కీర్తన 150
యెహోవాను స్తుతించండి.*హల్లెలూయా; 6 వచనంలో కూడ
 
పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి;
ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.
ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి;
ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
బూర ధ్వనితో ఆయనను స్తుతించండి,
సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.
కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి,
తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.
తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో,
ఆయనను స్తుతించండి.
 
ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి.
 
యెహోవాను స్తుతించండి.

*కీర్తన 150:1 హల్లెలూయా; 6 వచనంలో కూడ