కీర్తన 128
యాత్రకీర్తన.
యెహోవా పట్ల భయం కలిగి,
ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.
మీరు మీ కష్టార్జితాన్ని తింటారు;
ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.
మీ ఇంట్లో మీ భార్య
ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది;
మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు
ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా పట్ల భయం కలవారు
ఈ విధంగా ఆశీర్వదించబడతారు.
 
సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు;
మీ జీవితకాలమంతా
యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.
మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు
ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.