కీర్తన 122
దావీదు యాత్రకీర్తన. 
  1 “యెహోవా ఆలయానికి వెళ్దాం” అని  
నాతో అన్న వారితో నేను సంతోషించాను.   
 2 ఓ యెరూషలేమా, మీ గుమ్మాల్లో  
మా పాదాలు నిలిచి ఉన్నాయి.   
 3 యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము;  
అది దగ్గరగా కుదించబడింది.   
 4 ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనం ప్రకారం  
యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి  
వారి గోత్రాలు అనగా  
యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్తాయి.   
 5 అక్కడ తీర్పు కొరకైన సింహాసనాలు ఉన్నాయి,  
అవి దావీదు ఇంటివారి సింహాసనాలు.   
 6 యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి.  
“యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక!   
 7 మీ ప్రాకారాలలో సమాధానం  
మీ కోట గోడలలో అభివృద్ధి ఉండును గాక!”   
 8 నా సోదరులు నా స్నేహితుల కోసం  
“మీలో సమాధానం ఉండును గాక” అని నేను అంటాను.   
 9 మన దేవుడైన యెహోవా మందిరం కోసం  
మీ వృద్ధిని నేను కోరతాను.