2
తిమోతిక పవులు అన్నె నిదానుమ్ సంగిలిసి
1 అంచొ పుత్తు, క్రీస్తు జలొ యేసుచి దయక తుక జో దిలి సెక్తిక తుయి డిట్టుమ్ తా. 2 చి ఒగ్గర్ సాచుల్‍చి మొక్మె తుయి అంచితె సూన్లిసి ఎత్కి జేఁవ్ కి అన్నె మాన్సుల్‍క సికడ్తి రితి, నిదానుమ్ తిల అన్నె మాన్సుల్‍క తుయి సికడు. 3 పడ్తొ, చెంగిలొ తిలొ కేన్ జమాను కీసి బాదల్ ఓర్సుప జా నిదానుమ్ కెరెదె గే, తుయి కి ప్రబుచి కామ్‍చి రిసొ బాదల్ సేడ్తిసి తుయి కి ఓర్సుప జా నిదానుమ్ తా. 4 పడ్తొ, జమాన్లుతె బెదితొసొ చెంగిలొచొ జలె, కామ్‍తె తిలె, వేర మాములుమ్ మాన్సుల్‍చ కమొతె జో బెదె నాయ్, నెంజిలె వేరచితె బెదిలె, సిక్కు జా జోవయింక దిలి కామ్ పిట్టయెదె. జోచొ ఎజొమాని మెన్సితి రితి జో తియార్లి కామ్ చెంగిల్ కుట్టవుక మెన మెన్సు దా ఎక్కి నిదానుమ్ కెరెదె. 5 పడ్తొ, నిగితి కెల్‍క జవుస్ బెదితొసొ జలె, జేఁవ్ కెర్లయ్‍చి బెదితి రితి కెర్లెకయ్ జో జీన గురి నఙనుక జయెదె. 6 పడ్తొ, పంటొ లాయిలె పొది, కో తొలితొ జోవయించి వాట నఙనుక విలువ మెలె, నిదానుమ్ కామ్ కెర్లొ తిలొసొ విలువ, బద్దుకుమ్‍చొ నాయ్, గని నిదానుమ్ కెర్తొసొ. 7 ఆఁవ్ ఇన్నె రెగిడ్ల టాలివొచి రిసొ చెంగిల్ ఉచరు. తుయి పూర్తి అర్దుమ్ కెరంతి రితి ప్రబు తుక సికడెదె.
చి సెక్తి
8 యేసుక్రీస్తు దావీదు పూర్గుమ్‍చొచి సెకుమ్‍తె జెర్మ మొర అన్నె జిలిసి ముక్కిమ్‍క తుయి ఉచార కెరంతె తా. జోచి రిసొ ముక్కిమ్‍క ఆఁవ్ సుబుమ్ కబుర్ బోదన కెరుక మెన ప్రబు అంచి అత్తి కామ్ సొర్ప కెర దా అస్సె, గెద. 9 జయ్యి సుబుమ్ కబుర్ ఆఁవ్ సూనయ్‍తె తిలి రిసొ ఇస స్రెమల్ సేడ అస్సి, కిచ్చొ జవుస్ నేరిమ్ కెర్లొసొ మెన దెకిల్ రితి అంక ఈంజేఁవ్ గొల్సుల్ బంద అస్తి. గని అంక కిచ్చొ దయిరిమ్ మెలె, దేముడుచి సుబుమ్ కబుర్ కోడు బందుక నెతిర్తి. 10 జాకయ్ దేముడు నిసాన్లసక ‘సూన నంపజా క్రీస్తు జలొ యేసుచి నావ్ తెన్ పాపుమ్ తెంతొ రచ్చించుప జా పరలోకుమ్‍తె గెచ్చ కెఁయఁక తెఁయఁక చెంగిల్ తత్తు’ మెనయ్, కిచ్చొ స్రెమల్ జలెకి ఆఁవ్ ఓర్సుప జతసి.
