పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక
పౌల్‍ ఫిలిప్పీనా లిఖ్యొతె పుస్తక్‍
అగ్లి వాతె
క్రీస్తు పేద్దాయేతే 61 వరహ్ఃనా బద్మా పౌల్ ఫిలిప్పీమా ఛాతే విష్యుసుల్నా లేఖ లీఖ్యో. యో ఠాణమా ర్హాయోతేదె 1:13 రోమమా ర్హాయోతేదె లీఖ్యో. ఫిలిప్పీ నంగర్మా ఛాతే చర్చినా లేఖ లిఖ్యా. అపొస్తలుల్ కార్యమ్ పుస్తక్ మాతు అప్నే ఫిలిప్పీ గురించి తోడు సీకిలేవ్వాజాయ్. ఫిలిప్పీ మాసిడోనియామా ప్రావిన్స్ను రాజధాని నంగర్మా. ఆ మాసిడోనియామా స్థాపించుతే పైలు చర్చిబి. పౌల్ అజు సిలాస్ మాలిన్ చర్చినా సురుకర్యా అజు ఇవ్నే ఎజ్గ ర్హాయతేదె ఏక్ రాత్ ఠాణమాబి ర్హాయతా. ఆ లేఖ లీఖ్మా పౌల్ కెత్రుకి ఉద్దేషమ్నా కలిగిన్ ర్హావజాయ్. యో ఠాణమా ఛాకరి హాఃజోతేదే చర్చి వాల మొక్లుతే బహుమతినా ధన్యవాదాల్ బోలమా యో ఆ సందర్భానా ఉపయోగించో 4:10-19. యో ఠాణమా ఛాతే ఇను పరిస్థితినాబి ఇవ్నా బోలిన్ అజు తిమోతి అజు ఎపఫ్రొడిటస్‌ల్నా చర్చినా గురించి సిఫార్త్ కర్యో 2:19-30 ఇనేతి ఇవ్నే ఇవ్నా బులయిన్ అజు ఇవ్ను నాయకత్వామ్నా గౌరవందిదా.
విషయ సూచిక
1. పౌల్ ఫిలిప్పీమా ఛాతే చర్చినా సుభాకాంక్చలు బోల్తో లేఖనా సురుకర్యో1:1-2.
2. బద్మా యో ఇను పరిస్థితిను గురించి తోడు హాఃబర్ బోల్తో అజు ఇనా ఛాతే తోడు గబ్రారాణి 1:3–2:30.
3. తేదె యో క్రైస్తవ జీవ్వును కెత్రుకి ఆచరణహుయుతే హాఃనదయే దిసే 3:1–4:9.
4. పౌల్ ఫిలిప్పిను చర్చి వాలన బహుమతనా హాఃలమ్ కర్తో అజు ఇనా సుభాకాంక్చలు బోలిమొక్లిన్ హాఃతమ్ కర్యో 4:10-23
1
ఫిలిప్పీమా ఛాతె క్రీస్తుయేసుమా హాఃరు పరిసుద్ధుల్‍నాబి అధ్యక్చుడ్‍నాబి పరిచారకుల్‍నాబి క్రీస్తుయేసును దాసుడ్‍హుయుతే పౌల్నాబి తిమోతిబి అఛ్చుకరి బోలిన్‍ లిఖ్కుకరూస్‍. అప్నా భా హుయుతె దేవ్‍కంతూ ప్రభుహుయోతే యేసుక్రీస్తు కంతుబి తుమ్నా కృపబి సమాధానమ్‍ హువదా.
