4
ఇతర యూదా కుటుంబ సమూహాలు
యూదా కుమారులు ఎవరనగా:
 
పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు.
శోబాలు కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు యహతు. యహతు కుమారులు అహూమై, లహదు అనువారు. అహూమై, లహదు వంశీయులే సొరాతీయులు. అబేయేతాము తండ్రియగు హారేపు సంతతివారెవరనగా
అబీయేతాము కుమారులు యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు అనేవారు. వారి సోదరి పేరు హజ్జెలెల్పోని.
పెనూయేలు కుమారుడు గెదోరు. ఏజెరు కుమారుడు హూషా. హూరు సంతతి వారెవరనగా:
హూరు అనువాడు ఎఫ్రాతాకు పెద్ద కుమారుడు. ఎఫ్రాతా కుమారుడు బేత్లెహేము.
తెకోవ తండ్రి పేరు అష్షూరు. తెకోవకు హెలా మరియు నయరా అను ఇద్దరు భార్యలు. నయరాకు అహూజాము, హెపెరు, తేమని, హాయహష్తారీ అనేవారు పుట్టారు. వీరంతా అష్షూరుకు నయరావల్ల పుట్టిన కుమారులు. హెలా కుమారులు జెరెతు, సోహరు, ఎత్నాను మరియు కోజు అనువారు. కోజు కుమారులు ఆనూబు, జోబేబా. అహర్హేలు సంతతి వారందరికీ కోజు మూలపురుషుడు. అహర్హేలు అనేవాడు హారుము కుమారుడు.
 
యబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటె మంచివాడు. “నేనతనికి యబ్బేజు అని నామకరణం చేశాను. ఎందువల్లననగా నేనతనిని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను” అని అతని తల్లి చెప్పింది. 10 యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.
 
11 కెలూబు అనువాడు షూవహుకు సోదరుడు. కెలూబు కుమారుని పేరు మెహీరు. మెహీరు కుమారుని పేరు ఎష్తోను. 12 ఎష్తోను కుమారుల పేర్లు బేత్రాఫాను, పాసెయ మరియు తెహిన్నా. తెహిన్నా కుమారుని పేరు ఈర్నాహాషు.*తెహిన్నా … ఈర్నాహాషు లేక నాహాషు నగరంలో నివసించే వారికి తెహిన్నా తండ్రి అని అర్థం. ఈర్ అనగా నగరం. వారంతా రేకా నుండి వచ్చిన వారు.
13 కనజు కుమారులు ఇద్దరు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలుకుహతతు, మెయానొతై అనే ఇద్దరు కుమారులు. 14 మెయానొతై కుమారుని పేరు ఒఫ్రా.
శెరాయా కుమారుని పేరు యోవాబు. యోవాబు కుమారుని పేరు గెహరష్షీము. (దీనినే “పని వారి లోయ” అంటారు). హస్త నైపుణ్యం గల పనివారు నివసించే చోటు గనుక ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.
15 యెపున్నె కుమారుని పేరు కాలేబు. కాలేబు కుమారులు ఈరూ, ఏలా, నయము అనేవారు. ఏలా కుమారుని పేరు కనజు.
16 యెహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అశర్యేలు అనేవారు.
17-18 ఎజ్రా కుమారుల పేర్లు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు కుమారులు మిర్యాము, షమ్మయి, ఇష్బాహు అనేవారు. ఇష్బాహు కుమారుడు ఎష్టెమోను. మెరెదు భార్య ఐగుప్తు (ఈజిప్టు) కు చెందిన స్త్రీ. ఆమెకు యెరెదు, హెబెరు, యెకూతీయేలు అను కుమారులు కలిగారు. యెరెదు కుమారుని పేరు గెదోరు. హెబెరు కుమారుని పేరు శోకో. యెకూతీయేలు కుమారుని పేరు జానోహ. బిత్యా వంశావళి ఏదనగా: బిత్యా ఫరో కుమార్తె. ఈమె ఐగుప్తు (ఈజిప్టు) దేశీయురాలు. మెరెదుకు భార్య.
19 మెరెదు మరో భార్య నహము సోదరి. మెరెదు యొక్క ఈ భార్య యూదాకు చెందిన స్త్రీ.మెరెదు … చెందిన స్త్రీ ఈ వాక్యం ప్రాచీన గ్రీకు అనువాదంలో వుంది. మెరెదు భార్యకు పుట్టిన కుమారులు కెయీలా. ఎష్టెమో అనే వారికి తండ్రులయ్యారు. కెయీలా గర్మీయులకు చెందినవాడు. ఎష్టెమో మాయకాతీయులకు చెందినవాడు. 20 షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను మరియు తీలోను.
ఇషీ కుమారులు జోహేతు మరియు బెన్జోహేతు.
21-22 యూదా కుమారుని పేరు షేలహు. షేలహు కుమారులు ఏరు, లద్దా, యోకీము, కోజేబావారి యోవాషు, శారాపు అనేవారు. ఏరు కుమారుని పేరు లేకా. మారేషా అను వానికి, బేత్ అషీబయలో నారబట్టలు నేయు కుటుంబాల వారికి లద్దా తండ్రి. యోవాషు, శారాపులిద్దరూ మోయాబీయుల స్త్రీలను వివాహమాడారు. పిమ్మట వారు బేత్లెహేముకు తిరిగి వెళ్లారు.వివాహమాడారు … వెళ్లారు వారు మోయాబలోను, యాషూబిలెహెములోను పాలించారు అని పాఠాంతరం. ఈ వంశాన్ని గురించిన వ్రాతలన్నీ మిక్కిలి ప్రాచీనమైనవి. 23 షేలహు కుమారులు కుమ్మరి పనివారు. వారంతా నెతాయీములోను, గెదేరాలోను నివసించారు. వారా పట్టణాలలో వుంటూ రాజు కొరకు పనిచేశారు.
షిమ్యోను కుమారులు
24 షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు అనేవారు. 25 షావూలు కుమారుని పేరు షల్లూము. షల్లూము కుమారుడు మిబ్శాము. మిబ్శాము కుమారుడు మిష్మా.
26 మిష్మా కుమారుడు హమ్మూయేలు. హమ్మూయేలు కుమారుడు జక్కూరు. జక్కూరు కుమారుడు షిమీ. 27 షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలిగారు. కాని షిమీ సోదరులకె వరికీ సంతానం లేదు. షిమీ సోదరులకు పెద్ద కుటుంబాలు కూడా లేవు. యూదాలో ఇతర కుటుంబాల మాదిరిగా వారి కుటుంబాలు పెద్దవి కావు.
28 షిమీ సంతానం బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను, 29 బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను, 30 బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, 31 బేత్మర్కా బేతులోను, హజర్షూసాలోను, బేత్బీరీలోను, షరాయిములోను నివసించారు. దావీదు రాజయ్యేవరకు వారా పట్టణాలలో నివసించారు. 32 ఆ పట్టణాల పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాలేవనగా ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను మరియు ఆషాను. 33 అంతేగాక బయలువరకు అనేక ఇతర గ్రామాలు కూడవున్నాయి. ఈ ప్రదేశాల్లో వారు నివసించారు. పైగా వారు తమ వంశచరిత్రను కూడా రాశారు.
 
