21
సిద్కియా మనవిని దేవుడు తిరస్కరించుట 
  1 సిద్కియా రాజు మల్కీయా కుమారుడైన పషూరు, మయశేయా కుమారుడు యాజకుడైన జెఫన్యా అనే ఇద్దరిని అతని దగ్గరకు పంపినప్పుడు, యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది. వారు వచ్చి, యిర్మీయాతో:   2 “బబులోను రాజైన నెబుకద్నెజరు*హెబ్రీలో నెబుకద్రెజరు నెబుకద్నెజరు యొక్క మరో రూపం; ఇక్కడ, అలాగే తరచుగా యిర్మీయా, యెహెజ్కేలు గ్రంథాల్లో కూడా మనమీద దాడి చేస్తున్నాడు. అయితే అతడు మనల్ని విడిచివెళ్లేలా, యెహోవా గతంలో చేసినట్లుగా ఇప్పుడు కూడా ఏమైన అద్భుతాలు చేస్తారేమో, యెహోవా దగ్గర విచారణ చేయి” అని అడిగారు.   
 3 అయితే యిర్మీయా వారితో, “సిద్కియాతో ఇలా చెప్పండి,   4 ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు అని చెప్పండి: బబులోను రాజుతో ప్రాకారం బయట ఉన్న బబులోను†లేదా కల్దీయ 9 వచనంలో కూడా ఉంది వారితో పోరాడేందుకు మీరు ఉపయోగించే యుద్ధ ఆయుధాలను నేను మీ మీదికే త్రిప్పబోతున్నాను. నేను వాటిని ఈ పట్టణం లోపల పోగుచేయిస్తాను.   5 స్వయంగా నేనే భయంకరమైన కోపంతో, మహా ఉగ్రతతో, నా చాపబడిన చేతితో, బలమైన బాహువుతో నీకు వ్యతిరేకంగా పోరాడతాను.   6 ఈ పట్టణంలో నివసించే మనుష్యులను, మృగాలను నేను చంపుతాను. భయంకరమైన తెగులుతో వారు చస్తారు.   7 ఆ తర్వాత, ఈ పట్టణంలో తెగులు, ఖడ్గం కరువు నుండి బయటపడిన యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను, ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతులకు, వారిని చంపాలనుకునే శత్రువుల చేతులకు అప్పగిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. ఆ రాజు వారి మీద దయ, జాలి, కనికరం చూపించకుండ వారిని ఖడ్గంతో చంపుతాడు.’   
 8 “ఇంకా, ప్రజలతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: చూడండి, నేను మీ ముందు జీవమార్గాన్ని, మరణమార్గాన్ని పెడుతున్నాను.   9 ఈ పట్టణంలో ఉండబోయే వారు ఖడ్గం వల్ల గాని కరువు వల్ల గాని తెగులు వల్ల గాని చస్తారు. అయితే ఎవరైనా పట్టణం బయటకు వెళ్లి మీమీద దాడి చేస్తున్న బబులోనీయులకు లొంగిపోతే, వారు బ్రతుకుతారు; వారు తమ ప్రాణాలతో తప్పించుకుంటారు.   10 నేను ఈ పట్టణానికి మేలు కాదు హాని చేయాలని నిశ్చయించుకున్నాను, కాని మేలు చేయాలని కాదు. ఈ పట్టణం బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది, అతడు దానిని అగ్నితో నాశనం చేస్తాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 11 “అంతేకాక, యూదా రాజకుటుంబంతో ఇలా చెప్పు, ‘యెహోవా మాట వినండి.   12 దావీదు ఇంటివారలారా, యెహోవా మీతో ఇలా చెప్తున్నారు:  
“ ‘ప్రతి ఉదయం న్యాయం చేయండి;  
అణచివేసే వారి చేతి నుండి  
దోచుకోబడిన వానిని విడిపించండి,  
లేకపోతే మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి  
నా ఉగ్రత అగ్నిలా మండుతూ  
ఎవరూ ఆర్పలేనంతగా మిమ్మల్ని కాల్చివేస్తుంది.   
 13 యెరూషలేమా, లోయకు ఎగువన  
రాతి పీఠభూమి మీద నివసించేదానా,  
“మా మీదికి ఎవరు రాగలరు?  
మా నివాసంలోకి ఎవరు ప్రవేశించగలరు?”  
అని నీవు అనుకుంటున్నావు,  
అని యెహోవా అంటున్నారు.   
 14 నీ క్రియలకు తగినట్లు నేను నిన్ను శిక్షిస్తాను,  
నీ అడవుల్లో అగ్ని రాజబెడతాను  
అది నీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని కాల్చివేస్తుంది,  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”