యోహాను
వ్రాసిన మూడవ పత్రిక
1
పెద్దనైన నేను,
సత్యంలో ప్రేమించుచున్న నా ప్రియ స్నేహితుడైన గాయికు వ్రాయునది:
 
ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను. కొందరు విశ్వాసులు వచ్చి నీవు సత్యంలో ఎలా జీవిస్తున్నావో చెప్తూ, మీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యమిచ్చినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.
ప్రియ మిత్రుడా, నీకు పరిచయం లేని సహోదరి సహోదరుల*దేవుని కుటుంబానికి చెందిన స్త్రీ పురుషులైన విశ్వాసులకు వర్తిస్తుంది. కోసం నీవు చేస్తున్నదాంట్లో నమ్మకంగా ఉన్నావు. నీ ప్రేమ గురించి వారు సంఘానికి చెప్పారు. దయచేసి దేవుని ఘనపరచే విధంగా వారిని వారి మార్గంలో పంపు. దేవుని ఎరుగనివారి నుండి ఏమి తీసుకోకుండా ఆయన నామం నిమిత్తం వారు బయలుదేరారు. మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి.
నేను సంఘానికి వ్రాశాను, కాని మొదటి స్థానాన్ని ఆశించే దియొత్రెఫే మమ్మల్ని చేర్చుకోవడంలేదు. 10 కాబట్టి నేను వచ్చినపుడు అతడు చేస్తున్న వాటిని వివరిస్తాను. అతడు మా గురించి అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడు. దానితో తృప్తి చెందకుండా, ఇతర విశ్వాసులను చేర్చుకోవడానికి కూడా అంగీకరించడం లేదు. చేర్చుకోవాలనుకునే వారిని కూడ అతడు ఆపివేసి, వారిని సంఘం నుండి వెళ్లగొడుతున్నాడు.
11 ప్రియ మిత్రుడా, చెడును కాక మంచిని మాత్రమే అనుసరించు. మంచి చేసేవారు దేవునికి చెందినవారు. చెడు చేసేవారు దేవుని చూడలేరు. 12 దేమేత్రిని గురించి అందరు మంచిగా చెప్తున్నారు. సత్యం విషయంలో కూడ మంచి సాక్ష్యం ఉంది. మా సాక్ష్యం సత్యమని నీకు తెలుసు.
 
 
13 నేను నీకు వ్రాయవలసినది ఎంతో ఉంది. కాని కలంతో సిరాతో వ్రాయాలని నాకు లేదు. 14 త్వరలో నేను నీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా నీతో మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.
 
15 నీకు సమాధానం కలుగును గాక.
 
ఇక్కడ ఉన్న స్నేహితులు వారి శుభాలను పంపుతున్నారు. అక్కడ ఉన్న స్నేహితులందరికి పేరుపేరున శుభాలు తెలియజేయి.

*1:5 దేవుని కుటుంబానికి చెందిన స్త్రీ పురుషులైన విశ్వాసులకు వర్తిస్తుంది.