కీర్తన 3
దావీదు కీర్తన. తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు వ్రాసినది.
యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు!
నామీదికి ఎంతోమంది లేస్తారు!
“దేవుడు అతన్ని విడిపించడు”
అని అనేకులు నా గురించి చెప్తున్నారు.
సెలా
*సెలా హెబ్రీ భాషలో ఈ పదానికి స్పష్టమైన అర్థం లేదు. ఈ పదం కీర్తనలో తరచుగా వస్తుంది: ఇది సంగీతానికి సంబంధించిన పదం అయి ఉండవచ్చు. కీర్తన 3:4; కీర్తన 3:8లో కూడా
 
కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా,
నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.
నేను యెహోవాకు మొరపెడతాను,
ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు.
సెలా
 
నేను పడుకుని నిద్రపోతాను;
యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.
అన్ని వైపుల నుండి
పదివేలమంది నాపై పడినా నేను భయపడను.
 
యెహోవా, లెండి!
నా దేవా, నన్ను విడిపించండి!
నా శత్రువులందరిని దవడపై కొట్టండి;
దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.
 
రక్షణ యెహోవా నుండి వస్తుంది.
మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక.
సెలా

*కీర్తన 3:2 సెలా హెబ్రీ భాషలో ఈ పదానికి స్పష్టమైన అర్థం లేదు. ఈ పదం కీర్తనలో తరచుగా వస్తుంది: ఇది సంగీతానికి సంబంధించిన పదం అయి ఉండవచ్చు. కీర్తన 3:4; కీర్తన 3:8లో కూడా