25
బిల్దదు
1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు:
2 “అధికారం భీకరత్వం దేవునివే;
ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు.
3 ఆయన సైన్యాలు లెక్కించబడగలవా?
ఎవరి మీద ఆయన వెలుగు ఉదయించదు?
4 అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు?
అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు?
5 ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు;
నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు.
6 పురుగువంటి మనుష్యుడు
క్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!”