10
 1 ముద్ర వేసినవారు వీరే:  
అధిపతి:  
హకల్యా కుమారుడైన నెహెమ్యా.  
సిద్కియా,   2 శెరాయా, అజర్యా, యిర్మీయా,   
 3 పషూరు, అమర్యా, మల్కీయా,   
 4 హట్టూషు, షెబన్యా, మల్లూకు,   
 5 హారీము, మెరేమోతు, ఓబద్యా,   
 6 దానియేలు, గిన్నెతోను, బారూకు,   
 7 మెషుల్లాము, అబీయా, మీయామిను,   
 8 మయజ్యా, బిల్గయి, షెమయా.  
వీరంతా యాజకులు.   
 9 లేవీయులు:  
అజన్యా కుమారుడైన యెషూవ, హేనాదాదు కుమారులు బిన్నూయి, కద్మీయేలు,   
 10 వారి బంధువులు షెబన్యా,  
హోదీయా, కెలిథా, పెలాయా, హానాను,   
 11 మీకా, రెహోబు, హషబ్యా,   
 12 జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,   
 13 హోదీయా, బానీ, బెనీను.   
 14 ప్రజల నాయకుల నుండి:  
పరోషు, పహత్-మోయాబు, ఏలాము, జత్తూ, బానీ,   
 15 బున్నీ, అజ్గాదు, బేబై,   
 16 అదోనియా, బిగ్వయి, ఆదీను,   
 17 అటేరు, హిజ్కియా, అజ్జూరు,   
 18 హోదీయా, హాషుము, బేజయి,   
 19 హారీపు, అనాతోతు, నేబై,   
 20 మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు,   
 21 మెషేజబేలు, సాదోకు, యద్దూవ,   
 22 పెలట్యా, హానాను, అనాయా,   
 23 హోషేయ, హనన్యా, హష్షూబు,   
 24 హల్లోహేషు, పిల్హా, షోబేకు,   
 25 రెహూము, హషబ్నా, మయశేయా,   
 26 అహీయా, హానాను, ఆనాను,   
 27 మల్లూకు, హారీము, బయనా.   
 28 మిగిలిన ప్రజలు అనగా, యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు దేవుని ధర్మశాస్త్రం బట్టి తమను ఆ దేశ ప్రజల నుండి వేరు చేసుకున్న వారందరు గ్రహించగలిగిన తమ భార్యలు కుమారులు కుమార్తెలతో పాటు,   29 తమ బంధువులైన అధిపతులతో కలిసివచ్చి దేవుని సేవకుడైన మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని, మా ప్రభువైన యెహోవా ఆజ్ఞలకు నిబంధనలకు శాసనాలకు లోబడతామని శపథం చేసి ప్రమాణం చేశారు.   
 30 “పొరుగు దేశ ప్రజలతో మా కుమార్తెలకు పెళ్ళి చేయము, వారి కుమార్తెలతో మా కుమారులకు పెళ్ళి చేయము.   
 31 “పొరుగు దేశ ప్రజలు విశ్రాంతి దినాన వారి వస్తువులు గాని ధాన్యం గాని అమ్మడానికి తెస్తే విశ్రాంతి దినాన కాని పరిశుద్ధ దినాన గాని మేము వాటిని కొనము. ప్రతి ఏడవ సంవత్సరం భూమిని దున్నకుండా వదిలివేస్తాము, అన్ని అప్పులు రద్దు చేస్తాము.   
 32 “మన దేవుని ఆలయ సేవ కోసం ప్రతి సంవత్సరం ఒక షెకెలు*అంటే, సుమారు 4 గ్రాములు వెండిలో మూడవ వంతు ఇస్తామని నిబంధన చేసుకున్నాము.   33 ఈ డబ్బును బల్ల మీద పెట్టే రొట్టెలకు; నిత్యం అర్పించే ధాన్యార్పణలకు దహనబలులకు; విశ్రాంతి దినాల్లో, అమావాస్య పండుగ నియమించబడిన పండుగల్లో అర్పణలకు; పరిశుద్ధ అర్పణలకు; ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహార బలులకు;†లేదా శుద్ధీకరణ అర్పణ మన దేవుని ఆలయ పనులకు ఖర్చు చేస్తాము.   
 34 “మా కుటుంబాలలో వంతు ప్రకారం ప్రతి సంవత్సరం నిర్ణయించబడిన సమయంలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మన దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహించడానికి కావలసిన కట్టెలు ఎవరెవరు తీసుకురావాలో నిర్ణయించడానికి మేము అనగా యాజకులు లేవీయులు ప్రజలు చీట్లు వేసుకున్నాము.   
 35 “ప్రతి సంవత్సరం పంటలో ప్రథమ ఫలాన్ని అన్ని పండ్లచెట్ల ప్రథమ ఫలాలను యెహోవా ఆలయానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాము.   
 36 “అలాగే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మా కుమారులలో మొదట పుట్టినవాన్ని, మా పశువుల్లో, మందలలో గొర్రెలలో మొదట పుట్టిన వాటిని యెహోవా ఆలయానికి అక్కడ పరిచర్య చేస్తున్న యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము.   
 37 “అంతే కాకుండా, మా పిండిలో, భోజన అర్పణలలో, అన్ని రకాల మా పండ్లచెట్ల ఫలాల్లో, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో అన్నిటిలో ప్రథమ ఫలాన్ని మన దేవుని మందిరపు గిడ్డంగులకు యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. పదవ భాగాన్ని లేవీయుల దగ్గరకి తీసుకురావాలని, మేము పని చేసే అన్ని పట్టణాల్లో పదవ భాగాన్ని సేకరించి లేవీయులకు ఇవ్వాలని నిర్ణయించాము.   38 లేవీయులు పదవ భాగాన్ని తీసుకునేటప్పుడు వారితో పాటు అహరోను వారసుడైన ఒక యాజకుడు ఉండాలని, లేవీయులు ఆ పదవ భాగాలన్నిటిలో పదవ భాగాన్ని మన దేవుని ఆలయ గిడ్డంగులకు ఖజానాకు తీసుకురావాలి.   39 ఇశ్రాయేలీయులు, లేవీయులతో సహా ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షరసాన్ని, నూనెను విరాళంగా తీసుకువచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వారపాలకులు సంగీతకారులు వాటిని తీసుకుని పరిశుద్ధాలయపు ఉపకరణాలు ఉండే గిడ్డంగులలో ఉంచాలి.  
“మేము మా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాము.”