14
ఏక్ లాక్ చార్‍ఫర్ చాలిహ్ః హజార్ అద్మీను గీద్
1 బుజు మే దేఖమా, హదేక్, యోమ్హేండనుచెల్కు సీయోను బరప్ను ఫాడ్‍ను ఉప్పర్ ఉబ్రీన్ రయుతూ. ఇనూ నామ్‍మా ఇను బాను నామ్నా థాళఫర్ లిఖ్కాయిన్ ఛా. ఏక్ లాక్ చార్‍ఫర్ చాలిహ్ః హజార్*14:1 మూలభాషమా 1,44,000 అద్మియే అద్మి ఇనకేడె థూ. 2 బుజు విస్తార్‍తిహుయూతె పానిఫర్ ఆవాజ్‍తీబి సమాన్‍హుయూతె ఏక్ ఆవాజ్ స్వర్గంమతూ ఆవమా హఃమ్జొ. మే హఃమ్జొతె యో ఆవాజ్ వీణానా వజాడుకరతే వైణికుల్ను నాదమ్‍నా పోలిన్‍ఛా. 3 ఇవ్నె సింహాసణంనూ హాఃమేబి యోచార్ జాన్వార్‍ను హాఃమెబి, మొటవ్‍ను హాఃమెబి ఏక్ నవూ కీర్తనా గీద్ బోలుకరస్; జమీన్‍మతూ మోల్‍లిదూతె యో ఏక్ ఖోః చార్‍ఫర్ చాలిహ్ః హజార్ అద్మి తప్ప అజు కోన్బి యో కీర్తననా షిక్నారాబి కొయిని. 4 అవ్నె బాయ్కోను సాంగత్యంనా అపవిత్రుల్ హువకొయింతెబి, బాయ్కోనా మళకొయింతిమ్ మాలంకొయింతెవాలా ర్హహీన్, మ్హేండనుచెల్కు కెజ్గా జాస్కి ఎజ్గాతోడి ఇనా కేడెజాసె; అవ్నె దేవ్నుటేకెబి మ్హేండనుచెల్కనాటెకెబి మొధుల్ను ఫాయిదొనితరా ర్హవ్వానటేకె అద్మియేమతూ మోల్‍లిదూహుయవాలా. 5 అవ్ను బాకమతూ కెహూ చ్హాడ్‍బి దెఖ్కాయుకొయిని అవ్నె నిందకొయింతెవాలు.
తీన్ దూతల్ను
6 తెదె అజేక్ దూతనా దేఖ్యొతొ. ఇను జమీన్‍ఫర్‍జింకరతెవాలనా, కతొ హరేక్ జనంనాబీ హరేక్ జాత్‍వాలనబి ఆయో భాషాల్ వాతెబోలతెవాలనబి హరేక్ అద్మియేనాబి ప్రచార్‍కరాతిమ్ నిత్య్ సువార్త లీలిన్ ఆకాష్‍ను ఇచ్మా ఉడ్తూరంకరా. 7 ఇను తుమె దేవ్నా ఢరీన్ ఇనాస్ మహిమాపర్చొ ఇను న్యావ్‍కరనూ వహఃత్‍ఆయు అనటేకే ఆకాష్‍బి జమీన్ ధర్యావ్‍బి జలధారల్‍ను బనాయ్‍హుయోతె ఇనాస్ హఃలామ్ కరోకరి మోటు ఆవాజ్‍తి బోల్యు.
8 అజేక్ దూత, కతొ బెంమ్మను దూత ఇనకేడె ఆయిన్ మోహోద్రేకముతో మలూతె ఇను వ్యభిచార్‍ను ఇన్మా సమస్త అద్మియేనా పియ్యాడుతె ఆమహా బబులోన్ కూలిగయూ కూలిగయూ కరి బోల్యు.
