48
గోత్రాల ప్రకారం భూమి పంపకం 
  1 “పేర్ల ప్రకారం జాబితా తయారుచేయబడిన గోత్రాలు ఇవే:  
“ఉత్తర సరిహద్దులో దానుకు ఒక భాగం ఉంటుంది; అది హెత్లోను నుండి లెబో హమాతుకు వెళ్లే రహదారి వెంట ఉంటుంది; హజర్-ఎనాను హమాతుకు ప్రక్కన దమస్కు ఉత్తర సరిహద్దు తూర్పు వైపు నుండి పడమటి వైపు వరకు దాని సరిహద్దులో భాగంగా ఉంటుంది.   
 2 ఆషేరు వారికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమటి వరకు దానుకు సరిహద్దుగా ఉంటుంది.   
 3 నఫ్తాలికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఆషేరు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.   
 4 మనష్షేకు ఒక భాగం ఉంటుంది; అది తూర్పు నుండి పడమర వరకు నఫ్తాలి భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.   
 5 ఎఫ్రాయిముకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు మనష్షే భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.   
 6 రూబేనుకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఎఫ్రాయిముకు సరిహద్దుగా ఉంటుంది.   
 7 యూదాకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు రూబేను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.   
 8 “తూర్పు నుండి పడమర వరకు యూదా భూభాగానికి సరిహద్దుగా ఉండే భాగాన్ని మీరు ప్రత్యేక బహుమతిగా సమర్పించాలి. అది 25,000 మూరల*అంటే, సుమారు కి.మీ; 9, 10, 13, 15, 20, 21 వచనాల్లో కూడా వెడల్పు, దాని పొడవు తూర్పు నుండి పడమర వరకు ఉన్న గోత్రాల భాగాలలో ఒక దానితో సమానము.   
 9 “యెహోవాకు ప్రతిష్ఠించే ప్రత్యేక భాగం పొడవు 25,000 మూరలు. వెడల్పు 10,000 మూరలు†అంటే, సుమారు 5.3 కి.మీ; 10, 13, 18 వచనాల్లో కూడా ఉంటుంది.   10 ఇది యాజకులకు కేటాయించబడిన పవిత్రమైన భాగము. అది ఉత్తరం వైపు 25,000 మూరల పొడవు, పడమర వైపు 10,000 మూరల వెడల్పు, తూర్పు వైపున 10,000 మూరల వెడల్పు దక్షిణం వైపున 25,000 మూరల పొడవు ఉంటుంది. దాని మధ్యలో యెహోవా మందిరం ఉంటుంది.   11 ఇది ప్రతిష్ఠించబడిన యాజకులైన సాదోకు సంతతివారి కోసము. ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టినప్పుడు లేవీయుల్లా తప్పుదారి పట్టకుండా, వారు నాకు సేవచేయడంలో నమ్మకంగా ఉన్నారు.   12 పవిత్రమైన భూమిలో లేవీయుల భూభాగానికి సరిహద్దుగా ఉన్న ఆ భాగం వారికి ప్రత్యేక బహుమతిగా ఉంటుంది, అది అతిపరిశుద్ధమైన భాగము.   
 13 “యాజకుల ప్రాంతంతో పాటు, లేవీయులకు 25,000 మూరల పొడవు 10,000 మూరల వెడల్పు ఉంటుంది. దాని మొత్తం పొడవు 25,000 మూరలు వెడల్పు 10,000 మూరలు.   14 వారు దేనినీ అమ్మకూడదు లేదా మార్చుకోకూడదు. ఇది భూమిలో శ్రేష్ఠమైనది ఇతర చేతుల్లోకి వెళ్లకూడదు, ఎందుకంటే ఇది యెహోవాకు పవిత్రమైనది.   
 15 “మిగిలిన స్థలం, 5,000 మూరల‡అంటే, సుమారు 2.7 కి.మీ వెడల్పు 25,000 మూరల పొడవున మిగిలిన భూమిని ఉమ్మడి ప్రాంతంగా భావించి పట్టణంలోని ఇళ్ళ కోసం పచ్చిక బయళ్ల కోసం ఉపయోగించాలి. పట్టణం దాని మధ్యలో ఉంటుంది.   16 పట్టణానికి ఈ కొలతలు ఉంటాయి: ఉత్తరం వైపు 4,500 మూరలు,§అంటే, సుమారు 2.4 కి.మీ; ఇది 30, 32, 33, 34 వచనాల్లో కూడా దక్షిణం వైపు 4,500 మూరలు, తూర్పు వైపు 4,500 మూరలు పడమర వైపు 4,500 మూరలు.   17 పట్టణం కోసం పచ్చిక బయలు ఉత్తరాన 250 మూరలు,*అంటే, సుమారు 135 మీటర్లు దక్షిణాన 250 మూరలు, తూర్పున 250 మూరలు పశ్చిమాన 250 మూరలు ఉండాలి.   18 కేటాయించబడిన పవిత్ర స్థలంతో పాటు మిగిలిన భూమి పొడవు తూర్పు వైపున 10,000 మూరలు పడమర వైపు 10,000 మూరలు ఉంటుంది. ఇది పట్టణంలో పనిచేసి బ్రతికేవారికి ఆహారాన్ని అందించే ఆధారంగా ఉంటుంది.   19 ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల నుండి పట్టణంలో కష్టపడి పని చేసేవారు దానిని సాగు చేస్తారు.   20 భాగమంతా చతురస్రాకారంలో ఉంటుంది, ప్రతి వైపు 25,000 మూరలు ఉండాలి. ప్రత్యేక బహుమతిగా మీరు పట్టణం యొక్క ఆస్తితో పాటు పవిత్ర భాగాన్ని ప్రక్కన పెడతారు.   
