12
యాజకులు లేవీయులు
1 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో యెషూవతో పాటు వచ్చిన యాజకులు లేవీయులు వీరే:
శెరాయా, యిర్మీయా, ఎజ్రా,
2 అమర్యా, మల్లూకు, హట్టూషు,
3 షెకన్యా, రెహూము, మెరేమోతు,
4 ఇద్దో, గిన్నెతోయి,*చాలా హెబ్రీ ప్రతులలో గిన్నెతోను అబీయా,
5 మీయామిను,†మిన్యామీను మీయామిను యొక్క మరో రూపం మయద్యా, బిల్గా,
6 షెమయా, యోయారీబు, యెదాయా,
7 సల్లు ఆమోకు హిల్కీయా యెదాయా.
వీరందరు యెషూవ సమయంలో యాజకులకు వారి బంధువులకు సహాయకులు.
8 లేవీయులలో యెషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా కృతజ్ఞత పాటలకు నాయకత్వం వహించే మత్తన్యా అతని సహాయకులు. 9 పరిచర్యలలో బక్బుక్యా, ఉన్నీ, వారి సహాయకులు వారికి ఎదురు వరుసలో నిలబడేవారు.
10 యోయాకీము తండ్రి యెషూవ,
ఎల్యాషీబు తండ్రి యోయాకీము,
యోయాదాను తండ్రి ఎల్యాషీబు,
11 యోనాతాను తండ్రి యోయాదా,
యద్దూవ తండ్రి యోనాతాను.
12 యోయాకీము సమయంలో యాజకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నవారు:
శెరాయా కుటుంబానికి మెరాయా;
యిర్మీయా కుటుంబానికి హనన్యా;
13 ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము;
అమర్యా కుటుంబానికి యెహోహనాను;
14 మెలీకూ కుటుంబానికి యోనాతాను,
షెకన్యా‡హెబ్రీ ప్రతులలో షెబన్యా కుటుంబానికి యోసేపు;
15 హారీము కుటుంబానికి అద్నా;
మెరాయోతు కుటుంబానికి హెల్కయి;
16 ఇద్దో కుటుంబానికి జెకర్యా;
గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము;
17 అబీయా కుటుంబానికి జిఖ్రీ;
మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి;
18 బిల్గా కుటుంబానికి షమ్మూయ;
షెమయా కుటుంబానికి యెహోనాతాను;
19 యోయారీబు కుటుంబానికి మత్తెనై;
యెదాయా కుటుంబానికి ఉజ్జీ;
20 సల్లు కుటుంబానికి కల్లయి;
ఆమోకు కుటుంబానికి ఏబెరు;
21 హిల్కీయా కుటుంబానికి హషబ్యా;
యెదాయా కుటుంబానికి నెతనేలు.
22 ఎల్యాషీబు సమయంలో లేవీయులలో కుటుంబ పెద్దలుగా ఉన్నవారు యోయాదా, యోహానాను, యద్దూవ. పర్షియా రాజైన దర్యావేషు పాలనలో వీరే యాజక కుటుంబాలలో పెద్దలుగా నమోదయ్యారు. 23 ఎల్యాషీబు కుమారుడైన యోహానాను సమయం వరకు కుటుంబ పెద్దలుగా లేవీ వారసుల పేర్లు దినచర్య గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. 24 లేవీయుల నాయకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కుమారుడైన యెషూవ, వారి బంధువులు దైవజనుడైన దావీదు నిర్దేశించిన ప్రకారం వంతులవారీగా ఎదురెదురుగా నిలబడి కృతజ్ఞతా స్తుతి గీతాలు పాడడానికి నియమించబడ్డారు.
25 మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనేవారు గుమ్మాల దగ్గర ఉన్న గిడ్డంగులను కాపలా కాసే ద్వారపాలకులు. 26 వీరంతా యోజాదాకు పుట్టిన యెషూవ కుమారుడైన యోయాకీము సమయంలో, అధిపతియైన నెహెమ్యా సమయంలో, ధర్మశాస్త్ర బోధకుడు యాజకుడైన ఎజ్రా సమయంలో సేవ చేశారు.
యెరూషలేము గోడ ప్రతిష్ఠించబడుట
27 యెరూషలేము గోడ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు కృతజ్ఞతా స్తుతి గీతాలతో తాళాలు, వీణలు సితారలు వాయిస్తూ సంతోషంగా చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి లేవీయులను యెరూషలేముకు తీసుకువచ్చే పని మొదలుపెట్టారు. 28 సంగీతకారులను యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల నుండి తీసుకువచ్చారు. 29 యెరూషలేము చుట్టూ సంగీతకారులు తమ కోసం గ్రామాలు నిర్మించుకున్నారు కాబట్టి బేత్-గిల్గాలు నుండి, గెబా అజ్మావెతు ప్రాంతాల నుండి వచ్చారు. 30 యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపరచుకున్న తర్వాత ప్రజలను, గుమ్మాలను, గోడను పవిత్రపరిచారు.
