కీర్తన 131
దావీదు యాత్రకీర్తన. 
  1 యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు,  
నా కళ్లు అహంకారం కలిగిలేవు.  
నేను గ్రహించలేని గొప్ప విషయాలను  
నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.   
 2 పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు,  
అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు,  
నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను.   
 3 ఓ ఇశ్రాయేలు, ఇప్పటినుండి నిరంతరం  
యెహోవా పైనే నీ నిరీక్షణ ఉంచు.