11 ‘దేముడుచి కోడు ఈంజ’ మెన ఏక్ కిచ్చొ కచితుమ్ దెరన్‍తసుమ్ మెలె,
“జోవయింతెన్ మొర్లమ్ మెలె,
కచితుమ్ జోవయింతెన్ జిమ్‍దె.
12 జోవయించి నావ్‌చి రిసొ బాదల్ ఓర్సుప జలమ్ మెలె,
కచితుమ్ జోవయింతెన్ *2:12 కొరిందిల్‍క రెగిడ్లి 1 నంబర్ ఉత్రుమ్ 4:8, డీసయ్‍లిసి 5:10, 20:4, 6 చి 22:5.ఏలుప కెరుమ్‍దే.
‘జోవయింక నేనుమ్’ మెలి రితి ఇండిలె,
జో కి అమ్‍క ‘జోవయింకయ్ నేని’ మెన జో అమ్‍క తియనె నాయ్.
13 ఆమ్ నిదానుమ్ నెంజిలె కి,
జో ఎక్కి నిదానుమ్ తా గెతయ్.”
జోవయించి సత్తిమ్‍చి రిసొ జో అబద్దుమ్ కెరుక నెత్రె, జోవయించి కోడు పిట్టవుక నెత్రె.
కామ్‍క నెంజిత కొడొ జుజయ్‍తిస్‍చి రిసొ జాగర్త సంగిలిసి
14 ఈంజ ఉప్పిర్‍చి కోడుచి రిసొ ఒత్తచ నంపజలస్‍క తుయి ఏద కెరవు, చి ‘కామ్‍క నెంజిల రితయ్ కొడొ జుజయ్‍తిసి ముల’ మెన ప్రబుచి నావ్ తెన్ జోవయింక జాగర్త సంగు. 15 తుచి కామ్‍క ‘చెంగిల్ కెర్తయ్’ మెన దేముడు ఒప్పన్‍తి రితి జోవయింక ఎక్కి నిదానుమ్ జంక తుయి ఎక్కి ఆస జా, డొంగ్రె సోగ వాటు గగ్గడ్తి రితి, సూన్‍తస పూర్తి అర్దుమ్ కెరంతి రితి, దేముడుచి సుబుమ్ కబుర్ సరిగా సిక్కడు. దస్సి నిదానుమ్ తిలె, తుక జో దిలి కామ్‍క ‘నిదానుమ్ కెర్లయ్’ మెనయ్ తుయి లాజ్ జంక నాయ్. 16 జలె, దేముడుచి మరియాద కడ రితి కామ్‍క నెంజిల కొడొ లట్టబ్తిసి, కొడొ జుజయ్‍తిసిక దూరి తా. దస కొడొతె బెదిలె, మాన్సుల్ అన్నె ఒగ్గర్ పాడ్ జతి రితి దేముడుక జోవయింక దూరి కెర్లి రితి జయెదె. 17 కిఁవ్వొ జలి గావు ఒగ్గర్ జలె, ఒండొయి మాన్సుక కా గెల కీసి పాడ్ కెరెదె గే, దస్సి, దస కామ్‍క నెంజిల కొడొ లట్టబ్తిసి మాన్సుచి ఆత్మక పాడ్ కెరెదె. దస్సి జల మాన్సుల్, హుమెనైయును చి పిలేతును. 18 జేఁవ్ కిచ్చొ ఏక్ తప్పు సికడ్తతి మెలె, “మొర్ల మాన్సుల్‍క దేముడు జియడెదె మెలిసి పడ్తొకయ్ జర్గు జయెదె మెలిసి అబద్దుమ్. అగ్గెయి తెంతొ ఆత్మ రగుమ్‍క జర్గు జా అస్సె. ఆఁగ్ రగుమ్‍క జర్గు జంక నెంజె” మెన జేఁవ్ సికడ, సగుమ్‍జిన్‍చి నముకుమ్ పాడ్ కెర్తతి. 19 గని దేముడుచి రాజిమ్‍క ‘గేరు’ మెన దెకిలె, జా గేరుచి పునాదితె కిచ్చొ రెగ్డ అస్సె మెలె,
†2:19 సంక్యాకాండుము 16:5, 26.“కో జోవయింక నిదానుమ్ తా జోచయ్ జా అస్తి గే ప్రబు జానె” పడ్తొ, “ప్రబుచి నావ్ కో దెర్తతి గే,
పాపుమ్‍తె బెదుత్ నాయ్, గని ముల దెతు!” మెన రెగ్డ అస్సె.
