కీర్తన 125
యాత్రకీర్తన.
యెహోవాపై నమ్మకము ఉంచేవారు
కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.
యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు,
ఇప్పుడు ఎల్లప్పుడు
యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.
 
నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద
దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు,
లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి
తమ చేతులను ఉపయోగిస్తారు.
 
యెహోవా, మంచివారికి
యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.
అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని
దుష్టులతో పాటు బహిష్కరిస్తారు.
 
ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.