3
దావీదు కుమారులు 
  1 దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు వీరు:  
యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను మొదటి కుమారుడు;  
కర్మెలుకు చెందిన అబీగయీలుకు పుట్టిన దానియేలు రెండవ కుమారుడు;   
 2 గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకా కుమారుడైన అబ్షాలోము మూడవ కుమారుడు;  
హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు;   
 3 అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు;  
దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు.   
 4 ఈ ఆరుగురు దావీదుకు హెబ్రోనులో పుట్టినవారు. అక్కడ అతడు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు.   
దావీదు యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.  5 యెరూషలేములో అతనికి పుట్టినవారు వీరు:  
అమ్మీయేలు కుమార్తెయైన బత్షెబకు*కొ.ప్రా.ప్ర. లలో బత్-షుయ 2 సమూ 11:3 పుట్టిన షమ్మువ,†హెబ్రీలో షిమ్యా షమ్మువ మరొక రూపం షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కుమారులు.   
 6 ఇభారు, ఎలీషువ,‡కొ.ప్ర.లలో ఎలీషామా ఎలీఫెలెతు,   7 నోగహు, నెఫెగు, యాఫీయ,   8 ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు. మొత్తం తొమ్మిదిమంది ఇతర కుమారులు.   
 9 ఉంపుడుగత్తెల ద్వారా దావీదుకు పుట్టిన కుమారులు కాకుండా వీరందరు దావీదు కుమారులు. తామారు వీరికి సోదరి.   
యూదా రాజులు 
  10 సొలొమోను కుమారుడు రెహబాము,  
అతని కుమారుడు అబీయా,  
అతని కుమారుడు ఆసా,  
అతని కుమారుడు యెహోషాపాతు,   
 11 అతని కుమారుడు యెహోరాము,§హెబ్రీలో యోరాము యెహోరాము యొక్క మరో పేరు  
అతని కుమారుడు అహజ్యా,  
అతని కుమారుడు యోవాషు,   
 12 అతని కుమారుడు అమజ్యా,  
అతని కుమారుడు అజర్యా,  
అతని కుమారుడు యోతాము,   
 13 అతని కుమారుడు ఆహాజు,  
అతని కుమారుడు హిజ్కియా,  
అతని కుమారుడు మనష్షే,   
 14 అతని కుమారుడు ఆమోను,  
అతని కుమారుడు యోషీయా.   
 15 యోషీయా కుమారులు:  
మొదటి కుమారుడు యోహానాను,  
రెండవవాడు యెహోయాకీము,  
మూడవవాడు సిద్కియా,  
నాలుగవవాడు షల్లూము.   
 16 యెహోయాకీము వారసులు:  
యెహోయాకీను,*యెకొన్యా యెహోయాకీను యొక్క మరొక పేరు  
అతని సోదరుడు†హెబ్రీలో కుమారుడు, 2 దిన 36:10 చూడండి సిద్కియా.   
చెర తర్వాత రాజ వంశస్థులు 
  17 ఖైదీగా ఉన్న యెహోయాకీను సంతానం:  
అతని కుమారుడు షయల్తీయేలు,   18 మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.   
 19 పెదాయా కుమారులు:  
జెరుబ్బాబెలు, షిమీ.  
జెరుబ్బాబెలు కుమారులు:  
మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సోదరి.   20 మరో అయిదుగురు కూడా ఉన్నారు: హషుబా, ఒహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్-హెసెదు.   
 21 హనన్యా వారసులు:  
పెలట్యా, యెషయా, రెఫాయా కుమారులు, అర్నాను కుమారులు, ఓబద్యా కుమారులు, షెకన్యా కుమారులు.   
 22 షెకన్యా వారసులు:  
షెమయా, అతని కుమారులు: హట్టూషు, ఇగాలు, బారియహు, నెయర్యా, షాపాతు మొత్తం ఆరుగురు.   
 23 నెయర్యా కుమారులు:  
ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము మొత్తం ముగ్గురు.   
 24 ఎల్యోయేనై కుమారులు:  
హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని మొత్తం ఏడుగురు.