 21 “పవిత్ర కేటాయింపు, పట్టణం యొక్క ఆస్తికి రెండు వైపులా మిగిలి ఉన్నవి యువరాజుకు చెందుతాయి. ఇది పవిత్ర భాగపు 25,000 మూరల నుండి తూర్పు సరిహద్దు వరకు పశ్చిమాన 25,000 మూరల నుండి పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంటుంది. గిరిజన ప్రాంతాల పొడవునా ఈ రెండు ప్రాంతాలు యువరాజుకు చెందుతాయి ఆలయ పరిశుద్ధ స్థలంతో కూడిన పవిత్ర భాగం వాటి మధ్యలో ఉంటుంది.   22 కాబట్టి లేవీయుల స్వాస్థ్యం, పట్టణం యొక్క స్వాస్థ్యం యువరాజుకు చెందిన ప్రాంతం మధ్యలో ఉంటుంది. యువరాజుకు చెందిన ప్రాంతం యూదా సరిహద్దుకు బెన్యామీను సరిహద్దుకు మధ్య ఉంటుంది.   
 23 “తక్కిన గోత్రాల వివరాలు:  
“బెన్యామీను వారికి ఒక భాగము. అది తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.   
 24 షిమ్యోను వారికి ఒక భాగము. తూర్పు నుండి పడమటి వరకు అది బెన్యామీను వారి భూమిని ఆనుకుని ఉంటుంది.   
 25 ఇశ్శాఖారు వారికి ఒక వాటా! అది తూర్పు నుండి పడమర వరకు షిమ్యోను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.   
 26 జెబూలూను తూర్పు నుండి పడమర వరకు ఇశ్శాఖారు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.   
 27 గాదు వారికి ఒక వాటా. అది తూర్పు నుండి పడమర వరకు జెబూలూను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.   
 28 గాదు దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు నీళ్ల వరకు, తర్వాత ఈజిప్టు వాగు వెంట మధ్యధరా సముద్రం వరకు వెళ్తుంది.   
 29 “ఇశ్రాయేలు గోత్రాలకు వారసత్వంగా కేటాయించవలసిన దేశం ఇదే, ఇవి వారి భాగాలు” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.   
క్రొత్త పట్టణం యొక్క ద్వారాలు 
  30 “పట్టణం నుండి బయటకు వెళ్లే గుమ్మాల వివరాలు:  
“ఉత్తర దిక్కున 4,500 మూరల పొడవుగా ద్వారాలు మూడు ఉంటాయి,   31 పట్టణ ద్వారాలకు ఇశ్రాయేలు గోత్రాల పేర్లు పెట్టాలి. ఉత్తర దిక్కున రూబేను ద్వారం, యూదా ద్వారం, లేవీ ద్వారం ఉండాలి.   
 32 తూర్పు దిక్కున 4,500 మూరల పొడవుతో మూడు ద్వారాలు: యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం, దాను ద్వారము.   
 33 దక్షిణ దిక్కున 4,500 మూరల కొలతలతో మూడు ద్వారాలు: షిమ్యోను ద్వారం, ఇశ్శాఖారు ద్వారం, జెబూలూను ద్వారం ఉండాలి.   
 34 పశ్చిమదిక్కున 4,500 మూరల కొలతలతో మూడు ద్వారాలు: గాదు ద్వారం, ఆషేరు ద్వారం, నఫ్తాలి ద్వారం ఉండాలి.   
 35 “దాని చుట్టూ విస్తీర్ణం 18,000 మూరలు.†అంటే, సుమారు 9.5 కి.మీ.  
“అప్పటినుండి ఆ పట్టణానికి, ‘యెహోవా షమ్మా‡అంటే యెహోవా ఉన్నాడు అని పేరు.’ ”  
*48:8 అంటే, సుమారు కి.మీ; 9, 10, 13, 15, 20, 21 వచనాల్లో కూడా
†48:9 అంటే, సుమారు 5.3 కి.మీ; 10, 13, 18 వచనాల్లో కూడా
‡48:15 అంటే, సుమారు 2.7 కి.మీ
§48:16 అంటే, సుమారు 2.4 కి.మీ; ఇది 30, 32, 33, 34 వచనాల్లో కూడా
*48:17 అంటే, సుమారు 135 మీటర్లు
†48:35 అంటే, సుమారు 9.5 కి.మీ.
‡48:35 అంటే యెహోవా ఉన్నాడు