కీర్తన 4
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన.
నీతిమంతుడవైన నా దేవా,
నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి*సంభోదన విభక్తి.
నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి;
నాపై దయచూపి నా ప్రార్థన వినండి.
 
ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు?
మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలనులేదా తప్పుడు దేవుళ్ళను వెదుకుతారు అనుసరిస్తారు?
సెలా
యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి;
నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు.
 
వణకండి,లేదా మీ కోపంలో పాపం చేయకండి.
మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ
ప్రశాంతంగా ఉండండి.
సెలా
నీతియుక్తమైన బలులను అర్పించి
యెహోవాపై నమ్మకముంచండి.
 
యెహోవా, “మాకు అభివృద్ధి ఎవరు తెస్తారు?”
అని అనేకులు అడుగుతున్నారు
మీ ముఖకాంతిని మామీద ప్రకాశించనీయండి.
ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నా
ఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు.
 
నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను.
ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే
నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.

*కీర్తన 4:1 సంభోదన విభక్తి

కీర్తన 4:2 లేదా తప్పుడు దేవుళ్ళను వెదుకుతారు

కీర్తన 4:4 లేదా మీ కోపంలో