కీర్తన 87
కోరహు కుమారుల కీర్తన. ఒక గీతము.
యెహోవా తన పట్టణాన్ని పరిశుద్ధ పర్వతంపై స్థాపించారు.
యాకోబు ఇతర నివాసాలన్నిటికంటె
యెహోవా సీయోను గుమ్మాలను ఎక్కువగా ప్రేమిస్తారు.
 
దేవుని పట్టణమా, నీ గురించి
గొప్ప విషయాలు చెప్పబడ్డాయి.
సెలా
“నేను రాహాబు*ఈజిప్టు యొక్క కావ్య నామము. పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక సముద్ర రాక్షసుడి పేరు. బబులోనును
నన్ను గుర్తించిన వారిగా లెక్కిస్తాను
అలాగే ఫిలిష్తియా, తూరు కూషుఅంటే, నైలు ఉపరితల ప్రాంతం కూడా,
‘ఇది సీయోనులో పుట్టింది’ ” అని వారంటారు.
నిజమే, సీయోను గురించి ఇలా అంటారు,
“ఇది అది కూడా ఆమెలోనే జన్మించాయి,
మహోన్నతుడు తానే సీయోనును స్థాపిస్తారు.”
యెహోవా పౌరుల పేర్లు నమోదు చేసేటప్పుడు
“ఇది సీయోనులో జన్మించింది” అని గుర్తిస్తారు.
సెలా
 
వారు వాయిద్యాలు వాయిస్తుండగా,
“నా ఊటలన్నీ మీలోనే ఉన్నాయి” అని వారు పాడతారు.

*కీర్తన 87:4 ఈజిప్టు యొక్క కావ్య నామము. పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక సముద్ర రాక్షసుడి పేరు.

కీర్తన 87:4 అంటే, నైలు ఉపరితల ప్రాంతం