కీర్తన 120
యాత్రకీర్తన. 
  1 నా బాధలో యెహోవాకు మొరపెడతాను,  
ఆయన నాకు జవాబిస్తారు.   
 2 యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి  
మోసకరమైన నాలుక నుండి  
నన్ను రక్షించండి.   
 3 ఓ మోసకరమైన నాలుకా,  
దేవుడు నీకేం చేస్తారు?  
ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు?   
 4 వీరుల పదునైన బాణాలతో,  
మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.   
 5 నేను మెషెకులో నివసించినందుకు,  
కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!   
 6 సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో  
చాలా కాలం నివసించాను.   
 7 నేను సమాధానం కోరుతున్నాను;  
కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.