కీర్తన 75
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగము మీద పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము.
దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము;
మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం;
ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు.
 
“నేను నిర్ణీత సమయంలో;
న్యాయంగా తీర్పు తీరుస్తాను.
భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు,
దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే.
సెలా
అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అని
దుష్టులతో, ‘మీ కొమ్ములను*కొమ్ములను ఇక్కడ బలాన్ని సూచిస్తున్నాయి; 510 వచనాల్లో కూడా ఎత్తకండి.
ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి;
అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు.
 
తూర్పు నుండి కాని పడమర నుండి కాని
అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.
దేవుడే తీర్పు తీరుస్తారు:
ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.
యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది
అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది;
ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు
మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు.
 
నేనైతే నిత్యం ప్రకటిస్తాను;
యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.
10 ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను,
కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు.

*కీర్తన 75:4 కొమ్ములను ఇక్కడ బలాన్ని సూచిస్తున్నాయి; 510 వచనాల్లో కూడా