34-38 ఆయా వంశాల వారి నాయకులు ఈ విధంగా ఉన్నారు: మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడగు యోషా, యావేలు, యోషిబ్యా కుమారుడైన యెహూ (యోషిబ్యా అనేవాడు శెరాయా కుమారుడు: శెరాయా తండ్రి పేరు అశీయేలు); ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా మరియు షిపి కుమారుడైన జీజా. షిపి అనేవాడు అల్లోను కుమారుడు. అల్లోను తండ్రి పేరు యెదాయా. యెదాయా తండ్రి పేరు షిమ్రీ. షిమ్రీ తండ్రి పేరు షెమయా.
 
ఈ మనుష్యుల కుటుంబాలన్నీ బాగా విస్తరించి పెరిగాయి. 39 వారు గెదోరుకు, ఆ పైభూభాగాలకు, తూర్పున ఉన్న లోయ వరకు సంచరించారు. వారు తమ గొర్రెల మందలకు, ఆవుల మందలకు మేత బయళ్లు వెదుకుతూ ఆ ప్రాంతాల వరకు సంచరించారు. 40 పచ్చిక మెండుగా ఉన్న మంచి భూములను వారు కనుగొన్నారు. సారవంతమైన పంట భూములను కూడ వారు చూసారు. ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం విలసిల్లింది. గతంలో హాము సంతతివారు అక్కడ నివసించారు. 41 యూదా రాజు హిజ్కియా కాలంలో ఇది జరిగింది. ఆ మనుష్యులంతా గెదోరుకు వచ్చి, హామీయులతో పోరాడి, వారి గుడారాలన్నిటినీ నాశనం చేశారు. వారింకా అక్కడ నివసించే మెయోనీయులతో కూడ యుద్ధం చేసి వారిని నాశనం చేసారు. ఈనాటి వరకు అక్కడ మెయోనీయులు లేరు. తరువాత ఈ మనుష్యులే అక్కడ నివసించసాగారు. అక్కడ వారి గొర్రెలకు పుష్కలంగా మేత దొరకడంతో వారక్కడ స్థిరపడ్డారు.
42 ఐదువందల మంది షిమ్యోనీయులు కొండల ప్రాంతమైన శేయీరుకు వెళ్లారు. ఇషీ కుమారుల నాయకత్వంలో వారు వెళ్లారు. వారి పేర్లు ఏవనగా: పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు. షిమ్యోనీయులు అక్కడి స్థానిక ప్రజలతో యుద్ధం చేసారు. 43 అక్కడ చాలా కొద్దిమంది అమాలేకీయులు మాత్రమే ఉంటున్నారు. షిమ్యోనీయులు వారిని హతమార్చారు. అప్పటి నుండి ఈనాటి వరకు షిమ్యోనీయులు శేయీరులో నివసిస్తున్నారు.

*4:12: తెహిన్నా … ఈర్నాహాషు లేక నాహాషు నగరంలో నివసించే వారికి తెహిన్నా తండ్రి అని అర్థం. ఈర్ అనగా నగరం.

4:19: మెరెదు … చెందిన స్త్రీ ఈ వాక్యం ప్రాచీన గ్రీకు అనువాదంలో వుంది.

4:21-22: వివాహమాడారు … వెళ్లారు వారు మోయాబలోను, యాషూబిలెహెములోను పాలించారు అని పాఠాంతరం.