9 బుజు అజేక్ దూత, కతొ తీన్మనూ దూత అవ్నుకేడె ఆయిన్ మోటు ఆవాజ్‍తి అమ్‍నితరా బోల్యు యో క్రూరజాన్వార్‍నాతోబి ఇనూ బొమ్మనాతోబి కోన్బి హఃలామ్ కర్యూతో, ఇను తాళఫర్‍హుయ్‍తోబి హాత్‍ఫర్‍తోబి యో ఛాపొ నక్కాయ్‍లిదూతొతెదె 10 సాత్‍బి మలావకొయినితిమ్ దేవ్ను చంఢాల్ను గిన్నిమా నక్కాయ్‍రూతె దేవ్ను చంఢాల్‍నా దారునా ఇను పీస్యె. పరిసుద్ధ దూతల్ను హాఃమెబి మ్హేండనుచెల్కనా హాఃమెబి ఆగ్ను ఠియ్యాతి ఇను బాధింపబడ్చె. 11 ఇవ్ను బాధసంబంధంహుయూతె దువ్వొ పిఢి పిఢియా ఉట్సె ఆ క్రూరమృగంనా పన్కి ఇనూ బొమ్మనా పన్కి నమష్కారంకరవాలుబి, ఇనూ నామ్‍హుయుతె కోన్బి నఖ్కాయిలిదూతొతెదె ఇనేబి రాత్‍ధన్ నెమ్మదికొయింతెవాలుహుయీన్ ర్హాసె. 12 దేవ్ను ఆజ్ఞల్‍నా యేసును గూర్చితె నమ్మకంనా మాలంకరూకరతె దేవ్ను అద్మియే ఓర్పు అన్మాలిన్ దెఖ్కావ్సె.
13 తెదె హంకెతూ ప్రభువును కామ్మా మరిగాయుతే ధన్యుల్‍కరి లిఖ్క కరి స్వర్గంమతూ ఏక్ ఆవాజ్ బోలమా హఃమ్జొతొ. హాఃచిస్; ఇవ్నె ఇవ్ను ప్రయాసాల్‍నా బెందీన్ ఆరామ్ లీలిసె; ఇవ్ను క్రియల్ ఇవ్ను పీటె జాసెకరి ఆత్మ బోలుకరస్.
ధర్తీ ఫర్ పంట్టా వాడను ధన్
14 బుజు మే దేఖమా, హదేక్ ధోళు మబ్బు దెఖ్కాయు. అద్మినుఛియ్యోనా పోలిన్ ఏక్జను యోమబ్బును ఉప్పర్ ఆసీనుడు హుయీన్ థొ. ఇను మాతఫర్ ఘేనానుకిరీటంనా, హాత్‍మా వాడిహుయూతె ధరాతి తూ. 15 తెదె అజేక్ దూత దేవలయంమతూ భాదర్ ఆయిన్ జమీన్ కేథర్ పిఖ్కాయిన్ ఛా. వాఢనుధన్ ఆయూ, తారు ధరాతి బెందీన్ వాఢ్కరి మోటు ఆవాజ్‍తీ యోమబ్బును ఉప్పర్ ఆసీనుడు హుయీన్‍ఛాతె ఇనేతి బోల్యొ. 16 మబ్బును ఉప్పర్ ఆసీన్‍హుయీన్ ఛాతెఇనె ఇను ధరాతినా జమీన్‍ఫర్ నాఖమా జమీన్ హాఃల్ వఢాయు.
17 తెదె అజెక్ దూత స్వర్గంమాఛాతె ఆలయంమాతు నిఖీన్ ఆయు; ఇనకనబి చాల్తుహుయూతె ధరాతి థూ.
18 బుజేక్ దూత బలిపీఠంమతూ నిఖీన్ ఆయు. అనే ఆగ్‍ఫర్ అధికార్ లీరాక్యొహుయో; అనే చాల్తూహుయూతె ధరాతిహుయూతె ఇనా మోటు ఆవాజ్‍తీ బులాయిన్ జమీన్‍ఫర్ ఛాతె అంగూర్‍పండా గుత్తా పిఖ్కాయ్‍గు; చాల్తుహుయూతె తారు ధరాతిబేందీన్ ఇనూ తడుగునా వాడ్‍కరి బోల్యు. 19 హువమా యోదూత ఇను ధరాతి జమీన్‍ఫర్ నాకీన్ జమీన్‍ఫర్ ఛాతె అంగూర్‍నుపండనా వాడిన్, దేవ్ను చంఢాల్నాకరి అంగూర్‍ను మోటుతొట్టిమా నాక్యు. 20 యో అంగూర్‍ను తొట్టి హఃయర్‍ను భార్ కుంద్లాయు; బే మిటార్ తీన్‍ఖొః పర్లాంనగ్ దూర్ ఘోడొను కళ్లెమ్‍హుయూతొ అంగూర్‍ను తొట్టిమాతూ ల్హొహిచాల్యూ.