4
మాటిను కుండమా ఆత్నును దవ్లత్
1 ఇనటేకె ఆ సేవపొందనాబారెమా గోర్‍కర్యుహుయతె వాలహుయిన్ హిమ్మత్‍కొయినితిమ్ ఛియ్యె. 2 హుయ్తొ కుయుక్తితి*4:2 మూలభాషమా హాఃప్ కిమ్ బింగు ఠాంగు జాయ్తెయినితరా చాలకొయినితిమ్ దేవ్ను వాక్యంనా పాల్తుతీ నాబోధించీన్, హాఃచినా ప్రత్యక్చాహువనాటేకెనుబారెమా అద్మియేను మనస్సాక్చిన కామె హామరు హమేస్ దేవునా సముఖంకనా ఒప్పాతూహుయీన్, ఇజ్జత్‍హుయూతె కర్రాబ్‍కామ్‍నా బెందీన్ ఛియ్యే. 3 హమారు సువార్త మాలంకరాయోతొ తెదె నాష్‍హుంకరతె ఇవ్ను విషయంమాస్ మాలంహుంకరస్. 4 దేవ్ను హుఃద్‍రూప్‍హుయిన్ ఛాతె క్రీస్తు మహిమనా దెఖ్కాడతె సువార్త ఉజాలు ఇవ్నా నాదెఖ్కావహాఃర్కు ఆ ములక్‍ను సంబంధంహుయూతె దేవ్ని అవిష్వాస్‍షిహుయుతె ఇవ్ను మానోనేత్రంనా కాణు కరాకిదేస్. 5 ఇనటేకె హమె హమ్నలీన్ కోబొలెంకరేస్ని పన్కి క్రీస్తుయేసున లీన్ యో ప్రభూవు కరిబి హమ్నలీన్ యేసు నిమిత్తంతి హమె తుమారు పరిచారకుల్‍కరి ప్రకటించుకరియేస్. 6 అంధారు మతూ వుజాలు హువదాకరి బోల్యొహుయో దేవస్ ఇను మహిమాను గరించీన్ యేసుక్రీస్తునుజ్ఞానం వెళ్లడించనాటేకె దిల్‍మా వుజాలు ప్రకాషించుకరస్.
7 హుయితోబి యో తాఖత్ హమార మ్హడీహుయిన్ నాహుయిన్ దేవ్ మ్హడిహుయిన్ ర్హావనటేకె మాటిన కుండమా ఆ దవ్లత్ హమ్న మల్సే. 8 కిజ్గా గైయతోబీ మిన్హత్‍పడుకరుతోబి ఫాసిజావ్వాల కాహె, అపాయంమా ర్హయితోబి అపాయంకొయినితిమ్ కొయిని, 9 హమ్నా ఘను మిన్హత్ ఛా పన్కి హమ్న గాయపర్చకరస్ పన్కి మిత్రుల్ కొయినితిమ్ కోర్హాసుని. హక్లి దిదాతోబి దిక్కుకొయినితిమ్ కోఛియ్యెని, పడిగాతోబి నాషనంహువ్వాల కాహె. 10 యేసును జాన్ హమారు ఆంగ్తాన్‍ను దేఖ్కావనటేకె యేసును మరణ్‍ను హమారు షరీరంమా హమేసా ఢొహిలీన్ జింకరియేస్. 11 కిమ్కతో యేసును జాన్‍బి హమారు అద్మియోను ఆంగ్తాన్‍ను జీవ్తాహుయతె హమే హమేషా యేసునా నిమిత్తం మరణ్‍నా దెవ్వాడిరాక్యుస్. 12 ఇనటేకె హమారమా మరణ్‍నా తుమారమ జాన్‍నా కామ్ కర్తూ ర్హంకరస్.
13 కాగా “విష్వాస్‍సించుకరూస్ ఇనటేకె వాతెబోల్యొ” కరి లిఖ్కాయ్‍రూతె ప్రకారం యోజాత్ను విష్వాసంతీ మలీన్ ఆత్మవాలహుయిన్, 14 ప్రభూహుయోతె యేసునా ఉట్టాడవాలొహుయో యేసుతి హమ్నా ఉట్టాడీన్ తుమరేతి ఇనహాఃమె వుబారికాడ్సెకరి మాలంకరీన్, హమేబి విస్వాష్ కరూకరియేస్, ఇనటేకె వాతె బోలుకరేస్. 15 కృప జాహఃత్‍జణు వలా దేవును మహిమా నిమిత్తంతి కృతజ్ఞాతసుల్ ఫైలెయిజావహాఃరుకు సమస్తంను తుమారటేకెస్ ఛా.
విష్వాసంతి జీవనూ
16 ఇనహాఃజె హమే ఢర్సుకొయిని, హమారొ ఆంగ్తాన్ మరద్మామానొ కృషించీన్ జంవుకరాస్ ఆత్మ మరద్మానో ధన్‍పర్ ధన్ నవూ హుంకరాస్. 17 హమే దెఖ్కావతె ఇనటేకె కాహెతిమ్ దెఖ్కావాకొయింతె ఇనటేకె వాత్ బోలుకరేస్. 18 ఇనటేకె క్చణమాత్రంరాస్ హామారు దరాసు మిన్హత్ హమారటేకె జాహఃత్ నిత్యమ్‍ను మహీమాను భారంనా కల్గాంకరస్, దెఖ్కాహాఃవతె హాఃచి కాహె; దెఖ్కావకొయినితె హాఃఛిస్.