కీర్తన 47
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన.
సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి;
దేవునికి ఆనందంతో కేకలు వేయండి.
 
మహోన్నతుడైన యెహోవా భయంకరుడు,
భూమి అంతటికి ఆయన గొప్ప రాజు.
ఆయన దేశాలను మన వశం చేశారు,
జనాలను మన పాదాల క్రింద ఉంచారు.
మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు.
అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము.
సెలా
 
దేవుడు జయధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు,
యెహోవా బూరధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు.
దేవునికి స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి;
మన రాజుకు స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి.
దేవుడు భూమి అంతటికి రాజు;
ఆయనకు స్తుతికీర్తన పాడండి.
 
దేవుడు దేశాలను పరిపాలిస్తున్నారు;
దేవుడు తన పవిత్ర సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు.
దేశాల అధిపతులు సమకూడతారు
అబ్రాహాము దేవుని ప్రజలుగా సమకూడతారు
భూమి మీద డాళ్లు*లేదా రాజులు దేవునికి చెందినవి;
ఆయన గొప్పగా హెచ్చింపబడ్డారు.

*కీర్తన 47:9 లేదా రాజులు