2
నంపజలసచి పెట్టి దేముడు జోచొ ఆత్మ దిలిసి
యేసు మొర అన్నె జీవ్ జా ఉట్ట సత్తు సంతల్ గెతికయ్, ‘పెంతెకొస్తు’ మెన యూదుల్‍చి పండుగు దీసి, యేసుక నంపజలస ఎత్కిజిన్ ఎక్కితె బెద అయ్‍ల. జేఁవ్ ఒత్త ఎక్కితె బెద తతికయ్, ఆగాసుమ్ పక్క తెంతొ, వెల్లొ వాదు గట్టిఙ వీర్తి రితి వెల్లి అవాడ్ అయ్‍లి, చి గేర్ ఒండి జా అవాడ్ సప్పుడు బెర్లి. తెదొడి, కిచ్చొ దెకిల మెలె, ఆగి లగితి రితిసి డీస ఉత్ర జా చెదుర్ప జా, జోవయింక ఎక్కెక్లచ బోడివొచి ఉప్పిరి ఆగివొ లగిల్ రితి జలి. జోవయింతె కక్క నే పిట్తె దస్సి జలి. దస్సి జతికయ్, కక్క నే పిట్తె, దేముడుచి సుద్ది తిలి ఆత్మసెక్తి జోవయించి పెట్టి బెర అయ్‍లి, చి జోవయించి ఆత్మచి సెక్తి తెన్ దొర్కు జలి ఎదిలి, వేర వేర అగ్గె నేన్ల బాసల్ తెన్ జేఁవ్ లట్టబుక దెర్ల.
జేఁవ్ పొదులె, ఒగ్గర్ ఒగ్గర్ దేసిమ్‍లుతె చెదుర్ప జా తిల దేముడుక నిదానుమ్ తెన్ జొకర్త యూదుల్ అన్నె ఉట్ట జా *యెరూసలేమ్ పట్నుమ్‍తె జితె తిల. జలె, యేసుక నంపజలసచి పెట్టి అబ్బొస్‍చి జోచి ఆత్మ బెర్లి జా అవాడ్ సూన, కేనె కేనె తెంతొ నిగ జా, ఒగ్గర్‍జిన్ జేఁవ్ యూదుల్ జా గెరి అయ్‍ల. అయ్‍లె, ఆచారిమ్ జల. కిచ్చొక మెలె, జోవయించ సొంత వేర వేర బాసల్ తెన్ యేసుచ సిస్సుల్ లట్టబ్తె తిల; జేఁవ్ బాసల్ కెఁయ నే సిక తిలె కి, ఆచారిమ్ జా ఎక్కిలొక ఎక్కిలొ, “వేర వేర అమ్‍చ సొంత బాసల్ తెన్ ఈంజేఁవ్ లట్టబ్తస గలిలయులు జవుల గెద? అమ్‍చ బాసల్ నేన్‍తి దస్సి జలె, కీసి జా అమ్‍చ బాసల్ తెన్ లట్టబ్‍తతి” మెన జేఁవ్ ఆచారిమ్ సంగితె తిల. “ఆమ్ పార్తీ దేసిమ్‍చ, మాదీయులు, ఏలామియుల్, పడ్తొ మెసొపొతమియ తెంతొ చి, యూదయ తెంతొచ, కప్పదొకియ తెంతొచ, పొంతు తెంతొచ, ఆసియా తెంతొచ, 10 ప్రుగియ తెంతొచ, పంపూలియా తెంతొచ, ఐగుప్తు దేసిమ్‍చ, పడ్తొ కురేనియు పట్నుమ్‍చి సుట్టునంత తిలి లిబియ దేసిమ్ తెంతొచ. పడ్తొ అన్నె కి అమ్‍తె సగుమ్‍జిన్ రోమ్ దేసిమ్ తెంతొ ఆజి కాలి ఉట్ట జా అస్తి. జోవయింతె సగుమ్‍జిన్ యూదుల్ జెర్మిలస. సగుమ్‍జిన్ అగ్గె యూదుల్ నెంజిలె కి, దేముడుక నంపజా మార్సుప కెరన్లస కి అస్తి. 11 పడ్తొ, క్రేతు దేసిమ్‍చ, అరేబియ దేసిమ్‍చ కి ఇన్నె అస్తి. ఆమ్ ఎత్తివాట్ దేసిమ్‍లు తెంతొ ఉట్ట అయ్‍లె కి, అమ్‍చ సొంత బాసల్ తెన్ ఈంజేఁవ్ లట్టబ, ఈంజెఁవు దేముడుచ ఆచారిమ్‍చ కమొ అమ్‍క సూనయ్‍తతి!” 12 జోవయించి ఆచారిమ్‍చి రిసొ అన్నె కిచ్చొ మెన ఎక్కిలొక ఎక్కిలొ సంగితె తిల మెలె, “అప్పె జర్గు జలిస్‍చి అర్దుమ్ కిచ్చొ?” మెన పుసుక దెర్ల. 13 గని ఒత్త బెర అయ్‍లసతె అన్మానుమ్ జల మాన్సుల్ సగుమ్‍జిన్ కి తిల, జేఁవ్ కిచ్చొ మెల మెలె, “ఈంజేఁవ్ మచ్చ అస్తి” మెన జేఁవ్‍చి రిసొ ఆఁస్తె తిల.
