కీర్తన 15
దావీదు కీర్తన.
1 యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు?
మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?
2 నిందారహితంగా నడుచుకొనేవారు,
నీతిని జరిగించేవారు,
తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;
3 తమ నాలుకతో అపవాదులు వేయనివారు,
పొరుగువారికి కీడు చేయనివారు,
స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;
4 నీచులను అసహ్యించుకుని
యెహోవాకు భయపడేవారిని గౌరవించేవారు;
తమకు బాధ కలిగినా తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేవారు,
తమ మనస్సు మార్చుకొననివారు;
5 వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు;
నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు.
వీటిని చేసేవారు
ఎన్నటికి కదిలించబడరు.