడు.  
హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజకుమారుల సంరక్షకుడు.   
 33 అహీతోపెలు రాజు యొక్క సలహాదారుడు.  
అర్కీయుడైన హూషై రాజుకు సన్నిహితుడైన మిత్రుడు.   
 34 అహీతోపెలు తర్వాత బెనాయా కుమారుడైన యెహోయాదా, అబ్యాతారులు అతని స్థానంలో సలహాదారులయ్యారు.  
రాజ్య సైన్యానికి యోవాబు అధిపతి.