పేతురు లట్టబ్లిసి
14 జలె తెదొడి పేతురు, ఎగరజిన్ సిస్సుల్‍చి నెడిమి టీఁవొజ జా, బెద తిల మాన్సుల్‍క సూన్‍తు మెన, గట్టిఙ అవాడ్ కెరన, సంగుక దెర్లన్. జో ఇసి మెన సంగిలన్, “ఓ అమ్‍చ యూదుల్, ఈంజ యెరూసలేమ్ పట్నుమ్ తిలస ఎత్కిజిని, ఆఁవ్ అప్పె సంగితిసి సరిగా సూన, అర్దుమ్ కెరన. 15 ఈంజేఁవ్ తుమ్ దెకిల మాన్సుల్‍క ‘మచ్చ అస్తి’ మెన తుమ్ మెన్సుతె ఉచర్లి రిసొ మచ్చితి నాయ్. అప్పె పెందలె నొవ్వు గంటల్ జా అస్సె! 16 అప్పె జర్గు జలిస్‍చి రిసొ దేముడు పూర్గుమ్ జోచ కబుర్లు సంగిలొ యోవేలు మెలొసొచి అత్తి సంగిలన్.
17 దేముడు కిచ్చొ సంగితయ్ మెలె, ‘ఆకర్ దీసల్‍క దేసిమ్‍లు ఎత్కితె తిల మాన్సుల్‍చి పెట్టి అంచి ఆత్మ సువ దెయిందె. తుమ్‍చ పుత్తర్లు, దువిద్లుచి అత్తి అంచ కబుర్లు సంగిమ్‍దె. పడ్తొ తుమ్‍చ ఉబెడ్లు, జలె, ఆఁవ్ దెకయ్‍త సివ్నల్ దెకుల, తుమ్‍చ మంత్రమాన్సుల్ కి ఆఁవ్ దెకయ్‍త సివ్నల్ దెకుల. 18 కచితుమ్, మున్సుబోదల్ జలెకి, తేర్‍బోదల్ జలెకి, అంచ సేవ కెర్తస ఎత్కిజిన్‍చి పెట్టి అంచి ఆత్మ సువ దెయిందె, చి అంచ కబుర్లు సంగితె తవుల.
