కీర్తన 126
యాత్రకీర్తన. 
  1 యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు,  
మనం కలలుగన్న వారిలా ఉన్నాము.   
 2 మన నోరు నవ్వుతో నింపబడింది,  
మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి.  
“యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని  
ఇతర దేశాలు చెప్పుకున్నాయి.   
 3 యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు,  
మనం ఆనందభరితులం అయ్యాము.   
 4 దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా,  
యెహోవా, మా భాగ్యాలను*లేదా చెరలోనున్న మా వారిని తిరిగి రప్పించండి తిరిగి రప్పించండి.   
 5 కన్నీటితో విత్తేవారు  
సంతోషగానాలతో పంట కోస్తారు.   
 6 విత్తనాలను పట్టుకుని,  
ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు,  
సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.