హాఃలామ్‍ అజు ప్రార్థనా
మే తుమ్నా కేదెబి హాఃయల్‍ కర్లీదొతొ మారొ దేవ్నా హాఃలామ్‍ బోలుకురూస్‍. తుమారటేకె మే ప్రార్ధనా కర్యొతె హర్యేక్ ఛోట్‍ యో ఖుషితి ప్రార్థనాస్‍. సువార్త విషయంమా అగాఢిను ధన్తూ హాంకెతోడి తుమే హిమ్మత్‍నా హాఃలమ్‍. తుమారమా అష్యల్ కామ్‍ సురుకరీన్‍ యో యేసుక్రీస్తు ఫరీన్‍ ఆవ్సెతె ధన్‍తోడి యోకామ్‍ కర్తోరహిన్‍ ఖతం కర్సే ఆ మారు గట్ట్ నమ్మకమ్‍. మే ఖైధిహుయోతోబి, మే సువార్తనాబ్హనె వాత్‍బోలనుమాబి, ఇనా స్థిరపర్చావనాటేకెబి, తుమెహాఃర ఆ కృపమా మారకేడె పాలివాలహుయున్‍ ఛా అనహాఃజె మే తుమ్నా మారుదిల్‍మా రాఖిలీన్‍ ఛౌవ్‍. ఇనటేకె తుమ్నాహాఃరనా బారెమా అమ్నితరా సోచన మన ధర్మమాస్‍. క్రీస్తుయేసును దయారసమ్‍నా హాఃజె, తుమ్న హాఃరఫర్‍ మే అత్రె ఆహ్‍ఃతి ఛౌవ్‍కి దేవాస్‍ మన సాక్చి.
తుమారు ఫ్యార్‍, సంపూర్ణ వివేచనతి ర్హవోకరి మే ప్రార్థనాకరుకరూస్‍. 10 తుమె కెహూ అష్యల్‍కి ఎంచిలెవ్వాను వహఃత్‍ క్రీస్తును ధన్మా తుమెహాఃరు విధంతి కెహూ పాప్‍ అజు నిర్దోషంతి తుమారమా కొయినితిమ్‍ ర్హాసు. 11 దేవ్నా మహిమబి, స్తుతి హువతిమ్‍, తుమే యేసు క్రీస్తు బ్హనే హువతె నీతిను ఫలంతి తుమారు జిందగీమా భరాయిన్‍‍ ర్హాను.
క్రీస్తుమా జీవను
12 భైయ్యే బ్హేన్‍, మనహుయుతే సువార్త అజు ఘను ఫైలావనాటేకెస్‍ జమహుయూకరి తుమే మాలంకర్నూకరినా. 13 అనటేకె మారు ఖైధియే క్రీస్తు నిమిత్తమాస్‍ హుయుకరి ఫ్యార్‍ను కార్యమ్‍ సేనమా ఇవ్నహాఃరనా మిగ్లుతె హఃరనా మాలంహుయు. 14 అజు భైయ్యెహుయుతె ఇవ్నమా ఘనుఅద్మి మారు ఖైధిను కారణ్‍తీ ప్రభువుమా స్థిర విష్వాస్‍హుయుతె ఇవ్నే, ఢర్‍ కొయిన్‍తిమ్‍ దేవ్నా వాక్యమ్‍నా బోధించనా అజు ధైర్యమ్‍తి లిలెవో.