19 ఆగాసుమ్‍తె కి, బూలోకుమ్‍తె కి, వెల్లెల వెల్లెల కమొ కెర, అంచి అదికారుమ్‍క రుజ్జుల్ దెకయిందె. లొఁయి సూఁయి జతిసి, ఆగి లగితిసి, చి దుమ్మొ జతిసి. 20 ప్రబు అన్నె ఉత్ర జతి జా వెల్లి దీసి నే జెతి అగ్గె పొద్దు అందర్ జయెదె, జోను లొఁయి రంగు జయెదె. 21 గని, తూయి నిజుమి పరలోకుమ్‍చొ దేముడు, తుక నంపజతసి, అంక రచ్చించుప కెరు! మెన జోవయించి పెట్టి కో అంక ఎక్కి నిదానుమ్ నంపజవుల గే, జోవయించి పాపుమ్ చెమించుప కెర, జోవయింక రచ్చించుప కెరిందె.’ ”
22 “దస్సి ఉచర కెర, ఒత్త బెద తిల యూదుల్‍క పేతురు అన్నె కిచ్చొ మెలన్ మెలె, ఓ ఇస్రాయేలులు మెంత అమ్‍చ యూదుల్, ఏక్ కోడు తుమ్ సూన. నజరేతు గఁవ్విచొ యేసు కీసి తిలొ గే, తుమ్ జాన్సు. ‘జోక దేముడు దిలి అదికారుమ్ రుజ్జు జవుస్’ మెన, దేముడు జోచి అత్తి తుమ్‍చి మొక్మె వెల్లెల వెల్లెల కమొ కెరవ, రుజ్జుల్ డీసయ్‍లొ. 23 జలె, ‘జర్గు జతిస్, జర్గు జవుస్’ మెన దేముడు అగ్గెయి తెంతొ రెగిడ్లి రితి, జో యేసుక మూర్కుడ్లుచి అత్తి తూమ్ సొర్ప కెర దా, §సిలువతె గలవ మార్లదు. 24 జోక తుమ్ మార్లె కి, జో మొర్ను తెంతొ విడ్దల్ జా, దేముడు జోక అన్నె జియడ్లొ; యేసుచి ఉప్పిరి మొర్నుక అదికారుమ్ నాయ్.
25 “యేసు అగ్గె తెంతొ జానన్లిస్ కిచ్చొ మెలె అమ్‍చొ దావీదు పూర్గుమ్‍చొచి అత్తి దేముడు రెగ్డయ్‍లొ మెలె;
*దేముడు కెద్దొడి తెదొడి అంక తోడు అస్సె మెన దెకిలయ్. కిచ్చొ కి అంక బమ్మ నే కెర్తె, జో అంచి ఉజెతొ పక్క తా తోడు తత్తయ్ మెన దెకిలయ్ చి ఆఁవ్ కదుల్ నే జయి. 26 జాక, సర్దసంతోసుమ్ జలయ్, చి జో ప్రబుచి గవురుమ్‍చి రిసొ గనుమ్ గాయ్‍తొస్ జలయ్. జాకయ్, అన్నె, కిచ్చొ జర్గు జలెకి, అంచి పెట్టి అంచి ఆఁగ్ కి ఆస తెన్ తయెదె. 27 ఆఁవ్ మొర్లె కి, ఆఁవ్ మొర్నుతె గెలె కి, జో అంక ఒత్త ములె నాయ్, తుచి సుద్ది తిలసచి ఆఁగ్ కువితి రితి నే ఒప్పన్‌తె. 28 జితి సెక్తి అంక దా అస్సిస్, చి తుచితె పరలోకుమ్‍తె తిఁయ తా, తుచితె ఆఁవ్ తతిస్‍క అంక పూర్తి సర్దసంతోసుమ్ కెర్తె.”
పేతురు జేఁవ్ బెర తిల యూదుల్‍క ఏద కెరవ, అన్నె కిచ్చొ మెన బోదన కెర్లన్ మెలె, 29 “ఓ బావుడ్లు, అమ్‍చొ దావీదు పూర్గుమ్‍చొచి రిసొ కిచ్చొ మెన కచితుమ్ ఆఁవ్ సంగితసి మెలె, జో మాములుమ్ మాన్సు జా మొర గెలన్, చి జోక మెస్నె రోవ చి అప్పెక మెస్సున్ దస్సే అస్సె. 30 గని మాములుమ్ మాన్సు జలెకి, దేముడు ఒట్టు గలన్ కిచ్చొ మెన నే పిట్తి కచితుమ్ కోడు పూర్గుల్‍క సూనయ్‍లిసి కబుర్లు జో జాన అస్సె. దేముడు జోవయింక కిచ్చొ సంగిలన్ మెలె;
తుమ్‍చి వమ్‍సుమ్‍చొ ఎక్కిలొక తుచి సింగాసనుమ్‍తె వెసడిందె”
31 జాకయ్, జో దేముడు సికయ్‍తికయ్, కిచ్చొ అగ్గె తెంతొ దెకిలి రితి జా దావీదు రెగ్డ అస్సె మెలె;
“క్రీస్తు మొర్లె కి, మొర్నుతె నే తయెదె, జోచి ఆఁగ్ నే కువితె, అన్నె జీఁవ్ జా ఉట్టెదె.”
