2
ఇశ్రాయేలు కుమారులు 
  1 ఇశ్రాయేలు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,   2 దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.   
యూదా 
 హెస్రోను కుమారుల వరకు 
  3 యూదా కుమారులు:  
ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన బత్-షుయ కుమార్తెకు జన్మించారు.  
యూదాకు మొదటి కుమారుడైన ఏరు యెహోవా దృష్టిలో చెడ్డవానిగా ఉన్నాడు కాబట్టి ఆయన వానిని చంపారు.   
 4 యూదా కోడలు తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహులు పుట్టారు.   
యూదా కుమారులందరు మొత్తం అయిదుగురు.  
 5 పెరెసు కుమారులు:  
హెస్రోను, హామూలు.   
 6 జెరహు కుమారులు:  
జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార.*చాలా హెబ్రీ ప్రతులలో, కొ.ప్ర.లలో దార్దా వీరు అయిదుగురు.   
 7 కర్మీ కుమారుడు:  
ఆకారు,†ఆకారు అంటే శ్రమ; ఆకారు యెహోషువ గ్రంథంలో ఆకాను అని పిలువబడింది. అతడు ప్రత్యేకపరచబడిన వాటిని ముట్టకూడదని నిషేధించబడిన కొన్నిటిని తీసుకుని ఇశ్రాయేలుకు బాధను తీసుకువచ్చాడు.   
 8 ఏతాను కుమారుడు:  
అజర్యా.   
 9 హెస్రోనుకు జన్మించిన కుమారులు:  
యెరహ్మెయేలు, రాము, కాలేబు.‡కాలేబు హెబ్రీలో కెలూబై   
హెస్రోను కుమారుడైన రాము నుండి 
  10 రాము కుమారుడు అమ్మీనాదాబు.  
అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. అతడు యూదా ప్రజల నాయకుడు.   
 11 నయస్సోను కుమారుడు శల్మాను.§హెబ్రీలో శల్మా  
శల్మాను కుమారుడు బోయజు.   
 12 బోయజు కుమారుడు ఓబేదు.  
ఓబేదు కుమారుడు యెష్షయి.   
 13 యెష్షయి కుమారులు:  
మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు,  
మూడవవాడు షిమ్యా,   14 నాలుగవవాడు నెతనేలు,  
అయిదవవాడు రద్దయి,   15 ఆరవవాడు ఓజెము,  
ఏడవవాడు దావీదు.   
 16 సెరూయా, అబీగయీలు వారి సహోదరీలు.  
సెరూయా కుమారులు ముగ్గురు: అబీషై, యోవాబు, అశాహేలు.   
 17 అబీగయీలు అమాశా తల్లి. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశా తండ్రి.   
హెస్రోను కుమారుడైన కాలేబు 
  18 హెస్రోను కుమారుడైన కాలేబుకు అతని భార్య అజూబా ద్వారా (యెరీయోతు ద్వారా) పిల్లలు కలిగారు. ఆమె కుమారులు వీరు:  
యేషెరు, షోబాబు, అర్దోను.   
 19 అజూబా చనిపోయాక కాలేబు ఎఫ్రాతాను పెళ్ళి చేసుకున్నాడు, ఆమె ద్వారా అతనికి హూరు పుట్టాడు.   
 20 హూరు కుమారుడు ఊరి. ఊరి కుమారుడు బెసలేలు.   
 21 తర్వాత, హెస్రోను అరవై సంవత్సరాల వయస్సులో గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను పెళ్ళి చేసుకుని ఆమెతో శయనించినప్పుడు ఆమె ద్వారా అతనికి సెగూబు పుట్టాడు.   
 22 సెగూబు కుమారుడు యాయీరు. యాయీరుకు గిలాదులో ఇరవై మూడు పట్టణాలున్నాయి.   
 23 (అయితే గెషూరు, అరాము, హవ్వోత్ యాయీరును,*లేదా యాయీరు పట్టణాలు స్వాధీనం చేసుకున్నారు కెనాతును దానికి చెందిన పట్టణాలను మొత్తం అరవై పట్టణాలను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.)   
వీరందరు గిలాదు తండ్రియైన మాకీరు సంతానము.  
 24 కాలేబు ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత, అతని భార్య అబీయా ద్వారా అతనికి తెకోవాకు తండ్రియైన అష్షూరు పుట్టాడు.   
హెస్రోను కుమారుడైన యెరహ్మెయేలు 
  25 హెస్రోను మొదటి కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు:  
మొదటి వాడైన రాము, బూనా, ఓరెను, ఓజెము, అహీయా.   26 యెరహ్మెయేలుకు అటారా అనే మరో భార్య ఉంది. ఆమె ఓనాముకు తల్లి.   