20 జలె, కేన్ జవుస్ వెల్లొ గెరి ఎత్కి రగల్ గెర్‍చి కామ్‍చ సామన్లు తవుల. సగుమ్ బఙర్‍చ, సగుమ్ వెండిచ, గని దారు తెన్ కి మత్తి తెన్ తెయార్ కెర్లస కి తవుల. జేఁవ్ సామన్లుతె సగుమ్, జలె, మాములుమ్ మరియాదచ కమొక వాడిక కెర్తస. సగుమ్, జలె, నిస్కారుమ్ కమొక వాడిక కెర్తస. 21 జలె కేన్ మాన్సు ఆత్మ నిస్కారుమ్ కెర్తి పాపుమ్ గెచ్చవన గెలె, జలె, మరియాద కామ్ కెర్తి సామన్‍చి రితి జయెదె. జో దస్సి సుద్ది జలె, కేన్ చెంగిల్ కామ్‍చి రిసొ కి జో గేర్‍చొ ఎజొమానిక జో కామ్‍క జెయెదె. ప్రబుచి కామ్‍క తుయి దస్సి సుద్ది తిలి కామ్‍క జెతికయ్ వస్తు జా.
22 జాకయ్, బుద్ది నెంజిల ఉబెడల్ జత ఆసల్‍క తుయి దూరి తా, సుద్ది ఆత్మ తెన్ ప్రబుక ఎక్కి నిదానుమ్ తా జోవయించి నావ్ దెర్తస ఎత్కిజిన్ తెన్, సత్తిమ్‍బుద్ది, నిదానుమ్‍చి నముకుమ్, ప్రేమ, సేంతుమ్‍కయ్, జేఁవ్ తుయి కోర్‍ప జతె తా.
23 బుద్ది నెంజిల కామ్‍క నెంజిల కొడొ జుజయ్‍తిస్‍క దూరి తా. దసచతె బెదిలె మాన్సుల్ ఎక్కిలొక ఎక్కిలొ గగ్గొల్ జా జట్టి జతతి. 24 పడ్తొ, ప్రబుచి సేవ కెర్తొ కేన్ మాన్సు జలెకి, గగ్గొల్ జతొసొ జంక జయె నాయ్. జో కీసొ తంక మెలె, మెత్తన తా ఎత్కిజిన్‍క చెంగిల్ దెకితొసొ, తెలివి తెన్ చెంగిల్ బోదన కెర్తొసొ, కుస్సిదుమ్ నే జతె బాదల్ ఓర్సుప జతొసొ జంక. 25 పడ్తొ, చి బోదనక వేరయ్ సంగిత మాన్సుల్‍చి ఉప్పిరి గగ్గొల్ నే జతె జో మాన్సు మరియాద తెన్ సరిగా అర్దుమ్ సంగుక సికుక. దస్సి మరియాద తెన్, ‘జో మాన్సు తప్పు ఒప్పన విసారుమ్ జా సత్తిమ్ దెరన్సు’ మెన ఏక్ వేల దేముడు సెలవ్ దెయెదె, 26 చి సయ్‍తాన్‍తె దెర్ను సేడ్లిస్ తెంతొ, జోవయించి ఇస్టుమ్ రితి కెర్తె తిలిస్‍తె తెంతొ జో మాన్సు విడ్దల్ జయెదె, చి బుద్ది జా ప్రబుచి ఇస్టుమ్ రితి కెరుక దెరెదె.