కీర్తన 80
సంగీత దర్శకునికి. “నిబంధన కలువలు” అనే రాగము మీద పాడదగినది. ఆసాపు కీర్తన.
ఇశ్రాయేలు ప్రజల కాపరీ,
యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి.
కెరూబుల*కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు. మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా,
ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రాల ఎదుట ప్రకాశించండి.
మీ పరాక్రమాన్ని చూపించండి;
వచ్చి మమ్మల్ని రక్షించండి.
 
ఓ దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి;
మేము రక్షింపబడేలా
మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
 
సైన్యాల యెహోవా దేవా,
ఎంతకాలం మీ ప్రజల ప్రార్థనలకు వ్యతిరేకంగా
మీ కోపం మండుతుంది?
మీరు వారికి కన్నీటిని ఆహారంగా ఇచ్చారు;
మీరు వారిని గిన్నె నిండ కన్నీరు త్రాగేలా చేశారు.
మమ్మల్ని మా పొరుగువారికి హాస్యాస్పదంగాబహుశ ప్రా. ప్ర. లలో వివాదాస్పదం చేశారు.
మా శత్రువులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.
 
సైన్యాలకు అధిపతియైన దేవా, మమ్మల్ని పునరుద్ధరించండి;
మేము రక్షింపబడేలా
మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
 
మీరు ఈజిప్టు నుండి తెచ్చిన ద్రాక్షతీగను నాటారు;
మీరు దేశాలను వెళ్లగొట్టి దాన్ని నాటారు.
మీరు దాని కోసం భూమిని శుభ్రం చేశారు,
అది వేళ్ళూనుకొని భూమిని నింపింది.
10 దాని నీడ పర్వతాలను కప్పింది,
దాని తీగలు దేవదారు చెట్లను కప్పాయి.
11 దాని కొమ్మలు సముద్రంబహుశ మధ్యధరా సముద్రం కావచ్చు వరకు,
దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకు వ్యాపించాయి.
 
12 దారిని వెళ్లేవారంతా దాని ద్రాక్షలు తెంపేలా
దాని కంచెలను మీరెందుకు పడగొట్టారు?
13 అడవి పందులు దానిని నాశనం చేస్తున్నాయి,
పొలాల నుండి వచ్చే కీటకాలు దానిని తింటున్నాయి.
14 సైన్యాలకు అధిపతియైన దేవా, మా దగ్గరకు తిరిగి రండి!
ఆకాశం నుండి ఇటు చూడండి!
ఈ ద్రాక్షవల్లిని గమనించండి.
15 అది మీ కుడి హస్తం నాటిన వేరు,
మీ కోసం మీరు పెంచుకొన్న కుమారుడు.§లేదా కొమ్మ
 
16 మా ద్రాక్షవల్లి నరకబడి అగ్నితో కాల్చబడింది;
మీ గద్దింపుకు మీ ప్రజలు నశిస్తారు.
17 మీ కుడి వైపున ఉన్న మనుష్యుని మీద,
మీ కోసం మీరు పెంచిన మనుష్యకుమారుని మీద మీ హస్తాన్ని ఉంచండి.
18 అప్పుడు మేము మీ దగ్గర నుండి వెళ్లము;
మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, మీ పేరట మేము ప్రార్థిస్తాము.
 
19 సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి;
మేము రక్షింపబడేలా,
మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.

*కీర్తన 80:1 కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.

కీర్తన 80:6 బహుశ ప్రా. ప్ర. లలో వివాదాస్పదం

కీర్తన 80:11 బహుశ మధ్యధరా సముద్రం కావచ్చు

§కీర్తన 80:15 లేదా కొమ్మ