 27 యెరహ్మెయేలుకు మొదటి కుమారుడైన రాము కుమారులు:  
మయజు, యామీను, ఏకెరు.   
 28 ఓనాము కుమారులు:  
షమ్మయి యాదా.  
షమ్మయి కుమారులు:  
నాదాబు, అబీషూరు.   29 అబీషూరు భార్యపేరు అబీహయిలు, ఆమె ద్వారా అతనికి అహ్బాను, మొలీదులు పుట్టారు.   
 30 నాదాబు కుమారులు:  
సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు లేకుండానే చనిపోయాడు.   
 31 అప్పయీము కుమారుడు:  
ఇషీ, ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుడు అహ్లయి.   
 32 షమ్మయి సోదరుడైన యాదా కుమారులు:  
యెతెరు, యోనాతాను. యెతెరు పిల్లలు లేకుండానే చనిపోయాడు.   
 33 యోనాతాను కుమారులు:  
పేలెతు, జాజా.   
వీరు యెరహ్మెయేలు సంతానము.  
 34 షేషానుకు కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు.  
షేషానుకు ఈజిప్టు వాడైన యర్హా అనే సేవకుడున్నాడు.   35 షేషాను తన కుమార్తెను తన సేవకుడైన యర్హాకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆమె ద్వారా అతనికి అత్తయి పుట్టాడు.   
 36 అత్తయి కుమారుడు నాతాను,  
నాతాను కుమారుడు జాబాదు,   
 37 జాబాదు కుమారుడు ఎప్లాలు,  
ఎప్లాలు కుమారుడు ఓబేదు,   
 38 ఓబేదు కుమారుడు యెహు,  
యెహు కుమారుడు అజర్యా,   
 39 అజర్యా కుమారుడు హేలెస్సు,  
హేలెస్సు కుమారుడు ఎల్యాశా,   
 40 ఎల్యాశా కుమారుడు సిస్మాయీ,  
సిస్మాయీ కుమారుడు షల్లూము,   
 41 షల్లూము కుమారుడు యెకమ్యా,  
యెకమ్యా కుమారుడు ఎలీషామా.   
కాలేబు వంశస్థులు 
  42 యెరహ్మెయేలు సోదరుడైన కాలేబు కుమారులు:  
మొదటి కుమారుడు జీఫు తండ్రియైన మేషా,  
హెబ్రోను తండ్రియైన మారేషా.   
 43 హెబ్రోను కుమారులు:  
కోరహు, తప్పూయ, రేకెము, షెమ.   
 44 షెమ కుమారుడు రహము,  
రహము కుమారుడు యోర్కెయాము.  
రేకెము కుమారుడు షమ్మయి.   
 45 షమ్మయి కుమారుడు మాయోను,  
మాయోను కుమారుడు బేత్-సూరు.   
 46 కాలేబు ఉంపుడుగత్తె ఏఫాకు పుట్టినవారు:  
హారాను, మోజా, గాజేజు.  
హారాను కుమారుడు గాజేజు.   
 47 యహ్దయి కుమారులు:  
రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏఫా, షయపు.   
 48 కాలేబు ఉంపుడుగత్తె మయకాకు పుట్టినవారు:  
షెబెరు, తిర్హనా.   
 49 ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు,  
మక్బేనా, గిబియాలకు తండ్రియైన షెవా కూడా పుట్టారు.  
కాలేబు కుమార్తె అక్సా.   
 50 వీరు కాలేబు సంతానము.  
ఎఫ్రాతా మొదటి కుమారుడైన హూరు కుమారులు:  
కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు,   51 బేత్లెహేము తండ్రియైన శల్మా, బేత్-గాదేరు తండ్రియైన హారేపు.   
 52 కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు సంతానం:  
హారోయే, మెనుహోతీయుల్లో సగం మంది,   53 కిర్యత్-యారీము వంశస్థులు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. వీరినుండి సొరాతీయులు, ఎష్తాయులీయులు వచ్చారు.   
 54 శల్మా వారసులు:  
బేత్లెహేము, నెటోపాతీయులు, అత్రోత్-బేత్-యోవాబు, మనహతీయుల్లో సగభాగంగా ఉన్న జారీయులు,   55 యబ్బేజులో నివసించే లేఖికుల†లేదా సోఫేరీయులు వంశాలు: తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులు. వీరు రేకాబీయులకు తండ్రియైన హమాతుకు నుండి వచ్చిన కెనీయులు.