*ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.
కీర్తన 145
దావీదు వ్రాసిన స్తుతికీర్తన.
నా దేవా, నా రాజా! మిమ్మల్ని ఘనపరుస్తాను.
మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.
ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తాను
మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.
 
యెహోవా గొప్పవారు ఆయన స్తుతికి ఎంతో అర్హుడు;
ఆయన గొప్పతనం ఎవరూ గ్రహించలేరు.
ఒక తరం వారు మరో తరానికి మీ క్రియలను కొనియాడుతూ చెపుతారు;
మీ బలమైన చర్యలను గురించి చెపుతారు.
వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు,
నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను.
వారు మీ అద్భుత కార్యాల శక్తి గురించి చెపుతారు,
నేను మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను.
వారు మీ సమృద్ధి మంచితనాన్ని స్తుతిస్తారు,
మీ నీతి గురించి సంతోషంగా పాడతారు.
 
యెహోవా కృప కలవారు, దయ గలవారు,
త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.
 
యెహోవా అందరికి మంచివారు;
ఆయన చేసిన సృష్టి అంతటి మీద దయ గలవాడు.
10 యెహోవా మీ సృష్టంతా మిమ్మల్ని స్తుతిస్తుంది;
నమ్మకమైన మీ ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.
11 మీ రాజ్య మహిమ గురించి వారు చెపుతారు
మీ బలము గురించి మాట్లాడతారు,
12 అప్పుడు మనుష్యులందరు మీ గొప్ప చర్యలను
మీ రాజ్యము యొక్క మహిమా వైభవాన్ని తెలుసుకుంటారు.
13 మీ రాజ్యం శాశ్వత రాజ్యం,
మీ ఆధిపత్యం తరతరాలకు నిలుస్తుంది.
 
యెహోవా చేసే వాగ్దానాలన్నిటిలో ఆయన నమ్మదగినవాడు
ఆయన చేసేవాటన్నిటిలో ఆయన నమ్మదగినవాడు.చాలా ప్రా.ప్ర. లలో చివరి రెండు వాక్యాలు లేవు
14 యెహోవా పడిపోతున్న వారికి సహాయం చేస్తారు,
అలిసిపోయిన వారిని లేవనెత్తుతారు.
15 అందరి కళ్లు మీ వైపు చూస్తాయి,
సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు.
16 మీరు మీ గుప్పిలి విప్పి
జీవులన్నిటి కోరికలు తీరుస్తారు.
 
17 యెహోవా తన మార్గాలన్నిటిలో నీతిమంతుడు.
ఆయన క్రియలన్నిటిలో నమ్మకమైనవాడు.
18 ఆయనకు మొరపెట్టు వారందరికి,
నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు.
19 ఆయనయందు భయము గలవారి కోరికలు తీరుస్తారు;
వారి మొర విని వారిని రక్షిస్తారు.
20 యెహోవా తనను ప్రేమించే వారందరిని కాపాడతారు,
కాని దుష్టులను ఆయన నాశనం చేస్తారు.
 
21 నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది.
శరీరులంతా ఆయన పవిత్ర నామాన్ని
శాశ్వతంగా కీర్తించాలి.

*^ ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.

కీర్తన 145:13 చాలా ప్రా.ప్ర. లలో చివరి రెండు వాక్యాలు లేవు