32 “జలె, ఈంజొ యేసుకయ్ దేముడు అన్నె జియడ్లొ మెన అమ్ ఇన్నె బెర్లస ఎత్కిజిన్ సాచి జా అస్సుమ్. 33 జో, జలె, అన్నె జీవ్ జా ఉట్ట దేముడు అబ్బొస్‍తె పరలోకుమ్‍తె వెగ గెచ్చ గవురుమ్ జా, జోచి ఉజెతొ పక్క వెస అస్సె. చి జో దేముడు అబ్బొసి అగ్గె సంగ తిలి రితి, జోచి సుద్ది తిలి ఆత్మ వంట దెతిసి, పూర్తి జో తుమ్ అప్పె దెకిలిసి సూన్లిసి జర్గు కెర అస్సె.
34 “దావీదు, జలె, పరలోకుమ్‍తె వెగ గెచ్చె నాయ్, గని జో ఇసి సంగిలన్.
దేముడు ప్రబు అంచొ ప్రబుక సంగిలన్. 35 ‘తుక విరోదుమ్ జలస తుచి చాటు సుఁదితి పొద్రొ జతి రితి కెర్తె ఎదక, తుయి అంచి ఉజెతొ పక్క వెస తా.’
36 “జాకయ్, తుమ్ ఇస్రాయేలులు మెల అమ్‍చ యూదుల్ ఎత్కిజిన్‍క ఆఁవ్ కిచ్చొ కచితుమ్ సంగితసి మెలె, తుమ్ సిలువ గల మార్లొ యేసు అమ్‍క దొర్కు జలొ రచ్చించుప కెర్తొసొ జతొ క్రీస్తు జా, ఎత్కిక ఏలుప కెర్తొ ప్రబు జవుస్” ఇసి పేతురు రుజ్జు కెర్లన్.
37 ఈంజ ఎత్కి సూన కెర, ఒత్త బెర తిల యూదుల్, “నిజుమి దేముడుచొ పుత్తుస్‍క మార పాపుమ్ కెర్లమ్ మెన జోవయించి పెట్టి దుకుమ్ తెన్ ఒప్పన, బియఁ గెచ్చ, ఓ బావుడ్లు, అమ్‍చి పాపుమ్ గెస్సు మెన అమ్ అప్పె కిచ్చొ కెర్లె జయెదె?” మెన పేతురుక చి జోవయింతెన్ తిల యేసుచ అన్నె బారికుల్‍క పుసిల. 38 జేఁవ్‍క, పేతురు, “తుమ్ కెర్ల పాపల్‍చి రిసొ దుకుమ్ జా పాపుమ్ ముల్తి బుద్ది జా యేసుక్రీస్తుక నంపజా, తుమ్‍చి పాపుమ్ గెచ్చయ్‍తి గుర్తుక జోచి నావ్ తెన్ బాప్తిసుమ్ కడన్క. దస్సి కెర్లదు మెలె, దేముడుచి సుద్ది తిలి ఆత్మ తుమ్‍క దొర్కు జయెదె. 39 జోచి కక్క ప్రబు జలొ అమ్‍చొ దేముడు నిసాన్‍దె గే, ‘జోవయించి పెట్టి అమ్‍చి సుద్ది తిలి ఆత్మ దెయెదె’ మెన, తుమ్‍చి రిసొ కి, తుమ్‍చ బోదల్‍చి రిసొ కి, పడ్తొచ మాన్సుల్‍క కి, పడ్తొ దూరి దేసిమ్‍లుచ మాన్సుల్‍చి రిసొ కి సంగ అస్సె” ఇసి పేతురు జేఁవ్‍క సంగిలన్. 40 పడ్తొ అన్నె సాచుల్ రుజ్జుల్ బెదవ, జోవయింక కిచ్చొ మెన బతిమాల్ప జా సంగిలన్ మెలె, “పాపుమ్‍బుద్ది తిల ఈంజ ఉగుమ్‍చ మాన్సుల్‍చి బుద్ది ముల, విడ్దల్ కెరన, రచ్చించుప జా” మెన సంగిలన్. 41 జోచి కోడు సూన నంపజలస, జలె, బాప్తిసుమ్ నఙన్ల. చి జా దీసి రమారమి తిన్ని వెయిల్‍జిన్ మాన్సుల్ అగ్గె నంపజల సిస్సుల్ తెన్ బెదిల.
