యోహాను వ్రాసిన ప్రకటన పుస్తకము
యోహాన్ లిఖ్యొతె ప్రకటన పుస్తక్
మొదుల్ను వాతె
ప్రకటన పుస్తక్‍నా నవూ నిబంధనమాను ఆఖరీను పుస్తక్, ఆ క్రీస్తు ఫైదాహువనా 95 వరహ్క్ బాద్మా అపొస్తులుడ్ హుయోతె యోహాన్ 1:1హాతె ఆఖరిమా లిఖ్కాయు. అనే యోహాన్ సువార్తనా లిఖ్యొ. అజు 1 యోహాన్, 2 యోహాన్, అజు 3 యోహాన్ కరి పుస్తకాల్బి లిఖ్యొ. అనామా “యేసు ఫ్యార్ కరవాలొ” కరి బులావస్. ఇను పద్మాసు ద్వీపంమా రయ్యొతెదె ఇను ప్రకటన పుస్తక్‍నా లిఖ్యొ షానకతొ యేసుక్రీస్తు సువార్తనా ప్రచార్‍కరనాబారెమా ఎజ్గా బులాలిగయు.
ప్రకటన పుస్తక్‍నా లిఖ్కానబారెమా యోహాన్‍ను గురి సాత్కతొ యేసుక్రీస్తునా విష్వాస్‍లునితరా ర్హావనాటేకె బోధకుల్నా ఉషిదేవను అజు ఇవ్నా నిరీక్చణనా దేవనటేకె, షానకతొ యేసు పాచుఫరీన్ ఆవను వహఃత్ కందె ఆయ్రూస్1:3; 22:7 ఇను సాధారణంగా క్రైస్తవుల్ హాఃరవ్నా అజు హాఃత్ ప్రత్యేకంహుయతె సంఘాల్నా 2-3 అధ్యాల్‍మా లిఖ్యొ. యోహాన్, ఇను రచయితనా ప్రవచనాల్నా1:3కర్యొ అజు ఇను దేఖ్యొతె విషయాల్నా వివరించనా ఘనూ బొమ్మయేనా వాడ్యొ వివరించొ. ఆ పుస్తక్‍మా జూను విభాగాల్తి సమానంతి ర్హాయ్‍తె ప్రవచనాల్నా లిఖ్యొ, ముఖ్యంగా జెకర్యా6:1-8. హాఃత్ బానల్ బుజు హాఃత్ పాత్రల్ ఇమ్మస్ ఈజిప్టు అద్మియేనా ధండ్‍నాఖన దేవ్ మొక్లొతె బిమారియేనా ఘనూ పోలిన్ ర్హాస్ 7, 8 అధ్యయాల్ లిఖ్యొ. ఆపుస్తమ్ యేసు గెల్చేకరి, ఇనఫర్ నమ్మకం రాక్యుతె హాఃరుబి ఇనేతి షాస్వతంతీ జివ్సేకరి అజు ఆకరిమా ధన్‍బారెమా బొలాయ్‍రూస్. ఆ పుస్తక్ తుమ్నా గుర్ఖాంకరస్ అజు యేసు జల్దీస్ ఫరీన్ ఆవ్సేకరి తుమ్న ధ్యేర్ దెంక్రూస్.
విషయం బోలను
1. యోహాన్ కోన్‍కి ఆ ప్రవచనా దర్సనం కిమ్ పొంద్యోకి బోలను బారెమా సురుహువషె 1:1-20
2. ఇను యేసు కంతూ హాఃత్ సంఘాల్నా సీదతి ఏక్ సమాచార్‍నా దెంకరస్ 2:1–3:22
3. తెదె ఇను హాఃత్ చాపొనా 4:1–8:5 అజు హాఃత్ బూరల్ గురించి వివరించొ 8:6–11:19
4. అనపాసల్ యోహాన్ హాఃత్ ముఢ్క్యాతీ మహా హాఃప్‍ఫర్ మరద్మానలఢ్కావ్‍ను లఢాయ్‍నా వివరించొ 12:1–14:20
5. ఇనపాసల్ ఇను ఖీజ్‍నూ హాఃత్ పాత్రల్ బారెమా లిఖస్ 15:1–16:18
6. యోహాన్, దెవ్ స్వర్గంమా ఇను వైరియేవ్‍తీ కిమ్‍నితరా గెల్జస్‍కి వివరించొ 17:1–20:15
7. ఆఖరీమా నవూ ఆకాష్ అజు నవూ ధర్తీ ఆవను బారెమా వివరించొ 21:1–22:21
1
యోహాన్ లిఖ్యొతె ప్రకటన గ్రంథం అగాఢీనువాత్ హఃలామ్
1 యేసుక్రీస్తు ఇను దాసుల్నా దెఖాడిలేవ నాటేకె దేవ్ ఇనా దెవ్వాయ్‍రూతె ప్రత్యక్చాత ఆ సంగతుల్ ఎగ్గీస్ హువజాసె ఇను ఇను దూతనా బారెమా వర్తమానంనా మొక్లిన్ ఇను దాసుడ్‍హుయోతె యోహాన్‍నా యోహాఃరు సూచింతో 2 ఇను దేవ్ని వాక్యనా గూర్చిన్ యేసుక్రీస్తును సాక్చ్యము గూర్చీన్ ఇను దెఖయెత్రెతోడి సాక్చ్యంనా బోల్యొ 3 యోవఖాత్ కందె ఆయ్రూస్ అనటేకే ఆ ప్రవచన్ వాక్యాల్నాఫడవాలుబీ ఇనా హఃజీన్ అన్మా లిఖ్యూరూతె సంగతుల్నా మాలంకరవాలొ ధన్యుల్.
