24
సూక్తి 20
చెడ్డవారిని చూసి అసూయపడవద్దు,
వారి సహవాసం కోరుకోవద్దు;
వారి హృదయాలు హింసను చేయాలని యోచిస్తాయి,
వారి పెదవులు ఇబ్బంది పెట్టడం గురించి మాట్లాడతాయి.
సూక్తి 21
జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది,
గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది.
తెలివిచేత దాని గదులు
అరుదైన అందమైన నిధులతో నింపబడతాయి.
సూక్తి 22
జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు,
తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు.
ఖచ్చితంగా యుద్ధం చేయడానికి మీకు నడిపించేవారు అవసరం
అనేకమంది సలహాదారుల ద్వారా విజయం సాధ్యమవుతుంది.
సూక్తి 23
మూర్ఖులకు జ్ఞానం ఎంతో ఎత్తులో ఉంటుంది;
సమాజ గవిని దగ్గర వారు మాట్లాడడానికి ఏమి లేదు.
సూక్తి 24
కీడు చేయాలని చూసే వ్యక్తి
కుట్రలు చేసే వ్యక్తి అని పిలువబడతాడు.
మూర్ఖుల పథకాలు పాపం,
ఎగతాళి చేసేవారిని నరులు అసహ్యించుకుంటారు.
సూక్తి 25
10 ఒకవేళ మీరు ఇబ్బందుల సమయంలో తడబడితే,
మీ బలం ఎంత సూక్ష్మమైనది!
11 చావుకు కొనిపోబడుతున్న వారిని రక్షించు;
మరణం వైపు తూగుతున్న వారిని వెనుకకు లాగు.
12 “కాని దీని గురించి మాకు ఏమి తెలియదు” అని నీవంటే,
హృదయాలను తూకం వేసేవాడు నీ మాటను గ్రహించడా?
నీ ప్రాణాన్ని కాచేవానికి తెలియదా?
ప్రతి వ్యక్తికి తన క్రియలకు తగినట్టుగా తిరిగి చెల్లించడా?
సూక్తి 26
13 నా కుమారుడా, తేనె తిను, అది మంచిది;
తేనెపట్టు నుండి తేనె తిను అది రుచికి తీపిగా ఉంటుంది.
14 జ్ఞానం నీకు తేనెలాంటిది అని తెలుసుకో:
అది నీకు దొరికితే, నీ భవిష్యత్తుకు నిరీక్షణ ఉంటుంది,
నీ నిరీక్షణ తొలిగిపోదు.
సూక్తి 27
15 నీతిమంతుల నివాసం దగ్గర దొంగలా పొంచి ఉండవద్దు,
వారి నివాస స్థలాన్ని దోచుకోవద్దు;
16 ఎందుకంటే నీతిమంతులు ఏడుమారులు పడినను తిరిగి లేస్తారు,
కాని విపత్తు సంభవించినప్పుడు దుష్టులు తడబడతారు.
సూక్తి 28
17 నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు;
వాడు తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషించనీయకు,
18 లేదా యెహోవా అది చూసి అయిష్టత కలిగి
వారి మీద నుండి తన కోపం చాలించుకుంటారేమో.
సూక్తి 29
19 కీడు చేసేవారిని చూసి నీవు చిరాకుపడకు
దుష్టుల ఎడల అసూయ పడకు.
20 ఎందుకంటే కీడు చేసేవారికి భవిష్యత్ నిరీక్షణ లేదు,
దుష్టుల దీపము ఆరిపోతుంది.
సూక్తి 30
21 నా కుమారుడా, యెహోవాకు రాజుకు భయపడు,
తిరుగుబాటు చేసే అధికారులతో జతకలవకు.
22 ఎందుకంటే అవి రెండు వారి మీదికి హఠాత్ నాశనాన్ని పంపుతాయి,
అవి ఎలాంటి ఆపదలు తెస్తాయో ఎవరికి తెలుసు?
జ్ఞానులు చెప్పిన మరిన్ని సూక్తులు
23 ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే:
న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు
24 “నీవు అమాయకుడవు” అని దోషులతో చెప్పేవారిని,
ప్రజలు శపిస్తారు దేశాలు అసహ్యించుకుంటారు.
25 న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును
అధికమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.
 
26 నిజాయితీగల జవాబు
పెదవులపై పెట్టే ముద్దు లాంటిది.
 
27 ముందుగా నీ బయటి పని చక్క పెట్టుకో
నీ పొలాలను సిద్ధపరచుకో;
దాని తర్వాత, నీ ఇల్లు కట్టుకో.
 
28 కారణం లేకుండ నీ పొరుగువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దు;
నీ పెదవులతో తప్పుత్రోవ పట్టిస్తావా?
29 “వారు నాకు చేసినట్లు నేను వారికి చేస్తాను;
వారు చేసిన దానికి వారికి తిరిగి చెల్లిస్తాను” అని అనుకోవద్దు.
 
30 నేను ఒక సోమరివాని చేను దాటి వెళ్లాను,
నేను బుద్ధిలేని ఒక వ్యక్తి ద్రాక్షతోటను దాటి వెళ్లాను;
31 అంతట ముళ్ళ కంపలు పెరిగాయి,
నేలంతా కలుపు మొక్కల చేత కప్పబడి ఉంది,
దాని రాతి గోడ శిథిలావస్థలో ఉంది.
32 నేను దాన్ని చూసి దాని గురించి యోచన చేసి
దాని నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను.
33 ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు,
ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను.
34 పేదరికం నీ మీదికి దొంగలా,
లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.