15 హుయుతొ థోడుజను అసూయతి కర్రాబ్‍ దిల్తి బోధించుకురాస్‍, అజు థోడుజను షుధ్ద్ దిల్తీ క్రీస్తునా ప్రచార్‍ కరూకరస్‍. 16 ఇవ్నె హుయుతో మారు సువార్తభణె ఫేడుకరస్‍ నియమింబడ్సెకరి మాలంకరీన్‍, ఫ్యార్‍తి ప్రచార్‍కరూకరస్‍. 17 అవ్నెహుయుతొ ఖైధినాకేడె మన మిన్హత్‍ జమకర్నూకరి హాఃయల్‍ కరీన్‍, సుద్ధ్ దిల్తి కాహెతిమ్‍ దావోతి క్రీస్తును ప్రచార్‍కరూకరస్‍;
18 హుయుతొ సాత్‍? దావొతీస్‍హుయుతోబి, హాఃఛితీస్‍హుయుతోబి, కెహూవిధమ్‍హుయుతోబి క్రీస్తు ప్రచార్‍హుంకరస్‍. అనహాఃజె మే ఖుషి హుంకరూస్‍. అజు అగాఢీబి ఖుషితి ర్హహీస్‍. 19 మే బగల్ను మాలంకరీన్‍ నిరీక్చించుకరూతె ప్రకారమ్‍ తుమారు ప్రార్థనాటేకె, యేసుక్రీస్తు తీస్‍ ఆత్మ మనా సమృద్ధితి హువానాటేకె, యో ప్రకటనా మన బఛ్చావ్‍నూతీస్‍ పరిణమించుకాస్ మనమలం. 20 అజు మే మిగ్లువిషయంమాబి ‍షరం నాహోనుతిమ్‍ కెదెనితరస్‍ పూర్ణ్ హిమ్మతి బోధించనాటేకె మారు జీవంను మూలమ్‍గా టేకెబి హో, మరణ్‍ మూలమ్‍గాటేకెబి హో, క్రీస్తు మారు ఆంగ్తాన్‍మా ఘనపర్చబడ్సేకరి 21 మే హుయుతొ జివ్వాను క్రీస్తునటేకెస్‍, మరణ్‍హుయతొ లాభమ్‍. 22 హుయుతొబి ఆంగ్తాన్‍ను మే జివానుస్‍ మనా ఛాతే కామ్‍ ఫలితం మేసాత్‍బి కోరిస్‍కి మన తోచొకొయిని. 23 ఆ బేను ఇచ్మా అట్గి జైయిన్‍ చౌవ్‍. మే దూర్‍ జైయిన్‍ క్రీస్తునాకేడె ర్హానుకరి మన ఆహ్‍ః ఛా, యో మన అజు మేల్‍. 24 హుయుతోబి మే ఆంగ్తాన్‍మా హుబ్రి ర్హహీన్‍ తుమారటేకె అజు అవసరమ్‍ ఛా. 25 తుమె విష్వాస్‍మా భడిన్‍ ఖుషిబీ పొందు నిమిత్తమ్‍, మే జీవిర్హహిన్‍ తుమారకేడె మలీన్‍ ర్హానుకరి మన మాలంమ్‍. 26 అజు అజాత్ను భరోస కల్గీన్‍, మే పాచు తుమారకేడె మలిర్హహీన్‍ మారు బారెమా క్రీస్తు యేసుమా తుమ్నా ఛాతె అతిసయమ్‍ ఘను హోనుతిమ్‍.
27 మే ఆయిన్‍ తుమ్నా దేక్యొతోబి, నాఆయోతోబి తుమే కెహూ విషయంమాబి ఢరావతెవాలన ఢరొనొకొతిమ్‍, హాఃరుబి ఏక్‍ భావంతి సువార్త విష్వాస్‍నా భణె లడ్డాయి కర్తా, ఏక్‍ దిల్‍భర్తి వాలహుయిన్‍ హుబిరాస్కరి మే తుమ్న బారెమా హాఃమ్జోతె, తుమె క్రీస్తు సువార్తనా తగినట్లుతరా ప్రవర్తించొ. 28 తుమే తుమారు వైరియేన ఢరొనొకొతిమ్‍, ఇవ్నె నాషనంనా తుమ్నా జయమ్‍ కల్గనుతిమ్‍ హాఃనద్‍తరా ఛా. యో దేవ్ను బారెమాస్‍ హుసె. 29 క్రీస్తుమా విష్వాస్‍ రాఖనూస్‍ కాహె పన్కి ఇనా సేవా కరనాటేకెబి అజు ఇనటేకె మిన్హత్‍ కరనటేకె అప్నా దెవ్వాసె. 30 కింకతో తుమే మార హాఃమే దేక్యతె, మార హాఃమే ఛాతే తుమేహంకె హాఃజుకురాతె లడ్డాయినా తుమే కలిగిన్‍ ఛా.