హాఃత్ సంఘాల్నా వందనాల్
4 యోహాన్ ఆసియామా ఛాతె హాఃత్ సంఘాల్నా అచ్చుకరి బోలిన్ లిఖ్కుకరతె జరుగుకరాతే జరిగ్యూతే జరగజాసెతే ధన్మాఛాతె ఇనకంతూ ఇను సింహాసన్నా హాఃమెఛాతె హాఃత్ ఆత్మల్నుకంతుబి 5 నమ్మకంహుయూతె సాక్చిబి మరణ్‍మతో అగాఢిను సంభూనితరా ఉట్యొహుయోబి ధర్తినాయేలవాలనా అధిపతి హుయోతె యేసుక్రీస్తు కంతుబి కృపాసమాధానాల్ తుమ్నా కల్గిన్ హువదా అప్నా ఫ్యార్‍కర్తో ఇను ల్హొయినా బారెమా అప్ను పాప్‍మతూ అప్న చొఢావనాటేకె 6 మహిమయూ ప్రభావమునూ యుగయుగముల్ హువదా ఆమెన్ కరిబొల్యో ఇను అప్నా ఇను భా హుయోతె దేవ్నా ఏక్ రాజ్యంనితరా యాజకుల్‍ని తరా కర్యొ
7 హదేక్ ఇను మబ్బుఫర్‍హుయీన్ వలోవస్ హరేక్ ఢోళొబి ఇనా దేక్తూ ఇనా ఠోచూహుయూబి దేక్చె ధర్తిను అద్మి హాఃరుబి ఇనా దేఖిన్ ఛాతి కూట్లిసె ఓహొ ఆమెన్ హూవదా!
8 అల్ఫా ఒమెగ మేస్ ఆది అంతం మేస్ హుయురొస్ జరుగ్యుతే నజరుగుకరతే జరగజాసేతే దనుమా రావాళో మేస్కరి సర్వదికారి హుయోతె దేవ్కరి ప్రభువు బోలుకరస్
క్రీస్తు సంఘం
9 తారు భైబి యేసునా బట్టీన్ హుసెతె మిన్హత్‍మాబి రాజ్యంమాబి ఓర్పుమాబి సహనంబి హుయోతె యోహాన్‍కరి మే దేవ్ను వాక్యంను నిమిత్తంనాబి యేసును గూర్చిన్ సాక్చ్యాంనా నిమిత్తంనా పత్మాసు ద్వీపమునా అలాదు దేహ్ఃవాలొహుయీన్ థొ 10 ప్రభువు ధన్నే ఆత్మతి రవాని వోఖాత్ ఏక్ బూరధ్వనిను ఆవాజ్ వాత్ బోలను హఃమ్జొ 11 తూ దేకుకరతె పుస్తకంమా లిఖ్కాయిన్ ఎఫెసున స్ముర్నన పెర్గమున తుయతైరన సార్దీస్‍న ఫిలదెల్ఫియన లవొదికయకరి హాఃత్ సంఘాల్నా మొకల్‍కరి బోల్యొ.
12 ఆ క్హంజుతె మారెతి వాతె బోలుకరతె స్వరం సాత్కరి ఫరీన్ దేఖమా ఘేణుతీ బాణయుతే క్హాత్ దివ్వొను స్తంభాల్నాదేక్యొ 13 ఆ దివ్వొను స్తంతంభాల్ను ఇచ్మాబి అద్మిను ఛియ్యోనా పోలిన్ ఛాతె ఏక్నా దేక్యొతొ ఇను ఇను గోడనాయెత్రే లుంగ్డా పేర్లీన్ ఛాతికనా ఘేణనూపట్టి బాందిలీన్ ఛా. 14 ఇను మాతుబి మాతను కేహ్క్ ధోలు ఉన్నినా పోలిన్ బరప్ యెత్రె ధవళంని తరా థూ ఇనూ ఢోళా ఆగ్ను జ్యాలనుఘోని ఛా. 15 ఇను గోడా కొలిమిమా బాలిన్ జమ్కతిం అపరంజితీ సమాన్‍హుయీన్ తూ ఇను ఆవాజ్ గణుషూ జలప్రవానహం నాక్హతె ఆవానితరా ధ్వనింతరా తూ. 16 ఇనా కవ్వాత్ను హాతేతి క్హాత్ షుఖ్కర్‍నా ధర్లీన్ థొ ఇను మోఢమతూ బేబాజు చాల్తుహుయూతె ఖడ్గం యేక్ బాదర్ నికులు కరుతూ ఇను మోఢు మోటా ఊజలతీ ప్రకాసించు కరతె సూర్యునితరా తూ. 17 మే ఇనా దేకుస్‍కరా మరిగయోతె ఇవిణింతరా ఇను గోఢకనా పడ్యొథొ యో ఇను కవ్వాత్ను హాతేతి మారఫర్ బేందీన్ మారేతి అమ్ బోల్యొ ఢర్‍నోకొ మే అగాడి వాలొ ఆఖరివాలొ. 18 పన్కి జివుంకరతే వాలొబి మరిగయోతో పన్కి హంకె యుగయుగాల్నా జీవ్తొహుయీన్ ఛవ్. బుజు మరణ్‍నుబీ పాతాళలోకం బీగంను ఛాబి మారకనా ఛా. 19 హుయుతొ తూ దేక్యొతెయినా, ఛాతెయినా, అనకేడె హువజాసెతె యినాబి, సంగతినా లిఖ్. 20 మారు కవ్వాత్ను హాత్మా తూ దేక్యొతె హాఃత్ షుఖ్కర్‍నా గూర్చిన్ మర్మాల్నా, యో హాఃత్ సువర్ణ దివ్వొస్తంభాల్ హాఃత్ సంఘాల్. యోహాఃత్ దివ్వోను స్తంభాల్ హాఃత్ దూతల్.