కీర్తన 133
దావీదు యాత్రకీర్తన 
  1 సహోదరులు ఐక్యత కలిగి నివసించడం  
ఎంత మేలు! ఎంత మనోహరం!   
 2 అది అహరోను తలమీద పోయబడి  
అతని గడ్డం మీదుగా కారుతూ,  
వస్త్రపు అంచు వరకు కారిన  
ప్రశస్తమైన తైలం వంటిది.   
 3 అది సీయోను కొండలమీదికి దిగివచ్చే  
హెర్మోను మంచులా ఉంటుంది.  
యెహోవా తన ఆశీర్వాదాన్ని,  
జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.