31 నేను యూదా నాయకులను గోడ మీదికి తీసుకువచ్చాను. కృతజ్ఞతలు చెల్లించడానికి రెండు పెద్ద గాయక బృందాలను నియమించాను. వాటిలో ఒక బృందం గోడ మీద కుడి వైపుగా పెంట ద్వారం వైపు నడిచారు. 32 హోషయా, యూదా నాయకుల్లో సగం మంది వారితో పాటు వెళ్లారు. 33 వారితో అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, 34 యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనేవారు వెళ్లారు. 35 అలాగే బూరలు ఊదుతూ కొంతమంది యాజకులు వెళ్లారు. ఆసాపు కుమారుడైన జక్కూరుకు పుట్టిన మీకాయా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జెకర్యా, 36 అతని సహాయకులైన షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవారు దేవుని సేవకుడైన దావీదు నిర్దేశించిన సంగీత వాయిద్యాలు వాయిస్తూ వెళ్లారు. ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా వారిని నడిపించాడు. 37 ఊట గుమ్మం దగ్గర వారు నేరుగా దావీదు పట్టణం గోడ మెట్ల మీదుగా దావీదు ఇంటిని దాటి తూర్పున ఉన్న నీటిగుమ్మం దగ్గరకు వెళ్లారు.
38 కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండవ బృందం వారికి ఎదురుగా వెళ్లారు. మిగిలిన సగం మంది ప్రజలతో పాటు కలిసి నేను అగ్ని గుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ వరకు వెళ్లాము. 39 వారు ఎఫ్రాయిం ద్వారం మీదగా వెళ్లి, యెషానా§లేదా పాతది గుమ్మాన్ని, చేప గుమ్మాన్ని, హనానేలు గోపురాన్ని, వందవ గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మం వరకు వెళ్లి కాపలా గుమ్మం దగ్గర ఆగారు.
40 అప్పుడు కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండు బృందాలు, నేను, నాతో పాటు ఉన్న అధికారులలో సగం మంది దేవుని మందిరంలో నిలబడ్డాము. 41 అలాగే యాజకులైన ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యాలు తమ బూరలు పట్టుకుని ఉన్నారు. 42 మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహనాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు అక్కడే ఉన్నారు. ఇజ్రహయా సారథ్యంలో గాయకులు గట్టిగా పాటలు పాడారు. 43 ఆ రోజు దేవుడు తమకు గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు వారు గొప్ప బలులు అర్పించి సంతోషించారు. స్త్రీలు పిల్లలు కూడా సంతోషించారు. యెరూషలేములోని ఈ సంతోష ధ్వనులు చాలా దూరం వరకు వినిపించాయి.
44 ఆ సమయంలో ప్రజలిచ్చే ప్రథమ ఫలాలు, పదవ భాగాలు కానుకలకు సంబంధించిన గిడ్డంగులకు అధికారులుగా కొంతమంది నియమించబడ్డారు. పరిచర్య చేస్తున్న యాజకులు లేవీయులను బట్టి యూదా ప్రజలు సంతోషించారు కాబట్టి యాజకులు లేవీయుల కోసం ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన వంతులను పట్టణాల చుట్టూ ఉన్న పొలాల నుండి గిడ్డంగులకు చేరవేయడానికి వారు నియమించబడ్డారు. 45 దావీదు అతని కుమారుడైన సొలొమోను ఆజ్ఞల ప్రకారం వారంతా సంగీతకారులు ద్వారపాలకులతో కలిసి తమ దేవుని సేవ, శుద్ధీకరణ సేవ చేశారు. 46 చాలా కాలం క్రితం దావీదు, ఆసాపు కాలంలో సంగీతకారులను దేవునికి కృతజ్ఞతా స్తుతి గీతాలను నడిపించేవారు ఉండేవారు. 47 అయితే జెరుబ్బాబెలు, నెహెమ్యా సమయంలో ఇశ్రాయేలీయులందరు సంగీతకారులకు, ద్వారపాలకులకు ప్రతిరోజు ఆహారం ఇచ్చేవారు. అలాగే ఇతర లేవీయులకు కూడా ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు. లేవీయులు అహరోను వారసులకు ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు.