125
యాత్ర కీర్తన. 
  1 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.  
వారు ఎన్నటికీ కదలరు.  
వారు శాశ్వతంగా కొనసాగుతారు.   
 2 యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.  
అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.   
 3 దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.  
దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలు పెడతారేమో.   
 4 యెహోవా, మంచి మనుష్యులకు మంచి వాడవుగా ఉండుము.  
పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచి వాడవుగా ఉండుము.   
 5 యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.  
వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.  
ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.