6
పశ్చాత్తాపపడని ఇశ్రాయేలు
“రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.
ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు
కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు;
ఆయన మనల్ని గాయపరచారు
కాని ఆయన మన గాయాలను కడతారు.
రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు,
ఆయన సన్నిధిలో మనం బ్రతికేటట్టు,
మూడవ రోజున ఆయన మనల్ని పునరుద్ధరిస్తారు.
మనం యెహోవా గురించి తెలుసుకుందాం;
ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.
సూర్యోదయం ఎంత నిశ్చయమో,
ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం;
ఆయన శీతాకాలం వర్షాల్లా,
భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.”
 
“ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి?
యూదా, నిన్ను నేనేం చేయాలి?
మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా,
ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.
కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను,
నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను,
అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి.
ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు,
దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము.
ఆదాములా*లేదా మానవుల్లా వారు నా నిబంధనను మీరారు;
వారు నాకు నమ్మకద్రోహం చేశారు.
గిలాదు దుర్మార్గుల పట్టణం,
దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి.
బందిపోటు దొంగల్లా మాటున పొంచి ఉన్నట్లు,
యాజకుల గుంపు పొంచి ఉంది;
షెకెము మార్గంలో వారు హత్య చేస్తారు,
దుర్మార్గపు కుట్రలు చేస్తూ ఉంటారు.
10 నేను ఇశ్రాయేలులో ఘోరమైన విషయాన్ని చూశాను:
అక్కడ ఎఫ్రాయిం వ్యభిచారానికి అప్పగించుకుంది,
ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.
 
11 “నేను నా ప్రజలను
మునుపటి స్థితికి తీసుకువచ్చినప్పుడు,
 
“యూదా వారలారా, మీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది.

*6:7 లేదా మానవుల్లా