42 జా దీసి తెంతొ, నిదానుమ్ తెన్ యేసుచ బారికుల్‍చి బోదన సూన్‍తె తా, సిస్సుల్ తెన్ సర్ద తెన్ బెద, మాన్సుల్‍చి పాపుమ్ గెచ్చయ్‍తిస్‍క యేసు బలి జలొచి జా గుర్తు దెకయ్‍తి పోడియొ, ద్రాచ రస్సుమ్ కంక పింక అలవాట్ జల, జోవయింతెన్ నిదానుమ్ తెన్ ప్రార్దన కెర్తె తిల.
43 ఎత్కిజిన్ ఉచర ఉచర ఆచారిమ్ తెన్ తిల, చి జేఁవ్ బారికుల్‍చి అత్తి ప్రబు ఒగ్గర్ వెల్లెల కమొ జర్గు జలి. 44 పడ్తొ, నంపజలస ఎత్కిజిన్ సర్ద తెన్ ఎక్కి మెన్సు తెన్ తిల, చి బీద సుదల్, సొమ్సార్లు, కోయి ముస్క నే జతె, ఎక్కిలొక ఎక్కిలొ తోడు దెతె తిల. 45 ఆస్తి తిల మాన్సుల్ జోవయించి వికన, నెంజిల మాన్సుల్‍క తోడు దెతె తిల. ఎక్కిలొక కొత్కు తిలెగిన, అన్నెక్లొ జోక తోడు దెంక. 46 దేముడుచి గుడితె బెద, ప్రబుక ఉచరుక మెన రోజుక గెతె తిల, చి జోవయించి గెరలె, ఎక్కిలొక ఎక్కిలొ అన్నిమ్‍క బుకారా, జా పోడియొ కా, జా ద్రాచ రస్సుమ్ పియఁ, సర్దసంతోసుమ్ తెన్ కట్టు తెన్ తిల. 47 దేముడుచి గవురుమ్ సంగితె తిల, చి ఎత్కిజిన్ జోవయింక మెన్సిత్ తిల, చి ప్రబు రోజుక కక్క కక్క నొవ మాన్సుల్‍క నిసాన రచ్చించుప కెర నంపజలస మొత్తుమ్‍చి సంగుమ్‍తె బెదయ్‍తె తిలన్.
* 2:5 2:5 ఒండి లోకుమ్‍క ఎక్కి జా యెరూసలేమ్ పట్నుమ్‍తె ఎత్కి అదికారుమ్ తిలొ దేముడుచి గుడి తిలిచి రిసొ ఒత్త గెచ్చ తిల. 2:16 2:16 పూర్గుమ్ పొది ఎత్కి అదికారుమ్ తిలొ దేముడు కక్క గే నిసాన, “ఈంజ జా కబుర్ సంగు” మెన జోవయించి ఆత్మసెక్తి జో మాన్సుచి పెట్టి దా లట్టబడెదె. 2:21 2:21 ‘పరలోకుమ్‍చొ దేముడు’ మెన ఇన్నె రెగిడ్లిస్‍క గ్రీకు బాసతె తొలితొ రెగిడ్ల పుస్తకల్‍తె ‘ప్రబు’ మెలి అర్దుమ్‍చి కోడు అస్సె. ‘ప్రబు’ మెలె, యేసుచి రిసొ ఒగ్గర్ సంగితతి, గని దేముడు అబ్బొస్‍క కి ‘ప్రబు’ మెన సంగుల జా అర్దుమ్ కిచ్చొ మెలె ఎత్కి ఏలుప కెర్తొసొ జో దేముడు అబ్బొస్‍చి నావ్ ‘యెహోవ’ జయెదె, గని జా నావ్ దెరుక యూదుల్ బియఁ కెర ‘ప్రబు’ మెనుల. § 2:23 2:23 మార్కు 15:24చి ఎట్టొచి కోడు దెక. * 2:25 2:25 నెంజిలె ‘ప్రబు’. 2:28 2:28 యేసుక దేముడు అబ్బొసి అన్నె జియడెదె మెలిస్‍చి రిసొచి కోడు ఈంజ. యేసు దేముడు అబ్బొస్ తెన్ లట్టబ్లి రితి కోడు.